చిలమత్తూరుమండలంలో విస్తృతంగా పర్యటించిన జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్*
*: ఉపాధి పనులను, సచివాలయాన్ని, రైతు భరోసా కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్*
చిలమత్తూరు (శ్రీ సత్యసాయి జిల్లా), మే 17 (ప్రజా అమరావతి):
*శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్ చిలమత్తూరు మండలంలో విస్తృతంగా పర్యటించారు. మంగళవారం చిలమత్తూరు కేంద్రం పరిధిలో జరుగుతున్న ఉపాధి హామీ పథకం పనులను, సచివాలయాన్ని, రైతు భరోసా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు.*
*ముందుగా చిలమత్తూరు మండలం లోని పలకల పల్లి లో ఉపాధి పనులను పరిశీలించారు, ఉపాధి కూలీలతో మాట్లాడారు , అక్కడినుంచి కానుగ మా కుల పల్లి రోడ్డు నుంచి ద్విచక్ర వాహనంలో బయల్దేరి చెరువు నందుఉపాధి హామీ పథకం కింద జరుగుతున్న ఉపాధిపనులను జిల్లా కలెక్టర్ పరిశీలించిరు. ఈరోజు ఎంత మంది కూలీలుఉపాధి పనులకు వచ్చారు, ప్రతిరోజు ఎంత మంది కూలీలకు పనులకు వస్తున్నారు, ఇప్పటివరకు ఎన్ని రోజులు పని చేశారు, ఎంత కూలీ డబ్బులు వచ్చింది, తదితర వివరాలను కూలీలతో ఆరా తీశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎక్కువ మంది కూలీలు ఉపాధి పనులకు వచ్చేలా కూలీలకు అవగాహన కల్పించాలన్నారు. కూలీ డబ్బులు చెల్లించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతిరోజు 257 రూపాయల డబ్బులు వచ్చేలా పనిచేయాలని సూచించారు. పాత బకాయిలు అన్ని మీ మీ ఖాతాలోకి నగదు జమ చేయడం జరిగిందని, ఏప్రిల్ నెల మూడు వారాలు సంబంధించి, మే నెల మొదటి వారం సంబంధించిన ఉపాధి కూలీలకు సంబంధించిన వేతనాలను వారి వారి బ్యాంక్ ఖాతాలకు నగదును జమ చేయడం జరిగిందని కూలీలకు వివరించారు ఉపాధి హామీ పథకం పనులను కూలీలు అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కూలీల మస్టర్ లను తనిఖీ చేశారు.*
*సచివాలయం ద్వారా నాణ్యమైన సేవలు అందించాలి*
చిలమత్తూరు మండలం లోని పలకల పల్లి గ్రామ సచివాలయం జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సచివాలయం ద్వారా ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని ఆదేశించారు. ప్రభుత్వ పథకాలకు సంబంధించి అర్హులైన లబ్ధిదారులకు లబ్ధి చేకూర్చాలని, లబ్ధిదారులకు అక్నాలెడ్జ్మెంట్ కార్డులను అందించాలని, తదనంతరం వివరాలను ఆన్లైన్లో అప్డేట్ చేయాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సచివాలయంలో రిజిస్టర్ లను, బయోమెట్రిక్ అటెండెన్స్ ను తనిఖీ చేశారు. నూతనంగా నిర్మిస్తున్న రైతు భరోసా కేంద్రం భవన / గ్రామ సచివాలయం భవన నిర్మాణం పనులు జిల్లా కలెక్టర్ పరిశీలించారు. నాణ్యతగా భవన నిర్మాణం పనులు త్వరితగతిన పూర్తిచేయాలని కాంట్రాక్టర్ ను నరేందర్ రెడ్డి మరియు అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పెనుగొండ సబ్ కలెక్టర్ నవీన్. తాసిల్దార్ రంగనాయకుల. ఎంపీడీవో రామ్ కుమార్, ఏపీ డి శివానంద నాయక్, ఏపీవో రాజశేఖర్ సంబంధిత శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment