కర్నూలు లో బిజెపి కార్యాలయానికి భూమి పూజ చేసిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ సోమువీర్రాజు

 కర్నూలు లో  బిజెపి కార్యాలయానికి భూమి పూజ చేసిన

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ సోమువీర్రాజు కర్నూలు (ప్రజా అమరావతి)!; భారతీయ జనతపార్టీ కార్యాలయానికి శంకుస్ధపాన నిర్వహించారు . ఇద్దరు స్ధల దాతలు బిజెపి కార్యాలయానికి ఎంతో  ఉదారంగా  స్థలాన్ని ఇవ్వడం జరిగింది. సుమారు 50 సెంట్లు భూమిలో  బిజెపి జిల్లా కార్యాలయాన్ని  నిర్మాణం సంవత్సరంలో  పూర్తి చేస్తామని  బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు శ్రీసోమువీర్రాజు ప్రకటించారు.  బిజెపి ని క్షేత్ర స్ధాయిలో  బలోపేతం చేస్తున్నామని   ఈ కార్యక్రమంలో భాగంగా  పోలింగ్ భూత్  స్ధాయిలో కమిటీలు వేస్తున్నామన్నారు .   వైసిపి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా     బిజెపి  మాత్రమే పోరాటం చేస్తోందన్నారు.ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు టిజి వెంకటేష్.   బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి,  బవన నిర్మాణ కమిటీ  రాష్ట్ర కన్వీనర్ సైదారెడ్డి, స్థల దాతలు  రాఘవేంద్ర రావు ,తుమ్మెపల్లి రామారావు,  జిల్లా అధ్యక్షుడు పోలంకి రామాస్వామి, విట్టా రమేశ్ తదితరులు పాల్గొన్నారు.

Comments