మహానాడుద్వారా రాష్ట్రమంతా ఒకే నినాదం వినపడాలి.

 *భారీర్యాలీతో మహానాడుకి వెళ్తూ, మార్గమధ్యలో చిలకలూరిపేటలో కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించిన టీడీపీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబునాయుడు 


*మహానాడుద్వారా రాష్ట్రమంతా ఒకే నినాదం వినపడాలి.*

*క్విట్ జగన్ – సేవ్ ఆంధ్రప్రదేశ్ నినాదం  మారుమోగాలి.*


*ఇలాంటి చిల్లర, పనికిమాలిన ముఖ్యమంత్రిని ఇంతవరకు చూడలేదు.*


*మర్యాదగా నడుచుకుంటే మర్యాదగానేఉంటా.. కోపమొస్తే ఒక్కొక్కడి సంగతితేలుస్తా... మీరందరూ భవిష్యత్ లో ఇక్కడే తిరగాలని గుర్తుంచుకోండి.*


*టీడీపీ అడిగితే బస్సులు ఇవ్వకుండా నాటకాలు ఆడుతారా?*


*తమ్ముళ్లూ...చెల్లెమ్మల్లారా మహానాడుని జయప్రదం చేయండి.. అడ్డుకుంటే ఆగడం తెలుగుదేశం రక్తంలోనే లేదు.*

 *అవసరమైతేకాలినడకన రండి... కదనోత్సాహంతో ఉరికిరండి.*

*జగన్మోహన్ రెడ్డికి ఊడిగంచేస్తూ, ఓవరాక్షన్ చేసేవారిని ఎవరినీ వదిలిపెట్టను.*


*అప్పులుపుట్టక, పాలనచేతగాక జగన్ రెడ్డి మధ్యంతరఎన్నికలకు వెళ్లి, ప్రజాగ్రహం నుంచి తప్పించుకోవాలనుకుంటున్నాడు.* 


చిలకలూరిపేట (ప్రజా అమరావతి);

“భారీర్యాలీతో మహానాడుకి వెళ్తున్నసందర్భంలో గ్రామగ్రామాన ఎదురేగి ఘనస్వాగతం పలుకుతున్న కార్యకర్తలు, తెలుగుతమ్ముళ్ల ఉత్సాహం చూస్తుంటే చెప్పలేనంత ఆనందం కలుగుతోంది. మహానాడుని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్న ఈప్రభుత్వం కంపించిపోయేలా ప్రజలంతా భారీగా మహానాడుకితరలిరావాలని కోరుతున్నా. క్విట్ జగన్ క్విట్ జగన్, సేవ ఆంధ్రప్రదేశ్ నినాదాలతో మహానాడుప్రాంగణమేకాదు యావత్ రాష్ట్రం దద్దరిల్లిపోవాలి.  స్వచ్ఛందంగా పార్టీకార్యకర్తల ఆకలితీర్చడానికి ముందుకొచ్చిన భాష్యంప్రవీణ్ ను మనస్ఫూ ర్తిగా అభినందిస్తున్నాను. ఉత్తరాంధ్రనుంచి వేలాదిగాతరలివచ్చేకార్యకర్తలకు చిలకలూరిపేట ప్రాంతంలో భోజనఏర్పాట్లు చేయించిన భాష్యంప్రవీణ్, ఇతర టీడీపీనేతలందరూ సమిష్టిగా పనిచేసి, ఎవరికీ ఎలాంటి ఇబ్బందులులేకుండా చూడాలి. వారుచేసిన భోజనఏర్పాట్లు చూశాను...చాలాబాగున్నాయి. 

తమ్ముళ్లూ ఇంకాముందుముందు మనం చాలాత్యాగాలకు సిద్ధపడాలి. జగన్మోహన్ రెడ్డి కేసులతో టీడీపీ కార్యకర్తలనుబయటకు రాకుండచేయాలని చూస్తున్నాడు. ఇది ఎన్టీఆర్ పెట్టిన తెలుగుదేశం అని గుర్తుంచుకో జగన్ రెడ్డి. మా తమ్ముళ్లను అడ్డుకోవడం నీతండ్రి వల్లే కాలేదు.. నువ్వుఏంచేస్తావు? ఎప్పటికప్పుడు తెలుగుదేశంపార్టీని, కార్యకర్తల్ని ఇబ్బందులు పెడుతూ పైశాచిక ఆనందంపొందుతున్న జగన్ రెడ్డీ.. నువ్వు చేసేవాటికి చక్రవడ్డీతో సహా భవిష్యత్ లో తిరిగిచెల్లిస్తాం. నాతో ఆటలాడతావా జగన్..? నీ తాటాకుచప్పుళ్లకు భయపడా లా?  ఖబడ్దార్.... గుర్తుంచుకో!  

