ఎక్కువ మంది కూలీలు ఉపాధి పనులకు వచ్చేలా అవగాహన కల్పించాలి*
*: రెండు రోజుల్లోగా బిల్లులు చెల్లింపునకు చర్యలు*
*: జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్*
*: కొత్తచెరువు మండలంలోని నారేపల్లి, కేశాపురం గ్రామాల్లో ఉపాధి హామీ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్*
కొత్తచెరువు (శ్రీ సత్యసాయి జిల్లా), మే 11 (ప్రజా అమరావతి):
*జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కూలీలు ఎక్కువమంది పనులకు వచ్చేలా వారికి అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్ ఆదేశించారు. బుధవారం కొత్తచెరువు మండలంలోని నారేపల్లి, కేశాపురం గ్రామాల పరిధిలో ఉపాధి హామీ పథకం కింద జరుగుతున్న ఫీల్డ్ ఛానల్ వ*ర్క్, చేపల చెరువులో పూడికతీత పనులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు.నారే పల్లి మెయిన్ రోడ్ నుంచి జిల్లా కలెక్టర్ స్వయంగా మోటార్ బైక్ నడుపుకుంటూ వెళ్లారు. ఉపాధి పనులను పరిశీలించి కూలీలతో మాట్లాడారు. కేశపురం నందు జిల్లా కలెక్టర్ స్వయంగా నడుచుకుంటూ ఉపాధి పనులను పరిశీలించి. ఉపాధి కూలీలతో మాట్లాడారు
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వేసవి కాలంలో ఉపాధి హామీ పథకం కింద ఎక్కువ పనులు చేసేందుకు వీలు ఉంటుందని, జూన్ నెలాఖరు లోపు కూలీలకు ఉన్న వంద రోజుల పని దినాలు పూర్తయ్యేలా ప్రతిరోజు ఉపాధి పనులకు రావాలన్నారు. ప్రతిరోజు 257 రూపాయల కూలీ వచ్చేలా ఎక్కువ స్థాయిలో పని చేయాలని కూలీలకు సూచించారు. మరింత ఎక్కువ మంది ఉపాధి పనులకు వచ్చేలా కూలీలకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు.
రెండు రోజుల్లోగా బిల్లులు చెల్లింపునకు చర్యలు :
ఈ సందర్భంగా కూలీలతో జిల్లా కలెక్టర్ మాట్లాడారు. మాకు 6 వారాల నుంచి కూలీ డబ్బులు రావడంలేదని కూలీలు జిల్లా కలెక్టర్ కు తెలియజేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం కింద కూలీలకు డబ్బులు చెల్లింపు విషయమై ఉన్నతాధికారులతో మాట్లాడటం జరిగిందని, రెండు రోజుల్లోగా కూలీలకు బిల్లులు చెల్లింపు చేసేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అప్పటిలోగా కూలీలకు స్లిప్ ఇవ్వడం జరుగుతుందన్నారు. త్వరితగతిన బిల్లులు చెల్లించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. బిల్లుల విషయంలో ఎలాంటి ఆందోళన అవసరం లేదన్నారు. కూలీలంతా ఉపాధి పనులను చేసేందుకు ఎక్కువ మంది ముందుకు రావాలన్నారు. ఈ కార్యక్రమంలో డ్వామా ఏపీడి రఘునాథ్ రెడ్డి, ఏపీఓ, నాగిరెడ్డి,మేటి మునస్వామి ఉపాధి,కూలీలు పాల్గొన్నారు.
addComments
Post a Comment