ఇండియన్ ఇనిస్ట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ అండ్ రీసెర్చ్ సెంటర్ ను సందర్శించిన పేర్నాటి దంపతులు.

  విజయవాడ (ప్రజా అమరావతి);      ఇండియన్ ఇనిస్ట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ అండ్ రీసెర్చ్ సెంటర్ ను సందర్శించిన పేర్నాటి దంపతులు.




హైదరాబాదులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ అండ్ రీసెర్చ్ సెంటర్ ను సందర్శించిన రాష్ట్ర కార్యదర్శి పేర్నాటి. శ్యాంప్రసాద్ రెడ్డి గారు, మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్ పర్సన్ పేర్నాటి. హేమ సుస్మిత గారు. మొదటగా హైదరాబాదులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ అండ్ రీసెర్చ్ సెంటర్లో జరిగిన డైరెక్టర్ల సమావేశంలో పాల్గొని తర్వాత మిల్లెట్స్ అండ్ రీసెర్చ్ సెంటర్ యొక్క సాంకేతిక పరిజ్ఞానాన్ని పనితీరును శాస్త్రవేత్తలను అడిగి తెలుసుకున్నారు. మన రాష్ట్రంలో చిరుధాన్యాలను పండించడం వాటిని ప్రాసెసింగ్ చేసే మిషనరీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్థాపించాలని ముఖ్యమంత్రి గారి ఆలోచన అని, అందుకు అనుగుణంగా ఈరోజు మిల్లెట్స్ ప్రాసెసింగ్ యూనిట్ను, మిల్లెట్స్ అవుట్ లెట్ లను సందర్శించి వాటికి వాడే మిషనరీ గురించి తెలుసుకున్నారు. రాబోయే రోజుల్లో మన రాష్ట్రంలో కూడా ఇటువంటి ప్రాసెసింగ్ యూనిట్లను వీలైనన్ని ఎక్కువగా స్థాపించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకు వెళ్ళి వాటిని స్థాపనకు మా వంతు కృషి చేస్తామని చెప్పడం జరిగింది.

Comments