*చెత్త నుంచి సంపద తయారీని నిత్యం కొనసాగించాలి*
*: జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్.*
పుట్టపర్తి (శ్రీ సత్యసాయి జిల్లా), మే 28 (ప్రజా అమరావతి):
జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమంలో భాగంగా చెత్త నుంచి సంపద తయారీని నిత్యం కొనసాగించాలని జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్ ఆదేశించారు. శనివారం పుట్టపర్తి మండలం కప్పలబండ పంచాయతీలోని చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జగనన్న స్వచ్ఛ సంకల్పం కింద చెత్త నుంచి సంపద తయారీ ప్రక్రియను నిత్యం చేపట్టాలన్నారు. తడి, పొడి చెత్త సేకరణతో గ్రామీణ ప్రాంతాల్లో పరిశుభ్రంగా ఉంటుందని, క్లాప్ మిత్రలు ఇంకా బాగా పనిచేసి గ్రామాలన్నీ పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. ప్రభుత్వం ఇస్తున్న 6 వేల రూపాయలకు ఇక్కడ పనిచేస్తున్న క్లాప్ మిత్రలు ఎక్కువ పని చేస్తున్నారని, మీరు చెత్త సేకరణ చేయకపోతే గ్రామలన్నీ అపరిశుభ్రంగా ఉంటాయని, మీరు చేస్తున్న పనికి మిమ్మల్ని గౌరవిస్తున్నామని జిల్లా కలెక్టర్ తెలిపారు. చెత్త నుంచి సంపద తయారీ కేంద్రంలో పనిచేస్తున్న ఆదినారాయణ, నరసింహులు, రమేష్ ను శాలువాలు కప్పి పూలహారాలు వేసి జిల్లా కలెక్టర్ సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ రాఘునాథ్ గుప్త, ఈఓఆర్డీ అశోక్ కుమార్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శులు గంగాధర్ నాయక్, నరసింహమూర్తి, సర్పంచ్ పెద్దన్న, ఎంపీటీసీ, పారిశుద్ధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment