ప్రజల అవసరాలు తెలుసుకుని వాటిని నెరవేర్చిన నాయకుడు జగనన్న



కొవ్వూరు (ప్రజా అమరావతి);


* ప్రజల అవసరాలు తెలుసుకుని వాటిని నెరవేర్చిన నాయకుడు జగనన్న 



* ఇచ్చిన హామీలు కాదు ఇవ్వని హామీలు కూడా ప్రజలకు అందించిన ఘనత మన ప్రభుత్వానిది



- హోమ్ మంత్రి తానేటి వనిత



గడపగడపకు మన ప్రభుత్వం ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేషం స్పందన వస్తుందని రాష్ట్ర హోం శాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు


 శనివారం రెండో రోజు ధర్మవరం గ్రామంలో మంత్రి తానేటి వనిత పర్యటించారు. సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ధర్మవరం గ్రామంలో మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత మూడు సంవత్సరాలలో 8,867 మంది లబ్ధిదారులకు 22 పథకాల ద్వారా రూ. 7,58,74,651 లు మేర ప్రయోజనం కలిగిందన్నారు గ్రామంలో అభివృద్ధి పనుల కోసం గత మూడు సంవత్సరాల్లో రూ.2,97,50,000 లతో సిసి రోడ్స్, డ్రెయిన్లు,  త్రాగునీటి సరఫరా, నాడు నేడు, తదితర  పనులు చేపట్టామన్నారు. గతంలో కొద్దిమందికి పథకాల ప్రయోజనం జరిగేదని మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పార్టీలకు రాజకీయాలకు అదేవిధంగా అర్హులకు పథకాలను వర్తింపు చేస్తున్నామన్నారు. దళారుల ఆశ్రాయించాల్సిన అవసరం లేదు,  ఎవరి చుట్టూ తిరగనవసరం లేకుండా వాలంటీర్ల మీ ఇంటికి వచ్చి అర్హులకు పథకాలను వర్తింప చేస్తున్నారని మంత్రి తానేటి వనిత తెలిపారు. ప్రయోజనం నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు జమ అవుతుందని ఇటువంటి ప్రభుత్వమే మళ్ళీ కావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. జగనన్న ప్రభుత్వం ఇచ్చిన హామీలు కాదు ఇవ్వని హామీలు కూడా వర్తింపజేసి ప్రజల మనసులో వైయస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారని మంత్రి తెలిపారు. సదరన్ ఐడి కార్డులు పంపిణీ చేశారు. ధర్మవరం గ్రామ పంచాయితీకి చెందిన చెత్త  సేకరణ రిక్షాను ప్రారంభించారు



జడ్పీ వైస్ చైర్మన్ పి. శ్రీలేఖ, జెడ్పీటీసీ బొంత  వెంకటలక్ష్మీ,   డి డి ఓ/ డ్వామా ఇంఛార్జి పిడి  పి జగదాంబ, తహశీల్దార్ బి. నాగరాజు నాయక్, స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు  ముళ్ళపూడి కాశీ,  సూరిబాబు, సందీప్,  తదితరులు పాల్గొన్నారు.


Comments