నెల్లూరు మే 13 (ప్రజా అమరావతి);
నాడు నేడు పథకంలో పునర్నిర్మాణంలో ఉన్న వైద్యశాలలను రాత్రింబవళ్లు పనులు చేస్తూ,
అనుకున్న సమయానికి పూర్తి చేయడానికి కృషి చేయవలసిందిగా అధికారులను జిల్లా కలెక్టర్ శ్రీ కె వి ఎన్ చక్రధర్ బాబు ఆదేశించారు.
శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో హాస్పిటల్స్ లో జరుగుతున్న నాడు నేడు పనులను జిల్లా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిర్మాణ పనులు జరుగుతున్నాయని హాస్పిటల్స్ కు వచ్చే రోగులను నిరోధించవద్దన్నారు. అన్ని రకాల వసతులను సమకూర్చుతూ నిర్మాణ పనుల్లో ఎక్కడా రాజీ లేకుండా చేయాలన్నారు. నిర్మాణం జరిగే ప్రాంతంలోనే సంబంధిత సైట్ ఇంజినీర్లు, మిక్సింగ్ ప్లాంట్లు ఉండేట్లుగా చర్యలు తీసుకోవాలన్నారు. పంచాయతీ రాజ్ రోడ్ల నిర్మాణం, వైయస్సార్ హెల్త్ క్లినిక్ నిర్మాణ పనులు, సచివాలయ నిర్మాణ పనులను సమీక్షించారు.
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ హరేoధర్ ప్రసాద్, నెల్లూరు మున్సిపల్ కమిషనర్ జాహ్నవి
జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ పెంచలయ్య, పి ఆర్ ఎస్ ఇ వేణుగోపాల్, సర్వ శిక్ష ప్రాజెక్ట్ అధికారి ఉషారాణి తదితరులు పాల్గొన్నారు
addComments
Post a Comment