విజయవాడ, (ప్రజా అమరావతి);
వెబ్ ప్రోస్, సొల్యూషన్స్, ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలలో పనిచేయుటకు వివిధ ఉద్యోగాలలో 50 ఖాళీల భర్తీ కొరకు జూన్ 1వ తేదీ బుధవారం ఉదయం 10 గంటలకు విశాఖపట్నం కంచరపాలెం లోని జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి (సాంకేతిక విభాగం) కె. సుధ ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ అవకాశాన్ని యువకులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. మెషిన్ / ప్యాకింగ్ హెల్పర్స్, డెలివరీ బాయ్స్ ఉద్యోగాల ఎంపిక కొరకు వచ్చే అభ్యర్థులు 10వ తరగతి లేదా ఐటిఐ విద్యార్హతలు కలిగి ఉండి కనీస వయస్సు 18 సంవత్సరాలు నుండి 30 సంవత్సరాల మధ్యలో ఉండాలని తెలిపారు. నెలకు రూ. 10 వేల రూపాయల వేతనం నిర్దారించడం జరిగిందని తెలిపారు. డెలివరీ బాయ్స్ మాత్రం అదనంగా టూ వీలర్ లైసెన్స్ కలిగి ఉండాలని చెప్పారు.
మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్, టీం లీడర్స్ ఉద్యోగాల ఎంపిక కొరకు వచ్చేవారు ఏదైనా డిగ్రీ అర్హత కలిగి కనీస వయస్సు 21 సంవత్సరముల నుండి 30 సంవత్సరముల లోపు కలిగి ఉండాలని, నెలకు 20 వేల రూపాయల వేతనము ఇస్తారని, అర్హులైన వారు జాబ్ మేళా కు హాజరు కావలెనని కె. సుధ తెలిపారు.
పై తెలిపిన 4 పోస్టులలో పని చేయుటకు గాను అర్హత గల పురుష అభ్యర్థులు జూన్ 1 వ తేదీ బుధవారం ఉదయం 10 గంటలకు విశాఖపట్నం కంచరపాలెం లోని జిల్లా ఉపాధి కార్యాలయం (టెక్నికల్) మోడల్ కెరీర్ సెంటర్ నందు నిర్వహించే జాబ్ మేళాకు తమ బయో డేటా మరియు ధ్రువపత్రాలతో హాజరు కావాల్సిందింగా కె. సుధ తెలిపారు. జాబ్ మేళాకు హాజరు అగు అభ్యర్థులు తమ వివరాలను ncs.gov.in వెబ్ సైట్ నందు రిజిస్టర్ చేసుకోవలెనని ఒక ప్రకటనలో విశాఖపట్నం జిల్లా ఉపాధి అధికారి (టెక్నికల్) కె. సుధ కోరారు.
ఆసక్తి అర్హత గల పురుష అభ్యర్థులు పై తెలిపిన ప్రముఖ కంపెనీలలో పనిచేయుటకు గాను నిర్వహించు జాబ్ మేళాకు స్వయంగా హాజరు అయి క్వాలిఫికేషన్స్ మేరకు ఉద్యోగములను పొందవలెనని కె. సుధ కోరారు.
addComments
Post a Comment