చాగల్లు మండలం చాగల్లు లే అవుట్ లో కలెక్టర్ సందర్శనచాగల్లు (ప్రజా అమరావతి) : 


చాగల్లు  మండలం  చాగల్లు లే అవుట్ లో కలెక్టర్ సందర్శనఇసుక, సిమెంట్, ఐరన్ కి ఇబ్బందులు లేదు


త్వరలోనే మౌలిక సదుపాయాలు అందుబాటులో కి తీసుకుని వస్తాం


క్షేత్రస్థాయిలో వాలంటీర్ వారీగా ప్రగతిపై సమీక్ష 


కలెక్టర్ మాధవీలత 


జగనన్న కాలనీల్లో ఇండ్ల నిర్మాణాలను చేపట్టి పూర్తి చేసేలా వాలంటీర్లు లబ్ధిదారులకు ప్రేరణ కలిగించాలని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత పేర్కొన్నారు.


 శుక్రవారం సాయంత్రం చాగల్లు లోని లే అవుట్ -1 లో కాలనీలో పర్యటించి, లబ్ధిదారులతో ముఖాముఖి సంభాషించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, నవరత్నాలు కార్యక్రమంలో ప్రభుత్వం ఇళ్లు లేని పేదలకు స్వంత ఇంటి కల సాకారం చెయ్యాలని సంకల్పించడం జరిగిందని అన్నారు. ఈ లే అవుట్ లో 575 మంది లబ్ధదారులకు ఇళ్ళ స్థలాల కేటాయించామన్నరు. 20 మంది లబ్దిదారులు ఇళ్ల నిర్మాణం పూర్తి మరికొందరికి స్ఫూర్తిగా నిలిచారన్నారు. మరో 223 ఇళ్ళు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. ప్రభుత్వం ఇళ్ల నిర్మాణం కోసం సిమెంట్, ఇసుక, ఐరన్ తదితర ముడి సరుకులను లే అవుట్ లోనే అందుబాటులో  ఉంచుతున్నట్లు తెలిపారు. 

ఇసుక, సిమెంట్, ఐరన్ కి ఇబ్బందులు లేదని తెలిపారు. విద్యుత్ , త్రాగునీరు , రహదారులు తదితర మౌలిక సదుపాయాలు అందుబాటులో తీసుకుని రావడం జరుగుతుందని పేర్కొన్నారు.


ఇంటి నిర్మాణం కోసం స్వయం సహాయక సంఘాలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని కోరారు. దశల వారీగా  ఇంటి నిర్మాణం పూర్తి అయిన తదుపరి ఆయా దశలకు చెందిన నగదును లబ్దిదారుల ఖాతాకు జమ చేయడం జరుగుతుందన్నారు. వాలంటీర్లు లబ్ధిదారుల్లో ప్రేరణ కలిగించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 


ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి, నెట్ కెప్ డి. యం. జి. సత్యనారాయణ, కొవ్వూరు ఆర్డీఓ ఎస్. మల్లిబాబు, ఇంఛార్జి పిడి డ్వామా పి. జగదాంబ, సర్పంచ్ ఉన్నమట్ల  మనస్సాంతి, జుట్టా కొండలరావు, బొర్రా రజినీప్రసాద్, గండ్రోతు సూర్యానారాయణ, యం. డి. ఓ బి.రాంప్రసాద్ , హౌసింగ్  ఎ ఇ శ్రీనివాసరావు , కార్యదర్శి రవికుమార్,  ఎంపిటీసి లు కార్యదర్శులు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, లబ్ధిదారులు, వాలంటీర్లు  తదితరులు పాల్గొన్నారు.

Comments