* దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలు.
* మహిళలే మహారాణులు అనే నినాదంతో ముందుకెళ్తున్న ప్రభుత్వం.
::: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి యస్ బి అంజాద్ బాషా:::
కడప- మే,1 (ప్రజా అమరావతి) :- దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని, ఇతర రాష్ట్రాలు మన రాష్ట్రం ను ఆదర్శంగా తీసుకుంటున్నారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి యస్ బి అంజాద్ బాషా అన్నారు. ఆదివారం స్థానిక అపూర్వ ఫంక్షన్ హాలు నందు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో వైయస్ఆర్ సున్నా వడ్డీ పథకం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్బి అంజాద్ బాషా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళల సాధికారతకు పెద్ద పీట వేసి మహిళలే మహారాణులు అనే నినాదంతో ముందుకు వెళ్తున్నారు అని అన్నారు. పథకాలలో 85% పథకాలు మహిళల పేరు పైనే చేయడం జరుగుతోందని అన్నారు. మన రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఇతర రాష్ట్రాల వారు ఆదర్శంగా తీసుకొని ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని అన్నారు. గ్రామ/ వార్డు సచివాలయ వాలంటీర్ ల ద్వారా వివిధ రకాల పెన్షన్లు ప్రతి నెల ఒకటవ తేదీ ఉదయాన్నే పెన్షన్దారుల ఇంటి వద్దకు వెళ్లి పెంచడం జరుగుతోందని అన్నారు. గత ప్రభుత్వంలో పెన్షన్ల కోసం ఎన్నో ఇబ్బందులు పడేవారని అన్నారు. ఈ ప్రభుత్వంలో పెన్షన్లు రూ.1000లు నుండి రూ.2500లు వరకు పెంచడం జరిగిందని రానున్న రోజుల్లో రూ.3000లకు పెంచడం జరుగుతుందని అన్నారు. ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం మహిళలు తీసుకున్న రుణాలను మాఫీ చేయడం జరుగుతోందని అన్నారు. మహిళలకు వైయస్ఆర్ సున్నా వడ్డీ క్రమం తప్పకుండా, ఒక నెల కూడా జాబ్ కాకుండా అందరికీ ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందని అన్నారు. ఆర్థిక పరిస్థితి సరిగా లేని కష్టకాలంలో కూడా అన్ని సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వమేనని అన్నారు. ఇతరుల కల్లబొల్లి మాటలు నమ్మి మోసపోయే కూడదని అన్నారు. సంఘాలలో లేని వారిని కొత్తగా సంఘాలలో చేర్చి అన్ని సంక్షేమ పథకాల లబ్ధిని అందించాలని అన్నారు. కడప కార్పొరేషన్ పరిధిలో 5650 సంఘాలు ఉన్నాయని ఇంకా 1500 సంఘాలు వచ్చే అవకాశం ఉందని అన్నారు. అన్ని సంక్షేమ పథకాలు 80 నుండి 85 శాతం వరకు పథకాలను మహిళల పేరు పైనే ఇవ్వడం జరుగు తోందని అన్నారు. ఇన్ని సంక్షేమ పథకాలను అందిస్తున్న ఈ ప్రభుత్వాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు.
నగర మేయర్ కే సురేష్ బాబు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి తన మేనిఫెస్టోలో చెప్పిన విధంగా అన్ని సంక్షేమ పథకాలను అమలు చేయడం జరుగుతుందని అన్నారు. గడచిన మూడు సంవత్సరాలలో మేనిఫెస్టోలో చెప్పిన విధంగా 95 శాతం హామీలను అమలు చేయడం జరిగిందన్నారు. ఈ ప్రభుత్వం చేతల ప్రభుత్వమని అన్నారు. వైయస్ఆర్ సున్నా వడ్డీ తో పాటు వైయస్సార్ ఆసరా పథకం ప్రకారం సంఘాలలో ఎంత అయితే రుణం ఉందో చేస్తామని చెప్పి ఉన్నారని, ఇప్పటికీ 50 శాతం వరకు 2 విడతలుగా వారి వారి ఖాతాలలో జమ చేయడం జరిగిందని అన్నారు. వచ్చే రెండు సంవత్సరాలలో కూడా పూర్తిగా వారి వారి ఖాతాలో డబ్బులు జమ చేసి హామీని నిలబెట్టుకోవడం జరుగుతుందని అన్నారు. వైయస్సార్ చేయూత కింద 45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల మహిళలకు మూడు సంవత్సరాల కాలంలో 75 వేల చొప్పున వారివారి ఖాతాలలో జమ చేయడం జరుగుతోందన్నారు. అదేవిధంగా ఒకే సంవత్సరంలో 31 లక్షల ఇళ్లు మంజూరు చేసి, ఇండ్ల పట్టాలను పంపిణీ జరిగిందని అన్నారు. అలాగే ఇళ్ల నిర్మాణానికి రూ.1 లక్ష, 80 వేలు ఇవ్వడంతోపాటు, అదనంగా డాక్రా సంఘాలలో ఉన్నవారికి పావలా వడ్డీ రుణం కింద 30 వేల రూపాయల ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించడం జరిగిందన్నారు. అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి, అమలు చేస్తున్న ప్రభుత్వానికి రుణపడి ఉండాలని అన్నారు.
కమలాపురం శాసనసభ్యులు పి రవీంద్ర నాథ్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే అభివృద్ధి సాధ్యమని అన్నారు. చేతల ప్రభుత్వానికి, మాటల ప్రభుత్వానికి తేడాను గమనించాలని అన్నారు. ఇతరుల చెప్పుడు మాటలు విని మోస పోరాదని అన్నారు. ఈ ప్రభుత్వం మన ప్రభుత్వమని మన జిల్లావాసి ముఖ్యమంత్రి కావడం మన అదృష్టమని అన్నారు. అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని ఇందులో ఎక్కువ భాగం మహిళల పేరు పైనే నగదు బదిలీ చేయడం జరుగుతుందని అన్నారు. ఇప్పటివరకూ రూ. 1.36 వేల కోట్ల రూపాయలు వివిధ లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయడం జరిగిందన్నారు.
అనంతరం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్బి అంజాద్బాష, నగర మేయర్ కె.సురేష్ బాబు, కమలాపురం శాసనసభ్యులు పి రవీంద్ర నాథ్ రెడ్డి చేతుల మీదుగా పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో 4858 గ్రూపుల కు సంబంధించి రూ.7.58 కోట్ల రూపాయల చెక్కును అందజేశారు.
ఈ కార్యక్రమంలో మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ రామ్మోహన్ రెడ్డి, కార్పొరేటర్లు, వైసిపి నాయకులు, అధికారులు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment