డిమాండ్‌ను అంచనా వేసుకుని ఆ మేరకు కార్యాచరణ చేసుకోవాలన్న సీఎం.




అమరావతి (ప్రజా అమరావతి);

*–విద్యుత్‌ శాఖపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష.*

*–విద్యుత్‌ డిమాండ్, సప్లై, పూర్తిచేయాల్సిన ప్రాజెక్టులు, భవిష్యత్‌లో చేపట్టనున్న ప్రాజెక్టులు తదితర అంశాలను సమీక్షించిన సీఎం.* 


*దేశవ్యాప్తంగా బొగ్గు సరఫరాలో సంక్షోభం:*

–విద్యుత్‌రంగంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను సీఎంకు వివరించిన అధికారులు.

– దేశవ్యాప్తంగా నెలకొన్న బొగ్గు సరఫరా సంక్షోభం, విద్యుత్‌ ఉత్పత్తి రంగంపై పడ్డ ప్రభావం తదితర అంశాలను వివరించిన అధికారులు.

– అంతర్జాతీయంగా, దేశీయంగా వచ్చిన పరిణామాలతో బొగ్గుకు తీవ్ర కొరత ఏర్పడిందన్న అధికారులు.

– బొగ్గు సరఫరాలో తీవ్ర అంతరాయంతో పలు రాష్ట్రాల్లో తీవ్ర కొరత ఉందన్న అధికారులు.

సరిపడా రైల్వే ర్యాక్స్‌ను సరఫరా చేయలేకపోతున్నారు.

– వెసల్స్‌ కూడా తగినంతగా అందుబాటులో లేకపోవడం, విదేశాల్లో బొగ్గు ధరలు విపరీతంగా పెరగడం... ఈ కారణాలన్నీ విద్యుత్తు కొరతకు దారితీశాయన్న అధికారులు.

– మరోవైపు డిమాండు కూడా గతంలో కన్నా అనూహ్యంగా పెరిగిందన్న అధికారులు.

– గడచిన మూడేళ్లుగా వర్షాలు బాగా కురిశాయని, భూగర్భజలాలు, బావుల్లో నీళ్లు పుష్కలంగా ఉండడం వల్ల వ్యవసాయరంగం నుంచి కూడా డిమాండ్‌ స్థిరంగా ఉందన్న అధికారులు:

– మరోవైపు కోవిడ్‌ పరిస్థితుల తర్వాత పారిశ్రామిక ఉత్పత్తిరంగం పుంజుకుందని తెలిపిన అధికారులు.

– వేసవి ఉష్ణోగ్రతలు కూడా అధికస్థాయిలో ఉన్నాయని, ఫలితంగా అధిక వినియోగం ఉందని తెలిపిన అధికారులు.

– ఏప్రిల్‌ 8న అత్యధికంగా రాష్ట్రంలో విద్యుత్‌ డిమాండ్‌ 12,293 మిలియన్‌ యూనిట్లకు చేరిందని, రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక డిమాండ్‌ ఇదని పేర్కొన్న అధికారులు.


*ఎంత ఖర్చైనా కొనుగోలు:*

– వినియోగదారులకు ఇబ్బందులు రాకూడదనే ఉద్దేశంతో భారీ ఎత్తన విద్యుత్తును కొనుగోలు చేసిన విషయాన్ని సమావేశంలో తెలిపిన అధికారులు.

– మార్చిలో సగటున రోజుకు రూ.36.5 కోట్లు ఖర్చు చేసి విద్యుత్‌ కొనుగోలు చేశామని, ఏప్రిల్‌లో సగటున రోజుకు రూ.34.08 కోట్లు వెచ్చించి కరెంటు కొన్నామన్న అధికారులు. 

– వినియోగదారులు ఇబ్బంది పడకుండా, కరెంటు కోతలను అధిగమించడానికి, మార్చి నెలలో మొత్తంగా 1268.69 మిలియన్‌ యూనిట్లను రూ.1123.74 కోట్లు వెచ్చించి కొన్నామని, ఏప్రిల్‌లో 1047.78 మిలియన్‌ యూనిట్లు రూ.1022.42 కోట్లతో కొన్నామని తెలిపిన అధికారులు.


– బొగ్గు విషయంలో రానున్న రెండు సంవత్సరాలు ఇలాంటి పరిస్థితులే కొనసాగుతాయన్న సంకేతాలు కేంద్రం నుంచి వచ్చాయన్న అధికారులు.

– జనరేషన్‌ ప్లాంట్లకు కావాల్సిన బొగ్గులో కనీసం 10 శాతం వరకూ విదేశాల నుంచి తెచ్చుకోవాల్సిన అవసరాన్ని కేంద్ర ప్రభుత్వ అధికారులు నొక్కిచెప్తున్నారని వెల్లడించిన అధికారులు.

– డిమాండ్‌ను అంచనా వేసుకుని ఆ మేరకు కార్యాచరణ చేసుకోవాలన్న సీఎం.

– బొగ్గు కొనుగోలు విషయంలో ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు సాగాలన్న సీఎం.


అనూహ్య డిమాండ్‌ ఉన్నా కొన్ని నెలల్లో పీక్‌ సమయాల్లోనూ మిగులు విద్యుత్తు:

– సెకీతో ఒప్పందం కారణంగా సుమారు 45 మిలియన్‌ యూనిట్లు రాష్ట్రానికి దశలవారీగా అందుబాటులో వస్తోందన్న సీఎం.

– మూడు సంవత్సరాల్లో మొత్తం మూడు దశల్లో అందుబాటులోకి సెకీ విద్యుత్తు వస్తోంది:

– 2023 చివరి నాటికి  మొదటి దశలో సుమారు 18 మిలియన్‌ యూనిట్లు, రెండో దశలో సుమారు 18 మిలియన్‌ యూనిట్లు, మూడో దశలో సుమారు 9 మిలియన్‌ యూనిట్లు విద్యుత్‌ అందుబాటులోకి వస్తుందన్న సీఎం


దీంతోపాటు రాష్ట్రంలో కృష్ణపట్నంలో కొత్తగా 800 మెగావాట్లు, వీటీపీఎస్‌లో కొత్తగా 800 మెగావాట్ల ధర్మల్‌ విద్యుత్‌ యూనిట్లు అందుబాటులోకి వస్తున్నాయి:

85శాతం పీఎల్‌ఎఫ్‌ అంచనా వేసుకుంటే మరో 30 మిలియన్‌ యూనిట్లు అందుబాటులోకి వస్తుంది:

మొత్తంగా  48 మిలియన్‌ యూనిట్లు అతిత్వరలో రాష్ట్రానికి అందుబాటులోకి వస్తోంది:


సీలేరులో కొత్తగా 1350 మెగావాట్ల కొత్త ప్రాజెక్టును వీలైనంత వేగంగా పూర్తిచేయడానికి దృష్టిపెట్టాలి: సీఎం

డీపీఆర్‌ పూర్తయ్యిందని, త్వరలోనే టెండర్లు పిలుస్తున్నామన్న అధికారులు

కృష్ణపట్నం నుంచి 800 మెగావాట్ల విద్యుత్తు.

జులై–ఆగస్టు కల్లా కృష్ణపట్నం విద్యుత్తు వినియోగదారులకు అందనుందని తెలిపిన అధికారులు. 

విజయవాడ థర్మల్‌ కేంద్రంలో 800 మెగావాట్ల విద్యుత్పత్తి పనులు కూడా వీలైనంత త్వరగా పూర్తిచేయాలని సీఎం ఆదేశం.

పోలవరం పవర్‌ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపిన అధికారులు

ఇప్పటికే టన్నెల్స్‌ తవ్వకం పూర్తయ్యిందన్న అధికారులు

ఈ ప్రాజెక్టుల వల్ల పెద్ద ఎత్తున మిగులు విద్యుత్తును సాధించగలుగుతాం:


– పారిశ్రామిక రంగానికి నిరంతర విద్యుత్తు సరఫరాపై మళ్లీ చర్యలు తీసుకోవాలి:

– ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల పరిస్థితులు రాకుండా చూడాలి:

– వారి డిమాండ్‌కు తగినట్టుగా విద్యుత్తును సరఫరాచేయాలి:

– ఈ విషయంలో పారిశ్రామిక రంగ వ్యక్తులతో కలిసి ఒక కార్యాచరణ రూపొందించుకోవాలి:

– వచ్చే వేసవిలో ఇలాంటి సమస్యలు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలి:


*ప్లాంట్ల నిర్వహణలో అత్యున్నత ప్రమాణాలు సాధించాలి:*

– జెన్‌కో ఆధ్వర్యంలో ఉన్న  ప్లాంట్లను అత్యుత్తమ సామర్థ్యంతో నిర్వహించాలన్న సీఎం

– 85శాతం పీఎల్‌ఎఫ్‌ సామర్థ్యంతో నడిపేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు.

– దీనివల్ల నాణ్యమైన విద్యుత్తు, మంచి ధరకే అందుబాటులోకి వస్తోంది:

–అంతేకాకుండా... విద్యుత్‌ ఉత్పత్తి ఖర్చులు తగ్గించేలా ఆలోచనలు చేయాలి:

– ఖర్చులు తగ్గినా ఆదాయం వచ్చినట్టు లెక్క:


పంప్డ్‌ స్టోరేజీ హైడ్రో ఎలక్ట్రికల్‌ ప్రాజెక్టుల ద్వారా భవిష్యత్తుకు భరోసా:

– విద్యుత్‌ ఉత్పత్తి రంగంలో ప్రపంచవ్యాప్తంగా పలు మార్పులు:

– పర్యావరణ హిత విధానాలతో విద్యుత్‌ ఉత్పత్తి:

– బొగ్గు ఆధారిత ప్లాంట్ల నుంచి మళ్లుతున్న ప్రపంచం:

– ఇలాంటి పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ విధానాలు అవసరం:

– పంప్డ్‌ స్టోరేజీ హైడ్రో పవర్‌ ప్రాజెక్టులు, విద్యుత్‌ రంగంలో ఉత్తమ ప్రత్యామ్నాయ పద్ధతి:

– రాష్ట్రంలో 29 చోట్ల ఈ ప్రాజెక్టులకు అవకాశాలున్న నేపథ్యంలో వీటిపై దృష్టిపెట్టాలి, తదేక శ్రద్ధతో దీనిపై పనిచేయాలి:

– భూ సేకరణ దగ్గరనుంచి అన్నిరకాలుగా సిద్ధంకావాలి:

– ప్రతిపాదిత ప్రాజెక్టులు పూర్తైతే 33,240 మెగావాట్ల విద్యుత్తు అందుబాటులోకి వస్తుంది:

– పీక్‌ అవర్స్‌లో అధిక ఖర్చుకు విద్యుత్తు కొనుగోలు చేసే ఇబ్బందులు, పంప్డ్‌ స్టోరేజీ హైడ్రో ఎలక్ట్రికల్‌ ప్రాజెక్ట్‌ వల్ల తొలగిపోతాయి:

– ఒక్కసారి ప్రాజెక్టు పెట్టిన తర్వాత గరిష్టంగా 90 ఏళ్లపాటు ఆ కరెంటు అందుబాటులో ఉంటుంది:



*ఉచిత విద్యుత్తు-డీబీటీ*

ఉచిత విద్యుత్త డబ్బు రైతుల ఖాతాల్లోకే, వారిద్వారానే డిస్కంలకు చెల్లింపులు: 

– డీబీటీ ద్వారా ఉచిత విద్యుత్తు డబ్బు రైతుల ఖాతాలోకే: సీఎం

– నేరుగా రైతులే చెల్లించేలా ఏర్పాటు : సీఎం

– దీనివల్ల విద్యుత్తు సేవలకు సంబంధించి రైతు ప్రశ్నించగలుగుతాడు:

– ఎక్కడ ఇబ్బంది వచ్చినా.. వెంటనే సిబ్బందిని ప్రశ్నించగలడు:

– విద్యుత్తు శాఖకూడా రైతులనుంచి వచ్చే అభ్యంతరాల పరిష్కారంపై నిరంతరం ధ్యాసపెట్టగులుగుతుంది, జవాబుదారీతనం పెరుగుతుంది:

– మీటర్లు కాలిపోవడం, మోటార్లు కాలిపోవడం లాంటి ఘటనలు పునరావృతం కాకుండా నాణ్యమైన కరెంటు అందడంతో పాటు మంచి సేవలు రైతులకు అందుతాయి:


*శ్రీకాకుళంలో పైలట్‌ ప్రాజెక్టు విజయవంతం:*

– శ్రీకాకుళంలో చేపట్టిన పైలట్‌ప్రాజెక్ట్‌ విజయవంతం అయ్యిందన్న అధికారులు.

– జిల్లాలో ఉచిత విద్యుత్తు కనెక్షన్లకు మీటర్లు అమర్చామని,  రైతుల ఖాతాలనుంచి చెల్లింపులు జరుగుతున్నాయని తెలిపిన అధికారులు

– 2020–21 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో 26,083 కనెక్షన్లకు 101.51 మిలియన్‌ యూనిట్ల కరెంటు ఖర్చయ్యిందని తెలిపిన అధికారులు.

– 2021– 2022 ఆర్థిక సంవత్సరంలో కనెక్షన్లు పెరిగి 28,393కు చేరుకున్నాయని, అయినా సరే 67.76 మిలియన్‌ యూనిట్ల కరెంటు మాత్రమే వినియోగించారని తెలిపిన అధికారులు.

– సంస్కరణల వల్ల, రైతుల ఖాతాల ద్వారా చెల్లింపులు వల్ల కనెక్షన్లు పెరిగినా 33.75 మిలియన్‌ యూనిట్ల కరెంటు ఆదా అయ్యిందని, రైతులకూ నాణ్యమైన విద్యుత్తు అందుతోందని తెలిపిన అధికారులు.


*పారదర్శకంగా జలకళ*

వైయస్సార్‌ జలకళను పారదర్శకంగా అమలు చేయాలన్న సీఎం.

మేనిఫెస్టోలో కేవలం బోరు మాత్రమే వేస్తామని చెప్పాం: సీఎం


కాని మనం మోటారు ఉచితంగా ఇస్తున్నాం, దాంతోపాటు రూ.2 లక్షల విలువైన విద్యుద్దీకరణ పనులను ఉచితంగా చేస్తున్నాం:

రైతులకు దీనివల్ల మరింత మేలు జరుగుతుంది: సీఎం. 


ఈ సమీక్షా సమావేశంలో విద్యుత్, అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎస్‌ సమీర్‌ శర్మ, ఏపీజెన్‌కో ఎండీ బి శ్రీధర్, ఎన్‌ఆర్‌ఈడీసీఏపీ ఎండీ ఎన్‌ వి రమణారెడ్డి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Comments