పవిత్ర రంజాన్ (ఈద్ ఉల్ ఫిత్ర్) పండుగ నమాజ్ (ప్రార్థన) కు అన్ని ఏర్పాట్లు పూర్తి.



* పవిత్ర రంజాన్ (ఈద్ ఉల్ ఫిత్ర్)  పండుగ నమాజ్ (ప్రార్థన) కు అన్ని ఏర్పాట్లు పూర్తి.



:: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్.బి. అంజాద్ బాషా ::


కడప- మే, 2 (ప్రజా అమరావతి):- కడప నగరంలో  పవిత్ర రంజాన్ (ఈద్ ఉల్ ఫిత్ర్)  పండుగ నమాజ్ (ప్రార్థన) కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి యస్ బి అంజాద్ బాషా అన్నారు. సోమవారం పవిత్ర రంజాన్ (ఈద్ ఉల్ ఫిత్ర్)  పండుగను పురస్కరించుకొని స్థానిక బిల్టప్ వద్దగల అమీనియా ఈద్గా, దండు ఈద్గా, మామిల్లపల్లిలోని ముఖ్తి రహీం ముల్లా ఖాన్ ఈద్గా ల వద్ద నమాజ్ చేసుకోవడానికి ఏర్పాట్లను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర మైనారిటీ శాఖ మంత్రి వర్యులు ఎస్.బి. అంజాద్ బాషాగారు అధికారులు,ముస్లిం మత పెద్దలతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత దేశ వ్యాప్తంగా రంజాన్ మాసం, రంజాన్ (ఈద్ ఉల్ ఫిత్ర్)  పండుగను పురస్కరించుకొని కడప నగరంలో ఉండే అమీనియా ఈద్గా బిల్టప్ వద్ద గత 15 సంవత్సరాలుగా ఈ ఈద్గాలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో, అదేవిధంగా కడప మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఇక్కడికి వచ్చి నమాజ్ (ప్రార్థనలు) చేస్తున్న వారందరికీ మౌలిక సదుపాయాల కల్పన ఉద్దేశము తో ఇక్కడ పూర్తి స్థాయిలో పెండాల్స్ ( చలువ పందిర్లు), కార్పెట్ మ్యాట్లు, వాజూ చేసుకోవడానికి నీరు, వేసవి కారణంగా త్రాగు నీటి ఏర్పాటు,పి ఎ సిస్టం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈ ఏడాది ఎండలు అధికంగా ఉన్న కారణంగా అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. అలాగే బిల్టప్ లోని అమీనియా ఈద్గాలో నమాజ్ (ప్రార్థన) సమయాన్ని కూడా మార్చడం జరిగిందని, గతంలో ఉదయం 11.30 గంటలకు ఉండేదని, ఈ ఏడాది ఎండలు అధికంగా ఉండడంతో రంజాన్ (ఈద్ ఉల్ ఫిత్ర్)  నమాజ్ ను  మతగురువులు తెలిపిన విధంగా ఉదయం 11.30 గంటలకు కాకుండా ముందుగానే ఉదయం 10.00 గంటలకే రంజాన్ (ఈద్ ఉల్ ఫిత్ర్) నమాజ్ చేయడం జరుగుతుందని అన్నారు. ఈ విషయాన్ని ప్రజలందరూ గమనించ వలసినదిగా కోరుతున్నానమన్నారు.  రంజాన్ (ఈద్ ఉల్ ఫిత్ర్) నమాజ్ చేసే ముస్లిం సోదరులు అందరూ ఉదయం 10.00 గంటలకే బిల్టప్ దగ్గర ఉన్న అమీనియా ఈద్గాకు రావలసిందిగా తెలియజేయడమైనదన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు, పోలీస్ శాఖ అధికారులకు ముందస్తుగానే అన్ని ఏర్పాట్లు పటిష్టంగా చేయవలసిందిగా ఆదేశించడం జరిగింది అన్నారు. రేపు అనగా 3-5-2022 తేదీన (మంగళవారం) ఈద్గా వద్ద ట్రాఫిక్ నిబంధనలు అమలు , బ్యారిగేట్స్ ఏర్పాటు చేసి కేవలం ప్రార్థనలకు వచ్చే వారికి మాత్రమే అనుమతించడం జరుగుతుందన్నారు. ఈద్గా కు సమీపంలో ఉన్న ప్రాంతంలో పార్కింగ్ ఏర్పాటుకు పోలీసు అధికారులకు చెప్పడం జరిగిందన్నారు.   ఉదయానికి అంతా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అన్నారు. అలాగే ప్రార్ధనకు వచ్చేవారు ముందస్తుగానే ఉదయం 10.00 గంటలకే (ఈద్ ఉల్ ఫిత్ర్) నమాజ్ ఉంటుంది కనుక ముస్లిం సోదరులు అందరూ సమయానికి విచ్చేసి (ఈద్ ఉల్ ఫిత్ర్) నమాజ్ ఆదాహ్హ్ చేసుకోవలసిందిగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేయడం జరిగిందన్నారు. ఇందుకు అధికారులందరూ సమన్వయంతో సహాయ సహకారాలు అందించాలని తెలియజేశారు. బిల్టప్  దగ్గర లోని అమీనియా ఈద్గా, దండు ఈద్గా, మామిల్లపల్లిలోని ముఖ్తి రహీంఉల్లాహ్ ఖాన్ గారి ఈద్గా ఈ  ఈద్గాలకు సంబంధించి కూడా అన్ని మౌలిక వసతులను కల్పించడం జరిగిందన్నారు.


ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఆరీఫుల్లా, ముక్తి రహిమహుల్లాహ్, సమృద్ధిన్, కమల్ భాష, షఫీ, అజ్మతుల్లా ఖాన్, అగ్మాల్ పీర్ మురాది, మున్సిపల్ కార్పొరేషన్ డి ఈ కరీముల్లా, ఏ.ఇ. లు, పెద్ద దర్గా అమీన్,  తదితరులు పాల్గొన్నారు.


Comments