గృహ నిర్మాణాలు,ఓటిఎస్ పై కలెక్టర్ టెలీ కాన్ఫరెన్స్

 


 రాజమహేంద్రవరం  (ప్రజా అమరావతి);  




** గృహ నిర్మాణాలు,ఓటిఎస్ పై  కలెక్టర్ టెలీ కాన్ఫరెన్స్



పనుల పురోగతిపై డివిజన్,మండల 

గ్రామ స్థాయి అధికారులకు  దిశా నిర్దేశం


మంగళవారం నాటికి లక్ష్యాలలో ప్రగతి చూపాలి..


..కలెక్టర్ మాధవీలత 


జిల్లాలో స్వయం సహాయక సంఘాల సభ్యులకు రుణాలు మంజూరు చేసి ఓ టి ఎస్, హౌసింగ్ లక్ష్యాలను పూర్తిచేయాలని ఈ విషయంలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తే ఉపేక్షించేది లేదని జిల్లా డా. కలెక్టర్ కె. మాధవి లత స్పష్టం చేశారు.


గురువారం సుమారు 80 నిమిషాల పాటు క్షేత్రస్థాయిలో ఆర్ డి వో లు,  మున్సిపల్ కమిషనర్లు, తాహాసిల్దార్, ఎంపీడీవోలు, డి ఆర్ డి ఎ , డ్వామా అధికారులతో పాటు క్లస్టర్ సిబ్బంది,  కార్యదర్శులతో   టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఓటీఏస్, హౌసింగ్ గ్రౌండింగ్, ఈ శ్రమ్ లపై మండలాల వారీగా సమీక్షించారు.  ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత  మాట్లాడుతూ, ఓ టి ఎస్ లక్ష్యాలను సాధించేందుకు కమ్యూనిటీ  కోఆర్డినేటర్ లకు లక్ష్యాలను నిర్దేశించామన్నారు.  నిర్దేశించిన లక్ష్యాలలో కనీస ప్రగతి చూపని  సిబ్బందిపై పర్యవేక్షణ చేయని మండల అధికారుల పై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ టి ఎస్ లో అర్హులైన వారందరి చేత డిమాండ్ మేరకు నగదు చెల్లింపులు జరపాలన్నారు. ఇందులో భాగంగా ఎస్.హెచ్.జి లో సభ్యులుగా ఉన్న వారికి ఆర్ఎఫ్ రుణాలను మంజూరు చేసి ఓ టి ఎస్ చెల్లింపులు జరపాలన్నారు. అందుకు గ్రామ అ మండల సంఘ సమాఖ్య ద్వారా రుణాలు ఇప్పించే బాధ్యత సి. సి. లదే అన్నారు.  ఓటీఏస్ రిజిస్ట్రేషన్ లు పూర్తి అయిన వాటి డాక్యుమెంట్లు ముద్రణ చేసి, లబ్ధిదారులకు పంపిణీ చేయాలన్నారు. ఇంకా పెండింగ్ లో ఉన్న వాటి వివరాలు గ్రామాల వారీగా సేకరించి, తదుపరి కార్యాచరణ ప్రణాళిక అమలు చేయాలని ఆదేశించారు. 


జిల్లాలో హౌసింగ్ నిర్మాణాలను మరింత వేగవంతం చేయాలని ఇందుకోసం స్వయం సహాయక సంఘాల మహిళలకు రుణాలను అందించడం ద్వారా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ మాధవి లత తెలియజేశారు.   ఈ రుణాలు అందజేయ్యాడం ద్వారా ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయగలుగుతా మన్నారు.  మండల స్థాయిలో హౌసింగ్, ఎంపీడీవో తహసీల్దార్లు సమయం సమన్వయం చేసుకుంటూ లబ్ధిదారులకు అవగాహన పెంచాలన్నారు.  ఇప్పటికే నిర్మాణాలు పూర్తి చేసిన లబ్ధిదారులతో  సమావేశాలు ఏర్పాటు చేయాలన్నారు. ఇప్పటి వరకూ గ్రౌండింగ్ అయిన గృహాలను తదుపరి స్టేజీల తీసుకెళ్లేందుకు బేస్మెంట్, రూఫ్, స్లాబ్ స్థాయి కి తీసుకుని వెళ్లాలన్నారు. ప్రతిరోజూ ప్రగతి పై సమీక్ష చేయాలన్నారు. ఇందుకు ఆర్డీవో లు ప్రతి రోజు సమీక్ష చెయ్యాలని ఆదేశించారు.  సింగిల్ డిజిట్ లో ఉన్న మండలాలు త్రీ డిజిట్ కి ప్రగతి చూపాల్సి ఉందన్నారు. మునిసిపల్ కార్పొరేషన్, కొవ్వూరు, నిడదవోలు మునిసిపల్ కమిషనర్ లు పట్టణ ప్రాంతాలకు ఓటీఏస్ లక్ష్యాలను నూరుశాతం సాధించాల్సి ఉందన్నారు. 


గ్రామ వార్డు సచివాలయలపై సమీక్షిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా గ్రామాల్లో నే పరిపాలన సౌలభ్యం కోసం సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసిందన్నారు.  పథకాల అమలులో కొన్ని సచివాలయాల పరిధిలో నిర్దేశించిన లక్ష్యాలను  చేరడంలో వెనుకబాటుతనం గుర్తించామన్నారు. దీనిపై మునిసిపల్, మండల స్థాయి అధికారులు ప్రతిరోజు సచివాలయాల పనితీరు పై పర్యవేక్షణ సమీక్ష అవసరమన్నారు. పట్టణ ప్రాంతంలోని సచివాలయాల్లో 10 సేవలు, గ్రామీణ ప్రాంతాల్లోని సచివాలయంలో 5 సేవలు అందేలాగా చూడాలన్నారు.   లక్ష్యాలను చేరుకోవడంలో ప్రభుత్వం క్షేత్రస్థాయిలో బలమైన వ్యవస్థను ఏర్పాటు చేసిందని సిబ్బందిని వినియోగించడం ద్వారా లక్ష్యాలను చెరుకోగలన్నారు.


ఈ శ్రమ్ నమోదు 

 ది 21.5.1962 నుంచి 20.5 2006 మధ్యలో జన్మించిన అసంఘటిత రంగంలో ఉన్నవారు ఈ శ్రమ్ లో పేర్లు నమోదుకు అర్హులన్నారు. "ఈ శ్రమ్" కింద జిల్లాలో 5.46 లక్షల మంది నమోదు లక్ష్యం కాగా,  ఇప్పటివరకు 1.95 మందిని మాత్రమే రిజిస్టర్ చేయడం జరిగిందన్నారు.  "ఈ శ్రమ్" లో నమోదుకు లబ్ధిదారుల ఆధార్ నెంబర్, బ్యాంకు ఖాతా,  మిగిలిన లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు వేగవంతం చేయాలని అధికారులను కలెక్టర్ మాధవీలత ఆదేశించారు.   ఆధార్ కు అనుసంధానమైన ఫోన్ నెంబర్ తో నమోదు ప్రక్రియ రిజిస్ట్రేషన్ సులభతరం అవుతుందని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ శ్రమ్ లో ఉపాధి హామీ జాబ్ కార్డు హోల్డర్, అసంఘటిత కార్మికులు ఈ పోర్టల్ లో నమోదు చేయించే విధంగా చర్యలు చేపట్టి నిర్దేశించిన లక్ష్యాలను వారం రోజుల్లోగా పూర్తి చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.


Comments