ఆంధ్ర ప్రదేశ్ భవన్ లో ‘ఆంధ్ర మామిడిపళ్ళ’ దుకాణం ప్రారంభం

  ఏ.పీ.ఐ.సీ – ఏ.పీ భవన్ -  న్యూఢిల్లీ – మే  20,  (ప్రజా అమరావతి) :

ఆంధ్ర ప్రదేశ్ భవన్ లో ‘ఆంధ్ర మామిడిపళ్ళ’ దుకాణం ప్రారంభం 


  ఢిల్లీ ఏ.పీ భవన్ ప్రాంగణం లో యూనియన్ బ్యాంక్ ఏ.టీ.యం పక్కన ఉన్న షాప్ నెం.1 లో ఏ.పీ మార్కఫెడ్ వారి దుకాణం పీ.ఆర్.సీ ప్రవీణ్ ప్రకాశ్ రిబ్బన్ కత్తిరించి ఆంధ్ర మామిడి పళ్ల షాప్ ను ఈ రోజు ఉదయం 11 గం ల కు ప్రారంభించారు.  ఈ కార్యక్రమంలో ఏ.ఆర్.సీ హిమాన్శు కౌశిక్ పాల్గొన్నారు.  ఈ సందర్భంగా పీ ఆర్ సీ ప్రవీణ్ ప్రకాశ్  మాట్లాడుతూ ఆంధ్ర నుంచి వచ్చే మామిడి పళ్లను ఢిల్లీలో నివసిస్తున్న ఆంధ్ర ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు.  ఈ కార్యక్రమంలో ఏ.పీ భవన్ ఉద్యోగస్తులు, ఉద్యోగుల వసతి గృహాలలో నివసిస్తున్న కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల నుండి వచ్చిన ప్రజలు పాల్గొన్నారు. పీ.ఆర్.సీ గారి చేతుల మీదుగా విక్రయాలను ప్రారంభించారు.  ఉద్యోగస్తులకు మరియు చుట్టుపక్కల ప్రజలకు కూడా మామిడి పళ్లను విక్రయించారు. ఈ దుకాణం ప్రతి రోజు ఉదయం 10 గం నుండి రాత్రి 8 గం వరకు పనిచేస్తుందని దుకాణం నిర్వాహకులు తెలిపారు. మార్కఫెడ్ వారి నుండి అన్ని రకాల ఆంధ్ర మామిడి పళ్ళు విక్రయిస్తున్నారు. 



Comments