సామాజిక సంస్కరణలను తెఛ్చిన ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి
సంక్షేమ పథకాలను చేరువ చేసేందుకే బస్సు యాత్ర
రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి మేరుగ నాగార్జున
విజయనగరం, మే 22 (ప్రజా అమరావతి);; మంత్రివర్గం లో ఎస్.సి.,ఎస్.టి., బి.సి , మైనారిటీ వర్గాలకు చెందిన 17 మందికి మంత్రి పదవులను ఇఛ్చి ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి సామాజిక సంస్కరణలకు పెద్ద పీట వేశారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి మేరుగ నాగార్జున తెలిపారు. అంతేకాకుండ అనేక కార్పొరేషన్, డైరెక్టర్ పదవులలో వారిని నియమించడం ద్వారా
బడుగు, బలహీన వర్గాలు పట్ల ఆయనకు ఉన్నటువంటి ప్రేమను చాటుకున్నారని తెలిపారు. అటువంటి ముఖ్యమంత్రిని కాపాడుకోవడం మనందరి కనీస బాధ్యతని పిలుపునిచ్చారు.
బడుగు బలహీన వర్గాల వారికోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పై గడప గడపకు తెలియజేయాలని అన్నారు. తద్వారా
ముఖ్యమంత్రి నాయకత్వాన్ని బలోపేతం చేయాలన్నారు. ఆదివారం జిల్లా పరిషత్ అతిధి గృహానికి మంత్రి చేరుకున్నారు. సంయుక్త కలెక్టర్ మయూర్ అశోక్, డి.ఆర్.ఓ గణపతి రావు , ఎస్.సి., బి.సి, మైనారిటీ నాయకులు పుష్ప గుఛ్చాలతో మంత్రి కి స్వాగతం పలికారు. అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రభుత్వానికి అండగా నిలవడానికే ఈ నెల 26 నుండి 29 వరకు
బస్సు యాత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు. బడుగు బలహీన వర్గాల ప్రజలంతా ఈ యాత్ర లో పాల్గొని ప్రభుత్వానికి , ముఖ్యమంత్రికి మద్దతును తెలపాలన్నారు. అందరికి సమాన ప్రాతినిధ్యం ఇస్తూ ముఖ్యమంత్రి చేస్తున్న పాలనను సువర్ణాక్షరాలతో లిఖించ దగ్గగా ఉందని పేర్కొన్నారు. ఒకప్పుడు అణచివేయబడ్డ వర్గాల వారంతా ముఖ్యమంత్రికి జై కొడుతున్నారని అన్నారు. దాడుల పట్ల ముఖ్య మంత్రి గారే ముందు స్పందిస్తున్న తీరును ప్రతి ఒక్కరు గమనించాలన్నారు. దళితుల గురించి, బి.సి ల గురించి ప్రతిపక్షానికి మాట్లాడే అర్హత లేదన్నారు.
ఈ సమావేశంలో ఎస్.సి. బి.సి మైనారిటీ నాయకులు పక్కి దివాకర్, కృష్ణ మూర్తి, నాయుడు బాబు, జై హింద్ కుమార్, డిసిసిబి చైర్మన్ అప్పల నాయుడు, డి.సి.ఎం.ఎస్ చైర్ పర్సన్ డా.భావన, తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment