రాజమహేంద్రవరం (ప్రజా అమరావతి) :
ప్రతి మండలంలో వీడియో కాన్ఫరెన్స్ పనిచేయాలి
ప్రతి మండల అధికారి ఆయా మండలాల నుంచి పాల్గొనాలి
- కలెక్టర్ మాధవీలత
లక్ష్యాలను సాధించడానికి అవసరమైన పరిపాలన పరమైన ఆమోదాలు ఇవ్వడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీ లత స్పష్టం చేశారు.
సోమవారం సాయంత్రం కలెక్టరేట్ నుంచి జాయింట్ కలెక్టర్ తో కలిసి ఉపాధి హామీ పథకం, జగనన్న స్వచ్ సంకల్పం, నాడు నేడు పాఠశాల భవనాలు, గ్రామ సచివాలయాలు/ అర్భికే లు & వై ఎస్ ఆర్ హెల్త్ క్లినిక్‌లు/లైబ్రరీల క్రింద ప్రాధాన్యత భవనాలు , సి హెచ్.సి.లలో మెగా మేళా పై టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాకు నరేగా కింద లక్ష దినాలు ఉపాధి హామీ మండిడేట్ ఇవ్వడం జరిగందని, నల్లజర్ల, తాళ్లపూడి మండలాల్లో 10 వేల పని దినాలు అప్లోడ్ చేయాలన్నారు. సోమవారం సాయంత్రానికి ప్రతి ఎంపీడీఓ వారికి నిర్దేశించిన లక్ష్యాలను ఆన్లైన్ లో నమోదు చేయాలన్నారు.
జగనన్నస్వచ్ఛ సంకల్ప కార్యక్రమంలో చేపట్టే పనులు ద్వారా వర్మి కంపోస్ట్ తయారు చేసి మార్కెటింగ్ చేపట్టాలన్నారు. ఆయా గ్రామాల్లో చేపట్టే ఆయా పనుల వివరాలు, కార్యక్రమాలు ఆన్లైన్ లో నమోదు చేయాలన్నారు. నాడు నేడు కింద పాటశాలల్లో చేపట్టవలసిన పనులకు సంబంధించిన మెటీరియల్ వివరాలు జెనరేట్ చేయాలన్నారు. జిల్లాలో 216 పాఠశాలల ఆర్ ఎఫ్ నిధులు విడుదల అయ్యాయని, మిగిలిన వాటికి ఆర్ ఎఫ్ విడుదల అయ్యేలోగా , సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని ఇవ్వలన్నారు.
సిమెంట్, ఇసుక, స్టీల్ కి సంబందించిన మెటీరియల్ వివరాలు కోసం ఇండెంట్ సమర్పించాలని స్పష్టం చేశారు. ఎం ఈ ఓ, ఇతర సమన్వయ శాఖ ల అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. డి ఈ ఓ మండల అధికారులకు దిశా నిర్దేశం చెయ్యాలని కలెక్టర్ పేర్కొన్నారు. భూ సంబంధ విషయాలు కోసం ప్రతిపాదనలు పంపి జాయింట్ కలెక్టర్ ను సంప్రదించాలని సూచించారు. సచివాలయాలు, అర్భికే, హెల్త్ క్లినిక్ ల భవనాలు వేగవంతం చేయాలని, ఏ ఒక్క చోట పెండింగ్ పనులు పెండింగు లో ఉండకూడదని తెలిపారు. ఇంకా భవన నిర్మాణం కోసం సేకరించ వలసిన వాటికోసం స్థలాలు గుర్తించి, భవన నిర్మాణాలను వేగవంతం చేయాలని ఆదేశించారు. అనపర్తి, బిక్కవోలు మండలాల్లో పెండింగ్ పనులపై సమీక్ష చేస్తూ, అనపర్తి ఆర్డబ్ల్యూఎస్ ఏ ఈ కి షో కాజ్ నోటీస్ జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. రైతులకు అవసరమైన యాంత్రీకరణ పనిముట్లు, తదితర యూనిట్స్ కొరకు కమ్యూనిటీ హైరింగ్ సెంటర్ లలో తయారీ దారులచే మెగా మేళా ఏర్పాటు చేయాలని వ్యవసాయ అధికారులకి స్పష్టం చేశారు. ఈక్రాప్ బుకింగ్ చెయ్యడం ముఖ్యఉద్దేశ్యం పారదర్శకంగా, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఊరుకునే ప్రసక్తి లేదు. ఖరీఫ్ సీజన్లో మరింత అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. జూన్ 6 న మెగా మేళా ఏర్పాటు కి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. యూనిట్స్ గ్రౌండింగ్ విషయంలో బ్యాంకర్స్ తో మాట్లాడి అందుకు అనుగుణంగా మండల అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు.
ఆసుపత్రులలో బయో మెట్రిక్ హాజరు పై
మండల ప్రత్యేక అధికారులు పర్యవేక్షణ చెయ్యాలని కలెక్టర్ డా. మాధవీలత సూచించారు. మండల ప్రత్యేక అధికారులకి మూడు టార్గెట్స్ ఇస్తున్నా పి హెచ్ సి తనిఖీలు, బయో మెట్రిక్ హాజరు, ఎస్ డబ్ల్యూ ఎస్ షేడ్స్ తనిఖీ చెయ్యాలి. సోమవారం నాటికి సమగ్ర నివేదికను సమర్పించాలని తెలిపారు. బీబీఎల్ స్టేజ్ లో ఉన్న ఏ భవనం పని ప్రారంభించి నట్లు కాదని, ఇంజనీరింగ్ అధికారులు బి ఎల్ స్థాయికి చేరేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భవన నిర్మాణం పనుల విషయంలో స్టేజ్ స్టేజ్ కి ప్రగతి ఉంటేనే పనులు జరుగుతున్నట్లు , అలా కాకుండా ఒకే స్టేజ్ లో ఉంటే పనులు జరగనట్లు భావించవలసి ఉంటుందన్నారు. ప్రతి సోమవారం కలెక్టర్ నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్ కి మండల అధికారులు ఆయా మండలాల నుంచే తప్పనిసరిగా పాల్గొనాలని, ఒక వేళ హాజరు కాకపోతే మండలంలో అందుబాటులో ఉన్నట్లు కాదన్నారు.
స్పందన కార్యక్రమం లో జేసీ సిహెచ్. శ్రీధర్, ఆర్డీవో ఎ. చైత్రవర్షిణి, జిల్లా అధికారులు డిఎంహెచ్ఓ డా. ఆర్.స్వర్ణలత, స్త్రీ శిశు సంక్షేమ అధికారి విజయ కుమారి, జిల్లా వ్యవసాయాధికారి ఎస్. మాధవరావు, డిఎస్ఓ పి.ప్రసాదరావు, డీఈఓ అబ్రహం, డ్వామా పీడీ పి. జగదాంబ, డీఎస్ ఈడబ్ల్యూ & ఈఓ ఎమ్ ఎస్ శోభారాణి , ఈఈ పిఆర్ ప్రసాద్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
addComments
Post a Comment