మానవ సేవే మాధవ సేవ అన్న సూక్తిని అక్షరాలా నిజం చేస్తూ నిస్వార్ధంగా సేవచేసే మానవతామూర్తులందరికి దేవుని ఆశీస్సులు ఉంటాఈ

 

నెల్లూరు, మే 24 (ప్రజా అమరావతి);


మానవ సేవే మాధవ సేవ అన్న సూక్తిని అక్షరాలా నిజం చేస్తూ నిస్వార్ధంగా సేవచేసే మానవతామూర్తులందరికి దేవుని ఆశీస్సులు ఉంటాయ


ని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ బిశ్వభూషణ్ హరిచందన్ గారన్నారు.


మంగళవారం మధ్యాహ్నం నెల్లూరు ఐ ఆర్ సి యస్ క్యాన్సర్ హాస్పటల్లో 10 కోట్ల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన రేడియో థెరపి బ్లాక్ -2 ను గవర్నర్ ప్రారంభించారు. 


తోలుత ఐ ఆర్ సి యస్ క్యాన్సర్ హాస్పటల్ ను సందర్శించిన గవర్నర్ కు హాస్పటల్ సిబ్బంది  ఘన స్వాగతం పలికారు. హాస్పటల్ ఆవరణలో తమ పర్యటనకు గుర్తుగా మొక్కను నాటారు.  అనంతరం జరిగిన జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ సభ్యుల సమావేశంలో గవర్నర్ మాట్లాడుతూ కేవలం విరాళాల ద్వారానే ఇంతటి నిర్మాణం పూర్తి చేయడం గొప్ప విషయమన్నారు. నెల్లూరు క్యాన్సర్ హాస్పిటల్ అందిస్తున్న సేవల గురించి గతంలో విన్నానని, ఇప్పుడు ప్రత్యక్షంగా చూడటం ఆనందాన్నిచ్చిదన్నారు. రాష్ట్ర రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ శ్రీధర్ రెడ్డి కష్టపడి పనిచేస్తున్నారన్నారు. అదేవిధంగా నెల్లూరు జిల్లాలో జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని, ముఖ్యంగా కోవిడ్ సమయంలో ఎంతగానో కృషి చేశారని వారి సేవలను ప్రత్యేకంగా కొనియాడారు. 


ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీ కె వి ఎన్ చక్రధర్ బాబు మాట్లాడుతూ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నామని, కోవిడ్  సమయంలో దాదాపు 1000 పైగా ప్లాస్మా దానం చేసి దేశంలోనే నెల్లూరు జిల్లా గుర్తింపు సాధించిందన్నారు. జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంకు దేశంలోనే అత్యుత్తమ బ్లడ్ బ్యాంకు అని చేప్పారు. రెడ్ క్రాస్ ఆద్వర్యంలో ప్రపంచంలోనే  క్యాన్సర్ సర్జరీలు, కీమోథెరపీ నిర్వహిస్తున్న ఒకే ఒక హాస్పటల్ నెల్లూరు క్యాన్సర్ హాస్పటల్ అని సభ్యుల కరతాళ ధ్వనుల మధ్య తెలియజేశారు. రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో తలసేమియా వ్యాధిగ్రస్తులు 105 మందికి రక్తం అందిస్తున్నామని, జనరిక్ మందులు ఉచితంగా అందిస్తున్నామని, మినీ 

ఐసియు గా ఉండే అంబులెన్స్ సేవలు ఎంతోమందికి ఉపయోగకరంగా ఉన్నాయన్నారు


ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర చైర్మన్ శ్రీధర్ రెడ్డి, గవర్నర్ ప్రత్యేక కార్యదర్శి ఆర్ పి పిసోడియా, నగర మేయర్ స్రవంతి, ఎస్పి విజయ రావు, మున్సిపల్ కమిషనర్ జాహ్నవి, జాయింట్ కలెక్టర్ హరేoధిర ప్రసాద్, జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ పి చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గోన్నారు.
Comments