ఆర్టీసీ అధికారులు మహానాడుకి బస్సుల అడిగితే ఇవ్వరా? అదేమంటే పిచ్చిపిచ్చికారణాలు చెబుతారా? జగన్మోహన్ రెడ్డికి ఊడిగంచేస్తూ, టీడీపీ మహానాడుకి బస్సులు ఇవ్వకుండా నాటకాలు  ఆడుతారా? మీరు ఇవ్వకపోగా, ప్రైవేట్ ట్రావెల్స్ వారు, పాఠశాలలు వారు బస్సులుఇస్తామంటే వారిపైకి ఆర్టీఏ అధికారుల్ని పంపిస్తారా? మాపార్టీ ప్లెక్సీలు, బ్యానర్లు కట్టుకోనివ్వరా? ఈ రాష్ట్రం మీజాగీరా? మీఆటలు సాగవు. ఇలాంటి చిల్లర ముఖ్యమంత్రిని, పనికిమాలిన ముఖ్యమంత్రిని ఇంతవరకు చూడలేదు?  ఇతనొక సైకో. సైకోలు ఏంచేస్తారో వారికే తెలియదు. నువ్వుఏంచేస్తున్నావో నీకే తెలియడంలేదుగానీ, రాష్ట్రం సర్వనాశ నమైంది. మహానాడుకి మేంఇబ్బందులు కలిగించడం లేదు అని ఒకమంత్రి అంటున్నాడు. ఒంగోలులో స్టేడియంఇమ్మంటే ఎందుకు ఇవ్వలేదు? ప్రకాశం జిల్లాఎస్పీ, సహా ఇతరఅధికారులు ప్రభుత్వానికి భయపడుతున్నారు. మహానాడు ఎలాఉంటుందో మీరేచూస్తారు. ఇదిఒకప్రభంజనం, ఎక్కడికక్కడ కట్టలు తెంచుకొని ఉరకలు వేసే ఉత్సాహంతో తమ్ముళ్లు, చెల్లెమ్మలు మహానాడుకి తరలిరావాలి. ఏవాహనం దొరికితే దానిలో రండి. ఎద్దలబళ్లపైరండి... అవసరమైతేకాలినడకనరండి. మీరుఎలావస్తారో తెలియదు. .కానీమహానాడునిజయప్రదంచేస్తామని గట్టిగాచెప్పండి.  ఈ మహానాడు ద్వారా రాష్ట్రమంతా ఒకే నినాదం మారుమోగాలి. క్విట్ జగన్..క్విట్ జగన్... క్విట్ జగన్- సేవ్ ఆంధ్రప్రదేశ్..సేవ్ ఆంధ్రప్రదేశ్. తమ్ముళ్లూ మీరుప్రజలు ఇంకాఎన్నాళ్లు కష్టాలుపడతారు?  ఈ రాష్ట్రంలో ఏవర్గమైనా సంతోషంగాఉందా? ఏ కులమైనా బాగుందా? ఏగ్రామమైనా బాగుపడిందా? ఈ ముఖ్యమంత్రి బాదుడిదెబ్బకు ఏఒక్కరైనా ఆనందంగా ఉన్నారా?  రైతులు, మహిళలు, యువత బాగున్నారా? ప్రజలుసంతోషంగా ఉన్నామంటే నేనుతిరిగి అమరావతికి వెళ్లిపోతా ను. మీకోసమ నేనువచ్చాను.. మీతరుపున పోరాడటానికే వచ్చాను. నాఆలోచన, కష్టం అంతా  మీకోసమే, ఈ రాష్ట్రంకోసమే. చిలకలూరిపేటలో  రూ.2లకు 20లీటర్ల తాగునీరు ఇచ్చే ఎన్టీఆర్ సుజలస్రవంతి పథకాన్ని ప్రారంభిస్తుంటే ఎస్సీఎస్టీ కేసులు పెడతారా? ఒకరిపై కేసులుపెడతావు..ఇద్దరిపైపెడతావు.. వెయ్యిమందిపై కేసులు పెడతావు. లక్షమందిపై పెడతావా జగన్? లక్షలమంది ఒకేసారి ఆగ్రహంతో రోడ్డెక్కితే, శ్రీలంకలో మాదిరి నువ్వుకూడా పారిపోతావు జగన్. రాజపక్షే కంటే గొప్పమొనగాడా ఈ జగన్? రాజపక్షే అక్కడి మంత్రులు దేశంవిడిచి పారిపోయారాలేదా? ప్రజాస్వామ్యంలో పద్ధతిగాఉండాలి..పద్ధ తిలేకుండా ఇష్టానుసారం ప్రవర్తిస్తే పారిపోకఏంచేస్తారు? గడగడపకు అన్నారు...జనం నిల దీస్తుండటంతో ఇప్పుడు బస్సుయాత్ర అంటున్నారు. సామాజికన్యాయం అంటున్నారు.ఎక్క డుంది మీరుచెబుతున్న సామాజికన్యాయం? ఆమాటఅంటూ ఎవరిచెవుల్లో పూలుపెడతారు ? జనం మీఅందరి చెవుల్లో పూలుపెట్టే రోజువచ్చింది. రాజ్యసభ సభ్యతం ఎవరికి ఇచ్చాడు ఈ జగన్ రెడ్డి? అమరావతిని కాదని రాజధానిని విశాఖపట్నానికి తీసుకెళ్తానన్న జగన్ రెడ్డి, ఆప్రాంతానికి  రాజ్యసభ ఎందుకివ్వలేదు? రాయలసీమకు ఎందుకు ఇవ్వలేదు? విజయసా యిరెడ్డికి రాజ్యసభ పదవి ఇవ్వకపోతే, ఆయన అప్రూవర్ గామారితే జగన్ జైలుకుపోతాడు. అందుకని ఆయనకు ఇచ్చాడు. తొమ్మదిమంది రాజ్యసభసభ్యుల్లో ముగ్గురు జగన్ కేసుల్లో ముద్దాయిలే. తెలంగాణకు ఒకటి, మహారాష్ట్రకు మరోటి. తనకేసులు వాదించే లాయర్ కి ఒకటి...అందరితరుపున లాబీయింగ్  చేయడానికి నత్వానికి మరోసీటు.

రాజ్యసభ సభ్యత్వం ఇవ్వడానికి ఏపీలో సమర్థులే లేరా? ఇంతచేస్తుంటే  తమ్ముళ్లూ ఎవరికై నా పౌరుషంరాదా? ఆంధ్రాప్రజలు జగన్ దృష్టిలో బానిసలా? ఎస్సీలకు గానీ, ఎస్టీలకుగానీ, మైనారిటీలకు గానీ జగన్ రెడ్డి ఒక్కటైనా రాజ్యసభ సీటుఎందుకివ్వలేదు? మనప్రభుత్వంలో  ఎస్సీలకోసం అమలుచేసిన 25కార్యక్రమాలను ఈ ముఖ్యమంత్రిరద్దుచేశాడు. బీసీలకు కూడా టీడీపీప్రభుత్వం ఇచ్చిన పథకాలన్నింటినీ రద్దుచేశాడు.  అలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. డబ్బున్నవాళ్లకు ఊడిగంచేయడం...పేదలపొట్టకొట్టడం అంటే జగన్ కు చాలా ఇష్టం. అన్నాక్యాంటీన్లు, రంజాన్ తోఫా, పెళ్లికానుక, క్రిస్మస్ కానుక, చంద్రన్నబీమా, విదేవీ విద్య ఏమయ్యాయి తమ్ముళ్లూ? ఈయన వాటన్నింటినీ ఏంచేశాడు? ఇప్పుడు దావోస్ వెళ్లి.. నేను రాష్ట్రానికి తీసుకొచ్చిన గ్రీన్ కో ప్లాంట్ ను ప్రారంభించేందుకు సిద్ధమయ్యాడు. ఈ స్టిక్కర్ ముఖ్యమంత్రి దావోస్ కు వెళ్లి, 16కోట్లువృథాచేసి, కథలుచెబుతున్నాడు.   నేను తీసుకొచ్చిన పరిశ్రమల్ని తప్పుపట్టాడు, మరలా ఇప్పుడు వాటికోసమే దావోస్ వెళ్లాడు. 

