శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి
(ప్రజా అమరావతి):
ది.25-05-2022 న హనుమాన్ జయంతి పురస్కరించుకుని దేవస్థానం నందు ది.24-05-2022 నుండి ది.28-05-2022 వరకు నిర్వహించబడు కార్యక్రమములలో భాగముగా ఈరోజు అనగా ది.24-05-2022 న హనుమాన్ జయంతి సందర్భంగా ఇంద్రకీలాద్రిపై క్షేత్ర పాలకుడిగా ఉన్న శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారికి హనుమాన్ జయంతి ఉత్సవములు ఆలయ స్థానాచార్యులు శ్రీ విష్ణుభట్ల శివప్రసాద శర్మ గారు మరియు వైదిక కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఆలయ వేదపండితులు మరియు అర్చక సిబ్బంది అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా అమ్మవారి మూలవిరాట్టుకు ఎదురుగా రావిచెట్టు క్రింద వెలసియున్న ఆంజనేయస్వామి వారికి మరియు ఘాట్ రోడ్డు ప్రవేశం( టోల్ గేటు) వద్ద ఉన్న ఆంజనేయస్వామి వారి వద్ద ఈరోజు నిర్వహించిన కార్యక్రమములు-
- ఉ.08 గం. లకు గణపతి పూజ, ఋత్విక్ వరుణ,
- ఉ.10 గం. ల నుండి మ.12 గం. ల వరకు మూలమంత్ర జపము, మాన్యుసూక్త పారాయణ, సుందరాకాండ పారాయణ.
- సా.04 గం. ల నుండి 07 గం. ల వరకు మంటపారాధన, మూలమంత్ర జపము, మూలమంత్ర హవనము, హారతి, మంత్ర పుష్పము, ప్రసాద వితరణ.
addComments
Post a Comment