జగన్ ను ఆపడానికి చంద్రబాబు తెచ్చుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ *- జగన్ ను ఆపడానికి చంద్రబాబు తెచ్చుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్


 *- పవన్ కళ్యాణ్ ను బాబు దత్తత తీసుకున్నారు* 

 *- ఇద్దరు కలిసి పోటీ చేసినా అభ్యంతరం లేదు* 

 *- విడివిడిగా వచ్చినపుడు పంజా దెబ్బ చూపించారు* 

 *- కలిసి వచ్చినా సీఎం జగన్ చెల్లాచెదురు చేస్తారు* 

 *- చంద్రబాబుకు త్యాగాలు చేయాల్సిన అవసరం లేదు* 

 *- 2024 లో జరిగేవి చంద్రబాబుకు చివరి ఎన్నికలు* 

 *- 151 సీట్లకు తగ్గకుండా జగన్ ముఖ్యమంత్రి అవుతారు* 

 *- బాబు, పవన్ ల వల్ల ఎవరికీ ప్రయోజనం లేదు* 

 *- గుంటూరు, పల్నాడు జిల్లాల కోఆర్డినేటర్ కొడాలి నాని* అమరావతి, మే 9 (ప్రజా అమరావతి): సీఎం జగన్మోహనరెడ్డిని అధికారంలోకి రాకుండా ఆపడానికి చంద్రబాబు రాజకీయాల్లోకి తీసుకువచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు, పల్నాడు జిల్లాల రీజినల్ కోఆర్డినేటర్, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. సోమవారం కొడాలి నాని మీడియాతో మాట్లాడారు. 2014 ఎన్నికల్లో మద్దతు ఇచ్చి తెలుగుదేశం పార్టీని గెల్పించాననే భ్రమల్లో పవన్ కళ్యాణ్ ఉన్నాడని చెప్పారు. 2019 ఎన్నికల్లో టీడీపీ వ్యతిరేక ఓటును చీల్చడం ద్వారా జగన్ ను అధికారంలోకి రాకుండా ఆపగలమన్న భ్రమలో ఇంకో నాలుగు పార్టీలను కలుపుకుని పవన్ కళ్యాణ్ పోటీ చేశాడన్నారు. సీఎం జగన్మోహనరెడ్డిని అధికారంలోకి రాకుండా ఆపడానికి చంద్రబాబు రాజకీయాల్లోకి తీసుకువచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అని అన్నారు. పవన్ కళ్యాణ్ ను చంద్రబాబు దత్తత తీసుకున్నాడని చెప్పారు. చంద్రబాబు చెప్పిన దారిలోనే పవన్ కళ్యాణ్, లోకేష్ నడుస్తారని అన్నారు. దత్త పుత్రుడు, ఉత్తుత్తి పుత్రుడిని అడ్డం పెట్టుకుని చంద్రబాబు అధికారంలోకి రావాలని చూస్తున్నాడని 2014 నుండి చెబుతూ వస్తున్నామన్నారు. ఇప్పుడు 2024 ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని చెబుతున్నారని తెలిపారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు కలిసినా మాకేం అభ్యంతరం లేదన్నారు. 2014, 2019 ఎన్నికల్లో చేసిందే 2024 లో చేస్తారని, చచ్చే దాకా కలిసి పోటీ చేస్తూనే ఉంటారన్నారు. రాష్ట్ర ప్రజలు అమాయకులని, వారికి ఏం తెలియదని అనుకుంటున్నారన్నారు. ప్రజల కళ్ళకు గంతలు కట్టామని, వారు ఏది చెబితే అది నమ్ముతారన్న భ్రమల్లో చంద్రబాబు, పవన్ కళ్యాచ్లు బతుకుతున్నారన్నారు. సీఎం జగన్మోహనరెడ్డికి 55 శాతం ఓటింగ్ ఉందని గుర్తుచేశారు. మిగతా 45 శాతం ఓటింగ్లో ఎవరూ ఎమ్మెల్యేలుగా గెలుస్తారు, ఓడతారు, డిపాజిట్లు కోల్పోతారు, ప్రతిపక్ష నేతగా మిగులుతారో తేల్చుకోవాలన్నారు. దత్త పుత్రుడు, ఉత్త పుత్రుడు, వృద్ధ తండ్రి కలిసి వచ్చినా, రాకపోయినా మాకు పోయేది ఏం లేదన్నారు. గత ఎన్నికల్లో విడివిడిగా వస్తే సీఎం జగన్ తన పంజా దెబ్బ చూపించాడన్నారు. వచ్చే ఎన్నికల్లో గుంపులుగా వస్తున్నారని, సింహం రెడీగా ఉందని, చెల్లాచెదురు చేస్తారని హెచ్చరించారు. చంద్రబాబు సొల్లుగాడు, నమ్మక ద్రోహి, 420 అని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఇచ్చిన మాటకు కట్టుబడే వ్యక్తి కాడని, అబద్దాలు చెప్పే వెన్నుపోటుదారుడని గుర్తుచేశారు. 