వైసీపీఎమ్మెల్సీ అనంతబాబు ఏంచేశాడు? అతికిరాతకంగా దళితయువకుడిని చంపి, మృత దేహాన్ని అతనింటికే తీసుకెళ్లి, కుటుంబసభ్యుల్ని భయపెట్టాడు. డబ్బులిస్తానని, చంపేస్తాన ని వారిని బెదిరించాడు. మృతుడికుటుంబానికి రక్షణకల్పించాల్సిన పోలీసులు ప్రభుత్వానికి ఊడిగంచేసి, నిందితుడిని రక్షించడానికి ప్రయత్నించారు. దళితకుటుంబానికి న్యాయం చేయడంకోసం నిజనిర్ధారణకమిటీని పంపించాను. మనపార్టీవారు అక్కడికివెళ్లి, వాస్తవాలు బయటకు వచ్చేలాచేశారు. ఇదంతాజరిగాకే పోలీసులు కేసుపెట్టారు. ఇప్పుడేమో అనంత బాబే చంపాడంటున్నారు. అంతకుముందు ఇదే పోలీసులు, వైసీపీవారు యాక్సిడెంట్ అన్నారు. సుబ్రహ్మణ్యం హత్య గురించి ప్రజలంతా చర్చించుకుంటుంటే,పచ్చని కోనసీమలో చిచ్చుపెట్టారు. పోలీసులే అక్కడఉండి..మంత్రి ఇంటిని తగలబెట్టేవరకు ఏంచేశారు? ఇళ్లు, బస్సులు, దుకాణాలు తగలబడుతుంటే ఫైరింజన్లు ఎందుకురాలేదు? వారి ఇల్లు వారే తగల బెట్టుకొని ఇతరులపై బురదవేయడానికి సిద్ధమయ్యారు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ తానుతప్పులుచేస్తూ ప్రతిపక్షాలపై వేస్తుంటాడు. జగన్ రెడ్డీ..నీకుపాలన చేతగాదు. ఆర్థిక పరిస్థితిని దివాళాతీయించావు. అప్పులుపుట్టక, పాలనచేయడం చేతగాక మధ్యంతర ఎన్నికలకు వెళ్లాలనుకుంటున్నాడు తమ్ముళ్లూ.. ఈముఖ్యమంత్రి. మధ్యంతరఎన్నికలకు వెళితే చేసినతప్పులనుంచి బయటపడతాడా? పడనిస్తామా తమ్ముళ్లూ? ఈముఖ్యమంత్రికి ఎలాబుద్ధిచెప్పాలో ప్రజలకుబాగాతెలుసు. ఇలా చాలావిషయాలున్నాయి తమ్ముళ్లూ..అన్ని మహానాడులో మాట్లాడుకుందాము. ఏదిఏమైనా నేనుమిమ్మల్ని ఒకటే అడుగుతున్నాను... వీరోచితంగా పోరాడే మీఅందరికీ అండగాఉంటాను..ఎవరు ఆపుతారోచూద్దాం. అవసరమైతే నేనే స్వయంగారోడ్లపైకి వస్తాను. పోలీసులు మీరు వైసీపీకార్యకర్తల్లా పనిచేయకండి.. చట్టం ప్రకారం, ప్రజాస్వామ్యయుతంగా నడుచుకోండి. మమ్మల్ని అడ్డుకోవాలని చూస్తే అందుకు తగిన మూల్యం తప్పకుండా చెల్లించుకుంటారని గుర్తుంచుకోండి.

Comments
Popular posts
రైతు పండించిన పంటను కచ్చితంగా ఇ–క్రాపింగ్‌ చేయాలి:
Image
భారత త్రో బాల్ జట్టు కెప్టెన్ శ్రీ చావలి సునీల్ కి ఆర్థిక సహాయం క్రింద 25 లక్షల చెక్కును అందించిన రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక వ్యవహారాల యువజన సర్వీసుల శాఖ మంత్రి శ్రీమతి ఆర్.కే. రోజా
Image
అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ ధ్యేయం.
Image
#దక్షిణదేశసంస్థానములచరిత్ర - 10 : #తెలుగువారిసంస్థానాలు - #జటప్రోలు (#కొల్లాపూరు) #సంస్థానము, మహబూబ్ నగర్ జిల్లా (తెలంగాణ రాష్ట్రం) - తెలంగాణ మైసూర్ ''కొల్లాపూర్" సంస్థాన ప్రభువులు (సంస్థానాధీశులు) పద్మనాయక రాచవెలమ వంశస్థులగు “#సురభివారు” (మొదటి భాగం)... కొల్లాపురం సంస్థానం పాలమూరు జిల్లాలో, నల్లమల అటవీ క్షేత్రంలో కృష్ణానది పరీవాహక ప్రాంతంలో ఉంది. ఈ సంస్థానాధీశులు 'కొల్లాపూరును' రాజధానిగా చేసుకొని పరిపాలించడం వల్ల ఈ సంస్థానాన్ని "కొల్లాపూరు సంస్థానమని" కూడా వ్యవహరిస్తారు. వీరు మొదట #జటప్రోలు రాజధానిగా పాలించి, తర్వాత 'కొల్లాపూర్, పెంట్లవెల్లి' రాజధానులుగా పాలించారు. 'నల్లమల ప్రాంతంలో' రెండవ శతాబ్దానికి చెందిన 'సోమేశ్వర, సంగమేశ్వర, మల్లేశ్వర' ఆలయాలున్నాయి. వీటికి ఎంతో గణనీయమైన పురావస్తు ప్రాముఖ్యత ఉంది. ఈ ఆలయాలు పదిహేను వందల ఏళ్ల క్రితం నిర్మించారు. వెడల్పయిన రహదారులు, దట్టమైన చెట్లతో ఈ ప్రాంతం నిండి ఉండడంతో కొల్లాపూర్ ను ''#తెలంగాణమైసూర్'' గా కూడా ప్రజలు పిలుస్తారు. ఈ సంస్థానం మొదట "విజయనగర చక్రవర్తులకు, చివరి నిజాం ప్రభువుకు" సామంత రాజ్యముగా వ్యవహరించబడింది. భారత దేశం స్వాతంత్య్రం పొందిన తర్వాత, ‘తెలంగాణలోని సంస్థానాలు’ భారత్ లో విలీనం అయ్యేవరకు ఈ సంస్థానం సివిల్ మెజిస్ట్రేట్ అధికారాలతో ఉంది. ‘నిజాం ప్రభువులు’ తమ ఆధీనంలో ఉన్న సంస్థానాలకు సర్వాధికారాలు ఇవ్వటం వల్ల ఆయా సంస్థానాలు స్వేచ్ఛగా పరిపాలన సాగించినాయి. 'నిజాం భూభాగం' బ్రిటిష్ రాజ్యంలో ఓ భాగమైతే 'సంస్థానాలు' నైజాం రాజ్యంలో చిన్న చిన్న 'రాజ్యాలుగా' వ్యవహరించబడ్డాయి. అలా వ్యవహరించబడిన సంస్థానాలలో #కొల్లాపురంసంస్థానం ఒకటి. ఇక్కడి సువిశాలమైన కోట ప్రాంగణంలో కొలువుదీరిన సుందరమైన రాజభవనాలు నాటి సంస్థానాధీశుల పాలనా వైభవాన్ని చాటు తున్నాయి. 'ఆలయాల అభివృద్ధి, ఆధ్యాత్మిక కృషికి' తోడు వివిధ రంగాల కవిపండిత సాహిత్య, కళాపోషణకూ వారు అధిక ప్రాధాన్యమిచ్చారు. అన్నింటికంటే ముఖ్యంగా ప్రజావసరాలకు అనుగుణమైన సౌకర్యాలను కల్పించడం ద్వారా ‘కొల్లాపూర్ సురభి సంస్థానాధీశులు’ జనరంజకమైన పాలన కొనసాగించారు. ఈ ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని కొన్ని శతాబ్దాల పాటు తమ సంస్థానాన్ని ఏలారు ‘#సురభిరాజులవారసులు’. ఈ సంస్థానం వైశాల్యం 191 చ.మైళ్ళు. ఇందులో 30 వేల జనాభా దాదాపు 90 గ్రామాలు ఉండేవి. వార్షిక ఆదాయం ఇంచుమించుగా రెండు లక్షలు. ఈ సంస్థానం కృష్ణానది పరీవాహక ప్రాంతంలో ఉన్నది. పూర్వం జటప్రోలు సంస్థానానికి 'కొల్లాపురం' రాజధాని. ‘#సురభిలక్ష్మారాయబహద్దూర్’ వరకు అంటే సుమారు క్రీ.శ.1840 వరకు రాజధాని 'జటప్రోలు' గా ఉండేది. వీరి కాలం నుండి రాజధాని 'కొల్లాపూర్' కు మారింది. అప్పటి నుంచి 'కొల్లాపురం సంస్థానం' గా పేరొంది, ఈ ప్రాంతాన్ని పరిపాలించిన వారంతా 'కొల్లాపురం సంస్థాన ప్రభువులుగా' ప్రసిద్ధులయ్యారు. వీరు మొదట్లో 'పెంటవెల్లి' రాజధానిగా పాలన సాగించారు. #సురభివంశస్థులపూర్వీకులు 'దేవరకొండ' (నల్గొండ) ప్రాంతం నుంచి ఇక్కడికి వలస వచ్చారని చరిత్రకారుల అభిప్రాయం. ఈ సంస్థానాధీశులు మొదట జటప్రోలులో కోటను నిర్మించుకొని నిజాం ప్రభువులకు సామంతులుగా ఉన్నారు. ఇక్కడి సువిశాలమైన కోటలు, చక్కని భవనాలు సురభి సంస్థానాధీశుల కళాభిరుచిని చాటుతున్నాయి. నిజాం కాలంలో కొల్లాపూర్ పరిపాలన పరంగా ప్రముఖపాత్ర వహించింది. కొల్లాపూర్ రాజుకు మంత్రి లేదా సెక్రటరీగా వ్యవహరించిన 'కాట్ల వెంకట సుబ్బయ్య' ఇక్కడివారే. అనంతరం మంత్రిగా పని చేసిన 'మియాపురం రామకృష్ణారావు' కూడా ఇక్కడివారే. #జటప్రోలుసంస్థానస్థాపకులు - #సురభివంశచరిత్ర…. #పిల్లలమర్రిభేతాళనాయుడుమూలపురుషుడు!.... ఈ సంస్థానాన్ని స్థాపించిన పాలకులు విష్ణుపాదోధ్భవమగు పద్మనాయకశాఖలో డెబ్బది యేడు గోత్రములు గల #రాచవెలమతెగకు చెందిన "పద్మనాయక వంశ వెలమవీరులు". వీరిలో 'పది గోత్రములు గల 'ఆదివెలమలకు' సంస్థానములు లేవు. వీరు కాకతీయ రాజ్య కాలంలో రాజ్యరక్షణలో యుద్ధవీరులుగా చేరారు. ఒక దశలో వీరు స్వతంత్ర రాజ్యాలగు #రాచకొండ, #దేవరకొండ (క్రీ. శ. 1335 - 1475) కూడా స్థాపించారు. వీరు శాఖోపశాఖలుగా తెలుగు ప్రాంతంలో అనేక ప్రాంతాలలో పాలకులుగా అధికారాలు చెలాయించారు. 'వేంకటగిరి, పిఠాపురం, బొబ్బిలి, జటప్రోలు' సంస్థానాధీశులకు మూలపురుషుడు ఒక్కడే. “రేచర్ల గోత్రికుడైన పిల్లలమర్రి చెవిరెడ్డి (లేదా) భేతాళ నాయుడు” వీరికి మూలపురుషుడు. వెంకటగిరి, నూజివీడు, బొబ్బిలి సంస్థాన పాలకులకు ఇతడే మూలపురుషుడు (ఈ చరిత్ర గతంలో వెంకటగిరి సంస్థానములో వివరించాను). ఈ 'భేతాళనాయుడు / చెవిరెడ్డి' కాకతీయ చక్రవర్తి గణపతి దేవుని (క్రీ. శ. 1199 - 1262) పరిపాలన కాలం వాడు. 'భేతాళనాయునికి' తొమ్మిదవ తరం వాడైన 'రేచర్ల సింగమ నాయుడు (1291 -1361)' వంశస్థుడు 'రేచర్ల అనపోతనాయుడు (1331 -1384)' క్రీ.శ. 1243 లో "#కాకతీయసామ్రాజ్యవిస్తరణమునకు" ఎంతో దోహదం చేశాడు. సాహితీ రంగమునకు, సమరాంగణమునకు సవ్యసాచిత్వము నెఱపిన #సర్వజ్ఞసింగభూపాలుడు (1405 - 1475) ఈ కుదురుకు చెందినవాడు. ఈ సింగభూపాలాన్వయుడు #పెద్దమహీపతి. ఈయనే "సురభి" వారికి కూటస్థుడు. 'సురభి' అనునది జటప్రోలు పాలకుల గృహనామము, గోత్రము 'రేచర్ల'. పెద్దమహీపతికి అయిదవ తరమువాడు #సురభిమాధవరాయలు. ఈతడు ప్రసిద్ధమగు "చంద్రికా పరిణయం" ప్రబంధ కర్త. ఈ వంశం వారికి ‘కంచి కవాట చూరకార, పంచపాండ్య దళవిభాళ, ఖడ్గనారాయణ’ అనే బిరుదులున్నాయి. సుమారు రెండువందల సంవత్సరాల క్రితం ప్రస్తుతమున్న 'కొల్లాపురం' రాజధానిగా చేసుకొని పరిపాలన సాగించారు. ఈ వంశాన్ని '30 మంది రాజులు' దాదాపు 700 ఏళ్లు పరిపాలించారు. జటప్రోలు సంస్థాన స్థాపకుడు, రేచర్ల అనపోతనాయుడు వంశస్థుడు "రేచర్ల కుమార మదానాయుడు" జటప్రోలు సంస్థానాన్ని అభివృద్ధి చేశాడు. 36 వంశాలకు మూల పురుషుడైన భేతాళరాజు తర్వాత సామంతరాజులుగా కొల్లాపూర్ సంస్థానాన్ని 26 మంది 'సురభి వంశ రాజులు' పరిపాలించినట్టు చారిత్రక, సాహిత్య ఆధారాలు వెల్లడిస్తున్నాయి. 12వ శతాబ్ధం చివరి భాగంలో, 13వ శతాబ్ధం ఆరంభంలో అంటే 1195 నుంచి 1208 ఏండ్ల మధ్యకాలంలో 'భేతాళరాజు' పరిపాలన కొనసాగించినట్టు శాసన ఆధారాలున్నట్టు 'శ్రీ వేదాంతం మధుసూదన శర్మ' తాను స్వయంగా రచించిన #కొల్లాపూర్ #సాహితీవైభవం పుస్తకంలో పేర్కొన్నారు. ఆయన తరువాత మాదానాయుడు, వెన్నమనాయుడు, దాచానాయుడు, సింగమనాయుడు, అనపోతానాయుడు, ధర్మానాయుడు, తిమ్మానాయుడు, చిట్టి ఆచానాయుడు, రెండో అనపోతానాయుడు, చిన్న మాదానాయుడు, ఎర్ర సూరానాయుడు, చిన్న మాదానాయుడు, మల్లానాయుడు, పెద్దినాయుడు, మల్లభూపతి, పెద్ద మల్లానాయుడు, మాధవరాయలు, నరాసింగరావు, మాధవరావు, బారిగడపలరావు, పెద్ద రామారాయుడు, జగన్నాథరావు, వెంటలక్ష్మారావు, వేంకట జగన్నాథరావు, వేంకట లక్ష్మారావు, జగన్నాథరావులు కొల్లాపూర్ సంస్థానాన్ని పాలించారు. ప్రస్తుతం వారి వారసుడిగా వేంకట కుమారకృష్ణ, బాలాదిత్య, లక్ష్మారావులు సంస్థానాధీశులుగా ఉన్నారు. "#సురభిమాధవరాయలు" విజయనగర ప్రభువు #అరవీటివంశ #అళియరామరాయలు (ఈయన శ్రీకృష్ణదేవరాయల అల్లుడు, చాళుక్య సోమవంశ క్షత్రియులు, రాచవారైన 'అరవీటి రామరాజు') కాలమున 'జటప్రోలు సంస్థానమును' బహుమతుగా పొందెను. "అళియ రామరాయలు" ఇచ్చిన సన్నదులో "ఆనెగొంది తక్తుసింహాసనానికి అధిపతులయిన..." అని కలదు (సురభి మాధవరాయలు, సారస్వత సర్వస్వము). 'సురభి వారి పూర్వీకుల' నుండీ వచ్చుచున్న వారసత్వ హక్కును 'అళియ రామరాయలు' సురభి మాధవరాయలకు స్థిరపరిచెను. "విజయనగర సామ్రాజ్య పతనానంతరం", మాధవరాయల పుత్రులు గోల్కొండ నవాబు "అబ్దుల్ హసన్ కుతుబ్ షా (తానీషా)" వలన క్రీ.శ. 1650లో మరల సంస్థానమునకు కొత్త సనదును సంపాదించెనట. వీరి తరువాత "సురభి లక్ష్మారాయ బహద్దరు" గారి వరకూ (సుమారు క్రీ.శ. 1840) సురభి వారి రాజధాని 'జటప్రోలు'. వీరి కాలమునుండి రాజధాని 'కొల్లాపురము' నకు మారినది. అప్పటినుండి వీరు '#కొల్లాపురముప్రభువులు' గా ప్రసిద్ధులయ్యారు. #సురభివారిరాజవంశవృక్షము.... 'సర్వజ్ఞ సింగభూపాలుని' వంశజులగు ఈ సంస్థానాధీశులందరూ శారదామతల్లికి సమర్పించిన మణిహారాలు తెలుగు సాహితీలోకమునకు వెలలేనివి. నిత్యకళ్యాణము పచ్చతోరణముగ విలసిల్లిన వీరి సాహితీమండపము విశ్వవిఖ్యాతమై విలసిల్లినది. (1) సర్వజ్ఞ సింగభూపాలుడు (1405 - 1475) (2) ఎఱ్ఱ సూరానాయుడు (3) మాధవ నాయుడు (4) పెద్దమహీపతి (5) ముమ్మిడి మల్లభూపాలుడు (1610 - 1670) (6) చినమల్లనృపతి (7) రామరాయలు (8) మల్లభూపతి (9) మాధవ రాయలు (10) నరసింగరావు (11) సురభి లక్ష్మారాయ బహద్దరు (1840) (12) రావు బహద్దర్ సురభి లక్ష్మీ జగన్నాధ రావు (1851 - 1884) (13) శ్రీ రాజా వేంకట లక్ష్మారావు బహద్దరు. "సురభి లక్ష్మారావు" గారి కుమారుడు 'సురభి లక్ష్మీ జగన్నాధరావు' క్రీ.శ. 1851 - 84 వరకూ రాజ్యము చేసిరి. నిజాం ప్రభువు నుండి 'రాజా బహద్దరు, నిజాం నవాజ్ వంత్' బిరుదులు పొందారు. వీరు దేవబ్రాహ్మణ తత్పరులు. వీరికి సంతానం లేకపోవడంతో, 'వెంకటగిరి ప్రభువులగు మహారాజా శ్రీ సర్వజ్ఞకుమార యాచేంద్ర బహద్దరు' గారి చతుర్థ పుత్రులగు 'నవనీత కృష్ణ యాచేంద్రులను' దత్తపుత్రులుగా స్వీకరించారు. వీరే 'శ్రీ రాజా వేంకట లక్ష్మారావు బహద్దరు' అను పేరిట 1884 నుండి జటప్రోలు సంస్థానమును పాలించారు. వీరికి 'బొబ్బిలి సంస్థాన పాలకులగు మహారాజా సర్ రావు వెంకట శ్వేతాచలపతి రంగారావు' గారు అగ్రజులు. ఈయన 'వెంకటగిరి' నుండి 'బొబ్బిలి' సంస్థానమునకు దత్తు వచ్చెను. వీరికిద్దరు పుత్రికా సంతానము. లక్ష్మారాయ బహద్దరు వారి కుమార్తెను 'తేలప్రోలు రాజా' గారికిచ్చి వివాహం చేసెను. లక్ష్మారాయ బహద్దర్ వారి ప్రధమ కుమార్తె 'నూజివీడు సంస్థానమున' తేలప్రోలు రాజావారి ధర్మపత్ని 'రాణి రాజరాజేశ్వరీ దేవి' గారు. రెండవ కుమార్తె శ్రీ రాజా ఇనుగంటి వెంకట కృష్ణారావు గారి ధర్మపత్ని 'రాణి సరస్వతీ దేవి గారు'. శ్రీ రాజా సురభి లక్ష్మారాయ బహద్దర్ గారికి పురుష సంతతి లేదు. కావున, వీరు తమ వారసులుగా ప్రఖ్యాత 'బొబ్బిలి సంస్థానమునుండి శ్రీ రాజా వెంకటశ్వేతా చలపతి రామకృష్ణ రంగారావు బహద్దర్' వారి కుమారులను దత్తు చేసుకొనెను. వారిని 'శ్రీ రాజా సురభి వేంకట జగన్నాధరావు బహద్దర్' అను పేర సంస్థాన వారసులుగా నిర్ణయించెను. ప్రస్తుత 'కొల్లాపూర్ రాజవంశీయులు' వీరి అనువంశీకులే. శ్రీ రాజా వేంకట లక్ష్మారావు గారి అనంతరము వారి ధర్మపత్ని '#రాణివెంకటరత్నమాంబ' గారు సంస్థానమును కొంతకాలం పాలించారు. తరువాత వీరి దత్తపుత్రులు 'శ్రీ రాజా సురభి వెంకట జగన్నాధ రావు బహద్దరు' గారు సంస్థాన బాధ్యతలు నిర్వహించారు. వీరు 'తిరుపాచూరు' జమిందారులైన 'రాజా ఇనుగంటి వెంకట కృష్ణరావు (1899 - 1935)' కుమార్తె యగు 'ఇందిరాదేవిని' వివాహమాడెను. వీరి కాలముననే అన్ని సంస్థానములతో పాటుగా జటప్రోలు కూడా విశాలాంధ్రమున విలీనమైనది. లక్ష్మారావు 1928లో స్వర్గస్తులైనారు. ఆయన ధర్మపత్ని రాణిరత్నమాంబ జగన్నాథరావుకు సంరక్షకురాలిగా ఉంటూ రాజ్యభారం మోశారు. ఆమె సింగవట్నంలో #రత్నగిరికొండపై #రత్నలక్ష్మిఅమ్మవారిని ప్రతిష్టించి ఆలయాన్ని నిర్మించారు. 'పద్మనిలయం' పేరుతో విడిది కోసం ఒక బంగ్లాను కళాత్మకంగా కట్టించారు. ఆ కొండపై నుంచి దుర్భిణిలో చూస్తే 'జటప్రోలు, పెంట్లవెల్లి, కొల్లాపూర్' రాజసౌధాలేగాక ఆయా ప్రాంతాలు కళ్లముందున్నట్టుగా కనిపిస్తాయి. కొల్లాపూర్లోని బండయ్యగుట్ట సింగవట్నంలోని #లక్ష్మీనృసింహస్వామిఆలయం గుడి గోపురాలను కూడా ఆమె నిర్మించారు. 'జగన్నాథరావు' మేజర్ అయిన తర్వాత 1943లో పట్టాభిషేకం చేశారు. ఈయన తన పూర్వికుల మాదారిగానే పరిపాలన సాగించారు. 'రాజా జగన్నాథరావ
Image
దిశ పెట్రోలింగ్‌ వెహికల్స్‌ను ప్రారంభించనున్న సీఎం శ్రీ వైఎస్‌ జగన్*
Image