తిరుపతి (ప్రజా అమరావతి);
*జగనన్న విద్యా దీవెన*
*ఈ కార్యక్రమంలో మాట్లాడిన మంత్రులు, లబ్ధిదారులు*
*మేరుగ నాగార్జున, సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి*
విద్యలోని మాధుర్యం చదువుకున్నవారికి తెలుస్తుంది,
కష్టసాధ్యమైన ప్రసవ వేదన తల్లికి తెలుస్తుంది. సీఎం శ్రీ జగన్ గారికి చదువు విలువ తెలుసు కాబట్టే చదువుల విప్లవం తీసుకొచ్చారు. భారతదేశ రాజకీయ వ్యవస్ధలో ఏ రాజకీయ నాయకుడు చేయని విధంగా సంస్కరణలు తీసుకొచ్చారు. సమాజంలో వెనకబడిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, అగ్రవర్ణ పేద పిల్లలకు గుండె మీద చెయ్యి వేసుకుని చదువుకునే అవకాశం కల్పించిన సీఎంగారికి ధన్యవాదాలు. నేను చదువుకునే రోజుల్లో ఫీజులు కట్టలేక అనేకమంది మధ్యలోనే చదువులు మానేసేవారు. అప్పులు తెచ్చుకునేవారు, కానీ ఈ రోజు సీఎం గారు చదువుల విప్లవానికి నాంది పలికారు. క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అనేవారు గతంలో కానీ ఇప్పుడు జగన్ గారి కాలం, అంతకుముందు కాలం అని చెప్పుకోవాలి. ఇది సువర్ణాక్షరాలతో లిఖించేదిగా ఉంటుంది. నాడు బీఆర్ అంబేద్కర్, జ్యోతిరావుపూలే, పెరియార్ రామస్వామి నాయకర్‌లాంటి ఉద్దండులు సామాజిక విప్లవానికి తెరతీస్తే వాటిని అమలుచేయాల్సిన ప్రభుత్వాలు చేయడం లేదు. సీఎంగారి పాలన ఒక చరిత్ర, రాబోయే రోజుల్లో చదువుకునే పిల్లలకు ఆశాజ్యోతిగా, ఆ కుటుంబాలకు వెలుగుగా, అక్కచెల్లెల్లకు వరంగా భావిస్తున్నాం. ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసిన మీకు జీవితాంతం రుణపడి ఉంటాను. సెలవు.
*ఆర్.కే.రోజా, పర్యాటక, సాంస్కృతిక, యువజన వ్యవహారాల శాఖ మంత్రి*
ఈ విద్యాదీవెన పథకం దేశంలో ఏ రాష్ట్రంలో లేని అద్భుతమైన పధకమని గర్వంగా చెప్పగలను. పేదరిక నిర్మూలనకు విద్య ఒక్కటే మార్గమని నమ్మిన సీఎం శ్రీ వైఎస్ జగన్, విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి అమ్మ ఒడి నుంచి విద్యా దీవెన, వసతి దీవెన, ఫీజు రీఇంబర్స్‌మెంట్ వరకు విద్యార్ధులకు ప్రభుత్వం అండగా ఉంది. జగనన్నకు విద్యార్ధులు, వారి తల్లిదండ్రుల తరపున పాదాభివందనాలు. పేదవాడి చదువుకు ఢోకాలేకుండా ఉన్నత విద్య అంటే ఉన్నవాడికే కాదు అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికీ అని జగనన్న మీ ముందుకు విద్యను తీసుకొచ్చారు. ఈ దేశంలో ఏ రాష్ట్ర సీఎం విద్యార్ధుల గురించి ఇంత చిత్తశుద్దిగా, ఇంత ప్రేమగా చేయలేదు. మేం చదువుకున్న సమయంలో మాకు ఇలాంటి సీఎం లేకపోవడం మా దురదృష్టం. కానీ ఈ రోజు ఆయన ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉండడం మా అదృష్టం. జగనన్న పారదర్శకంగా, అవినీతికి తావులేకుండా, తల్లిదండ్రుల అకౌంట్లలో ఠంచన్‌గా డబ్బు వేస్తున్నారు. కానీ చంద్రబాబుకు పేదవారంటే నచ్చదు, పేద విద్యార్ధులంటే నచ్చదు, అందుకే రూ. 