సినిమా హీరో జొన్నలగడ్డ హరికృష్ణ
*- స్టూడెంట్ బ్యాక్ డ్రాప్ లో పాన్ ఇండియా మూవీ ఆటో రజిని*
*- విజయవాడలోనే రెండు షెడ్యూల్స్ పూర్తి*
*- రజినీ స్టైల్లో అదరగొడుతున్న హీరో హరికృష్ణ*
*- 100 మంది ద్యాన్సర్లతో ' ప్రేమ్ రక్షిత్ ' పాట చిత్రీకరణ*
*- కృష్ణపట్నం పోర్టులో భారీ సెట్టింగ్ లతో షెడ్యూల్ కు ప్లాన్*
*- పూర్తిస్థాయిలో సహకరిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం*
*- ఆటో రజిని సినిమా డైరెక్టర్ జొన్నలగడ్డ శ్రీనివాన్*
విజయవాడ, మే 4 (ప్రజా అమరావతి): ఒక కులం, ఒక మతం, ఒక ప్రాంతానికి కట్టుబడకుండా అందరికీ నచ్చేలా, అందరినీ మెప్పించేలా స్టూడెంట్ బ్యాక్ డ్రాప్ లో మరో పాన్ ఇండియా మూవీ ఆటో రజిని తెరకెక్కుతోంది. చాప కింద నీరులా ఇప్పటికే ఈ సినిమా విజయవాడ నగరంలో రెండు షెడ్యూల్స్ ను పూర్తి చేసుకుంది. ఈ నెల 15 వ తేదీ నుండి మూడవ షెడ్యూల్ కూడా ప్రారంభం కానుంది. లవ్, మాస్, ఎంటర్టైన్మెంట్ ప్రధానంగా రూపుదిద్దుకుంటున్న ఆటో రజిని సినిమా తొలి షెడ్యూల్లోనే పొలిటికల్ టచ్ ఇవ్వడం చూస్తుంటే ఈ సినిమాపై అంచనాలు మరింత పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాలనపై కూడా ఆటో రజిని సినిమా ప్రభావం చూపుతుందని సమాచారం. ఇక ఈ సినిమా ప్రారంభోత్సవానికి సంబంధించి కృష్ణాజిల్లా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) కెమెరా స్విచ్ ఆన్ చేయగా, బాపట్ల ఎంపీ నందిగం సురేష్ క్లాప్ కొట్టారు. కాగా ఎంపీ నందిగం సురేష్ ఈ సినిమాలో ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. ఆటో ఓనర్ పాత్రలో నటిస్తున్న ఎంపీ నందిగం సురేష్, హీరో జొన్నలగడ్డ హరికృష్ణల మధ్య కొన్ని సన్నివేశాలను రెండవ షెడ్యూల్లో చిత్రీకరించారు. ఆటో రజిని సినిమాను ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువగా చిత్రీకరిస్తుండడంతో ఏపీ ప్రభుత్వం కూడా పూర్తిస్థాయిలో సహకరిస్తోందని సినిమా డైరెక్టర్ జొన్నలగడ్డ శ్రీనివాస్ చెబుతున్నారు. హీరో హరికృష్ణ స్వయానా, డైరెక్టర్ జొన్నలగడ్డ శ్రీనివాస్ కు కుమారుడు కావడంతో ఆటో రజిని సినిమాను ఒక రేంజ్లో నిర్మిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. పాన్ ఇండియా స్టార్ హీరోగా హరికృష్ణను తీర్చిదిద్దేందుకు డ్యాన్స్, ఫైట్స్ పై విపరీతమైన ఫోకస్ పెట్టారు. ఆర్ఆర్ఆర్ మూవీలో నాటు, నాటు సాంగ్ కు పనిచేసిన ప్రేమ్ రక్షిత్ ను ఆటో రజిని సినిమాకు కొరియోగ్రాఫర్ గా ఎంచుకున్నారు. ఆటో రజిని సినిమాలో ఇప్పటికే చిత్రీకరించిన ఒక సాంగ్ లో 100 మంది సీనియర్ డ్యాన్సర్లు, హీరో హరికృష్ణతో కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ వేయించిన స్టెప్ లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. మరోవైపు హీరో హరికృష్ణ కూడా రజినీకాంత్ స్టైల్లో యాక్షన్ సీన్లను కూడా అదరగొడుతున్నాడు. ఫైట్ మాస్టర్ కణల్ కన్నన్ ఆధ్వర్యంలో ప్రకాశం బ్యారేజ్ కింద నైట్ ఎఫెక్ట్ లో తీసిన ఇంటరడక్షన్ సీన్ అద్భుతంగా వచ్చింది. మూడవ షెడ్యూల్ ను కూడా విజయవాడ, పరిసర ప్రాంతంలోనే పూర్తి చేయనున్నారు. నాల్గవ షెడ్యూల్లోని సెకండ్ ఆఫ్ ను భారీ సెట్టింగ్ లతో కృష్ణపట్నం పోర్టులో తీసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇటీవల విడుదలై విజయం సాధించిన పాన్ ఇండియా సినిమా కేజీఎఫ్ చాప్టర్ -2 సినిమాలో పనిచేసిన కొంత మంది ఆర్టిస్ట్ లతో, ఆటో రజిని సినిమా కోసం డైరెక్టర్ జొన్నలగడ్డ శ్రీనివాస్ టాక్స్ జరుపుతున్నారు. పాన్ ఇండియా మూవీ స్థాయికి ఏ మాత్రం తగ్గకుండా, శక్తివంతమైన వెంచర్ ఉన్న జొన్నలగడ్డ ప్రొడక్షన్స్ లో ఈ చిత్రాన్ని దేశవ్యాప్తంగా పలు భాషల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు కూడా జరుగుతున్నాయి. ముఖ్యంగా రజినీకాంత్ అభిమానిగా హీరో హరికృష్ణ నటిస్తుండడం, సినిమా టైటిల్లోనూ రజిని పేరు ఉండడంతో ఆయన అభిమానులు కూడా స్వాగతిస్తున్నారు. దీంతో తమిళ్ వెర్షన్ లోనూ ఆటో రజినికి మంచి రెస్పాన్స్ లభించనుంది. కాగా సినిమాకు కథను విక్రమ్ రాజ్ అందించారు. ఎడిటింగ్ గౌతమ్ రాజు, మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ, కెమెరామెన్ ప్రసాద్ బాబు, ఆర్ట్ డైరెక్టర్ చిన్నా తదితరులు పనిచేస్తున్నారు.
addComments
Post a Comment