రాష్ట్ర గవర్నర్ శ్రీ బిశ్వభూషణ్ హరిచందన్ కు జిల్లా అధికారులు ఘన స్వాగతం పలికారు.

 


నెల్లూరు, మే 24 (ప్రజా అమరావతి): 

 కాకుటూరులోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో ముఖ్యఅతిథిగా పాల్గొనేందుకు విచ్చేసిన రాష్ట్ర గవర్నర్ శ్రీ బిశ్వభూషణ్ హరిచందన్ కు జిల్లా అధికారులు ఘన స్వాగతం పలికారు. 
 మంగళవారం ఉదయం 11.48 గంటలకు  శ్రీ విక్రమ సింహపురి విశ్వవిద్యాలయానికి హెలికాప్టర్ ద్వారా చేరుకున్న గవర్నర్ కు  హెలిప్యాడ్ లో  జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి ఆనం అరుణమ్మ, జిల్లా కలెక్టర్ శ్రీ కె వి ఎన్ చక్రధర్ బాబు,  విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ఆచార్య శ్రీమతి జి. ఎం. సుందరవల్లి, రిజిస్ట్రార్ శ్రీ ఎల్ వి కె రెడ్డి,  ఎస్పీ శ్రీ విజయ రావు, జాయింట్ కలెక్టర్ శ్రీ హరేంధిరప్రసాద్, నెల్లూరు నగర పాలక సంస్థ కమిషనర్ శ్రీమతి జాహ్నవి, అడిషనల్ ఎస్పి శ్రీమతి హిమవతి,  తెలుగు గంగ ప్రత్యేక కలెక్టర్ శ్రీ బాపిరెడ్డి, ఆర్డిఓ శీనా నాయక్  పుష్పగుచ్ఛాలు అందజేసి ఘన స్వాగతం పలికారు.

 అనంతరం విశ్వవిద్యాలయ స్నాతకోత్సవం,  నెల్లూరు రెడ్ క్రాస్ క్యాన్సర్ వైద్యశాలలో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్న గవర్నర్ సాయంత్రం 4.25 గంటలకు నెల్లూరు పోలీసు పరేడ్ గ్రౌండ్ నుంచి హెలికాప్టర్ లో తిరుగు ప్రయాణం కాగా కలెక్టర్ శ్రీ చక్రధర్ బాబు, ఎస్పీ శ్రీ విజయ రావు, జాయింట్ కలెక్టర్ శ్రీ హరేంధిర ప్రసాద్, నెల్లూరు నగర పాలక సంస్థ కమిషనర్ జాహ్నవి, అడిషనల్ ఎస్పీలు శ్రీమతి చౌడేశ్వరి, హిమవతి, డిప్యూటీ కలెక్టర్ శ్రీ సుధాకర్, ఆర్డిఓ శ్రీ కొండయ్య, తాసిల్దార్ షఫీ మాలిక్ వీడ్కోలు పలికారు. 


Comments