35 వేలు సీలింగ్ పెట్టి కోతలు విధించి చదువుకోనీయకుండా ఏ విధంగా నరకయాతన పెట్టారో చూశారు. చంద్రబాబు సీఎంగా దిగిపోయే సరికి దాదాపు రూ. 1,800 కోట్లు బకాయిలు పెట్టారు కానీ మన జగనన్న ఆ బకాయిలు కూడా చెల్లించడంతో పాటు అందరికీ ఫీజు రీఇంబర్స్‌మెంట్ ఇస్తున్నారు. పేద విద్యార్ధుల విద్య కోసం దాదాపు రూ. 11 వేల కోట్లు తల్లుల అకౌంట్లలో వేసిన మనసున్న మారాజు మన జగనన్న. అంతేకాదు 31 పథకాలు అమలుచేసిన సీఎం వన్ అండ్ ఓన్లీ జగన్. జగనన్నను అందరూ ప్రశంసిస్తుంటే అది చూసి సహించలేని చంద్రబాబు శ్రీకాకుళంలో జగన్‌గారు సీఎం అవడం అరిష్టమంటున్నారు. కరువుకు ఫ్యాంట్, షర్ట్ వేస్తే ఏవరయ్యా అంటే చంద్రబాబు అని ప్రజలంతా చెబుతారు. ఆయన హయాంలో ఏ ఒక్క వర్గానికి ఏమైనా చేశారా అంటే ఏమీ లేదు. టీడీపీ వారు బాదుడే బాదుడు కార్యక్రమం చేస్తున్నారు, కానీ ప్రజలు స్ధానిక ఎన్నికల్లో టీడీపీ వారిని బాది పంపారు, ఇలాగే పిచ్చి వాగుడు వాగుతుంటే రాబోయే 2024 లో వారిని బాదేసి 23 సీట్లు కూడా లేకుండా మొత్తానికి చంద్రబాబును, లోకేష్‌ను ఇంటికి పంపుతారు. పేద పిల్లలకు మంచి ఆరోగ్యం ఇవ్వడం కోసం తిరుపతిలో చిన్నారుల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభించడం ఆయన పెద్ద మనసుకు నిదర్శనం. సెలవు.
*ఇందుమతి, బీటెక్ ఫైనలియర్ విద్యార్ధిని, కరకంబాడి*.
జగనన్నా నమస్తే, మా నాన్న సామాన్య రైతు, ఒక సామాన్య రైతు తన కూతురిని ఇంజినీరింగ్ చదివించాలంటే ఎంత కష్టమో ఆలోచించండి. నేను బీటెక్ ఫస్టియర్ చదువుతున్నప్పుడు నా పరిస్ధితి అలాగే ఉండేది, కానీ జగనన్న ప్రభుత్వం రాగానే నాకు చాలా సాయం అందింది. ఫస్టియర్‌లో నాకు రూ. 35 వేలు మాత్రమే ఫీజు రీఇంబర్స్‌మెంట్ వచ్చింది కానీ జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత రూ. 73,900 ఫుల్ ఫీజు రీఇంబర్స్‌మెంట్ వచ్చింది. ఇది మాత్రమే కాదు నా హాస్టల్ వసతి కోసం ప్రతీ ఏడాది రూ. 20 వేలు వచ్చాయి. ఇలా జగనన్న నా ఒక్కదానికే కాదు నా కుటుంబం అందరికీ సాయం చేశారు. మా చెల్లికి అమ్మ ఒడి, మా నాన్నకు రైతు భరోసా, మా నాన్నమ్మకు ప్రతీ నెలా ఫించన్ వస్తుంది. నేను ఈ రోజు క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లో మూడు ఉద్యోగాలు సంపాదించానని, జగనన్న చెల్లిగా గర్వంగా చెబుతాను. నేనొక్కదానినే కాదు ప్రతీ విద్యార్ధి జగనన్న ప్రవేశపెట్టిన పథకాలు అందుకుని అభివృద్ది చెందాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. మన మహిళలందరి కోసం మన జగనన్న దిశ యాప్ తెచ్చారు, మన కోసం జగనన్న ఎంతో సహాయపడుతున్నారు. మీ ఆదరాభిమానాలు మా మీద ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ రావాలి జగన్ కావాలి జగన్...ధన్యవాదాలు.
addComments
Post a Comment