కొవ్వూరు మండలం దొమ్మెరు లే అవుట్ లో కలెక్టర్ సందర్శన





కొవ్వూరు మండలం  దొమ్మెరు లే అవుట్ లో కలెక్టర్ సందర్శన



ఇండ్ల నిర్మాణాలు వేగవంతం చెయ్యండి


కాలనీల్లో మౌలిక సదుపాయాల కు భరోసా

.. కలెక్టర్ మాధవీలత


రాష్ట్ర ప్రభుత్వం పేదలందరికీ ఇండ్ల స్థలాలు ఉచితంగా అందించి, ఇంటి నిర్మాణం కోసం 

చేయూతను ఇవ్వడం జరుగుతుందని లబ్దిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత కోరారు. 


శుక్రవారం రాత్రి కొవ్వూరు మండలం దొమ్మెరు లోని జగనన్న లే అవుట్ ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఈ లే అవుట్ లో 100 ఇంటి నిర్మాణం కోసం లబ్దిదారుల కి స్థలం కేటాయించామని, 45 మంది ఇంటి నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. మిగిలిన 55 మంది లబ్దిదారులు ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించినా, అనుకున్న స్థాయిలో ప్రగతి లేదని పేర్కొన్నారు. ప్రతి వాలంటీర్ ప్రభుత్వం ఇంటి నిర్మాణం కోసం దశల వారీగా అందచేస్తున్న సహాయ సహకారాలు తెలియచేసి, వారికి ప్రేరణ కలిగించే విధంగా అడుగులు వెయ్యాలని ఆదేశించారు. ఆర్థికంగా కూడా వారికి రుణాలు మంజూరు చేసే విధానం లో కమ్యూనిటీ కో ఆర్డినేటర్ లు చురుకైన పాత్ర పోషించాలన్నారు.  సామాజిక బాధ్యతగా లబ్దిదారుల్లో చైతన్యం తీసుకుని త్వరితగతిన ఇంటి నిర్మాణం చేపట్టి పూర్తి చేయించాలని పేర్కొన్నారు. స్వయం సహాయక సంఘాలు సభ్యులకు సుమారు  రూ.50 వేలు వరకు ఆర్థిక దన్ను ఇవ్వడం తో ఇంటి నిర్మాణాలు వేగం చేసి, ప్రభుత్వం విడతల వారీగా భరోసా ఇవ్వడం పై మరింతగా అవగాహన కలిగించాలన్నారు.


కొవ్వూరు ఆర్డీఓ, ఎస్. మల్లిబాబు, డిహెచ్ఓ బి. తారా సింగ్, , డ్వామా పి. డి., పి. జగదాంబ, సర్పంచ్ తానేటి కుమారి పలువురు ప్రజా ప్రతినిధులు, వాలంటీర్లు, లబ్దిదారులు పాల్గొన్నారు.



Comments