2019 ఎన్నికల్లో మహిళలంతా తనకే ఓటు వేశారని సర్వేలు చేసి మరీ మెజార్టీలు చెప్పాడన్నారు. సీఎం జగన్ కు తీవ్ర వ్యతిరేకత ఉందని ప్రచారం చేశాడన్నారు. ఛాలెంజ్ లు విసిరి తొడలు కొట్టాడని అన్నారు. చంద్రబాబుకు ఉన్న అనుభవం దేశంలో ఎవరికీ లేదని, మోదీని కూడా ఊదేస్తానని ప్రగల్భాలు పలికాడన్నారు. దేశమంతా తిరిగి ప్రచారం చేస్తే రాష్ట్ర ప్రజలు 23 సీట్లకు పరిమితం చేశారన్నారు. ఇప్పుడు మళ్ళీ సీఎం జగన్ పట్ల వ్యతిరేకత ఉందని చెబుతున్నాడని, అదే ఉంటే ఇంకొకడి సంక నాకడం ఎందుకని ప్రశ్నించారు. చంద్రబాబు త్యాగాలు చేయాల్సిన అవసరం లేదన్నారు. 2024 లో జరిగేవి చంద్రబాబుకు చివరి ఎన్నికలు అని, సీఎం జగన్ చేతిలో చావు దెబ్బ తింటాడన్నారు. కనీసం ఎమ్మెల్యేగా గెలవలేని పవన్ కళ్యాణ్ 10 పార్టీలతో పొత్తులు పెట్టుకుంటున్నాడన్నారు. చంద్రబాబుతో కలిసి పోటీ చేసినా పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలవలేడని, లోకేష్ కూడా ఎమ్మెల్యే కాలేడని అన్నారు. ఎమ్మెల్యేగా గెలవలేని పవన్ కళ్యాణ్ జగన్మోహనరెడ్డిని ముఖ్యమంత్రి పీఠం నుండి దించేస్తాడా అని ప్రశ్నించారు. టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకుంటే రాష్ట్రానికి ఎటువంటి ప్రయోజనం ఉండదన్నారు. ప్రజలను అడ్డం పెట్టుకుని డబ్బులు దండుకుంటూ, అధికారాన్ని పంచుకోవడానికి అమాయకులు ఎవరూ లేరన్నారు. సీఎం జగన్ చీకటిలో చిదంబరం కాళ్ళు పట్టుకోలేదని, ఎన్టీఆర్ లాంటి వ్యక్తిని వెన్నుపోటు పొడవలేదన్నారు. పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఎమ్మెల్యేగా గెలవలేని వ్యక్తులు ఇళ్ళ దగ్గర గంటల తరబడి నిలబడలేదన్నారు. అన్ని అవలక్షణాలు చంద్రబాబుకు ఉన్నాయన్నారు. 2024 ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు జగన్ కు మద్దతుగా ఉంటారని, ఎన్ని పార్టీలను కలుపుకుని జగన్ ను దింపాలని ప్రయత్నించినా రాజకీయ సమాధి కడతారన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఫ్రంట్ లు, బ్యాక్ లు, సైడ్ లు అవసరం లేదని, సీఎం జగన్ సింహంలా సింగిల్గానే వస్తారన్నారు. 151 సీట్లకు తగ్గకుండా మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారన్నారు. చంద్రబాబును కుప్పంలోనే రాజకీయ సమాధి చేస్తారని హెచ్చరించారు. చంద్రబాబు తన కొడుకును ఎమ్మెల్యేగా గెల్పించుకోవాలని, పవన్ కళ్యాణ్ కూడా ఎమ్మెల్యేగా గెలవాలన్నారు. ఆ తర్వాత పొత్తులు, సినిమా డైలాగ్ లు, జనాన్ని ఉద్దరించడం వంటివి మాట్లాడవచ్చన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వల్ల ఎవరికీ ప్రయోజనం లేదన్నారు. అధికారం, డబ్బు పంచుకోవడమే వీరి లక్ష్యమని, రాష్ట్ర ప్రజలకు ఏమీ ఇవ్వరని మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు.