సచివాలయ సిబ్బంది ఐక్యతతో పనిచేసి సేవలందించాలి : కలెక్టర్ 'శివ శంకర్'
నరసరావుపేట, మే 18 (ప్రజా అమరావతి) : సచివాలయ సిబ్బంది ఒక టీం గా ఉండి ప్రజలకు అవసరమైన సేవలు అందించే విధంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ శ్రీ ఎల్ శివ శంకర్ అన్నారు. బుధవారం ఉదయం కోటప్పకొండ లోని గ్రామీణ అభివృద్ధి సంస్థ శిక్షణ మరియు సాంకేతిక అభివృద్ధి కేంద్రం వద్ద వెల్ఫేర్ అసిస్టెంట్లు, ఏఎన్ఎంలు తదితరులకు వైఎస్ఆర్ బీమా పై శిక్షణ ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సచివాలయ సిబ్బంది అలర్ట్ గా ఉండి ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులతో కలిసి సమన్వయంతో పనులు చేయాలన్నారు. వైయస్సార్ బీమా పై ఏర్పాటుచేసిన శిక్షణా తరగతులకు అది లేని వారు తమ తమ అభిప్రాయాలను పంచుకొని మరింత మెరుగైన సేవలు చేసేందుకు ఉపయోగపడుతుందన్నారు. జిల్లాలో అసంఘటిత కార్మికులకు ఇచ్చే ఈ శ్రమ కార్డులను మరింత మందికి అందించేలా కృషి చేయాలన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 28 శాతం మందికి మాత్రమే ఈ శ్రమ కార్డులు అందజేయడం జరిగిందన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకం కూలీలు, అంగన్వాడీ వర్కర్లు, ఆశా వర్కర్లు మరియు హెల్పర్ లకు కూడా ఈ శ్రమ కార్డులను అందజేయాలన్నారు. ఇది ఒక ఉద్యమం లాగా తీసుకొని వీలైనంత మందికి ఈ శ్రమ కార్డులను. అందజేయాలని ఆయన కోరారు. అదేవిధంగా క్లాప్ మిత్రులకు కూడా ఈ శ్రమ కార్డులను అందజేయాలన్నారు. ఈ శ్రమ కార్డుల వల్ల ఆకస్మికంగా చనిపోయినవారికి రెండు లక్షల రూపాయలు, కొంతమేర నష్టపోయిన వారికి లక్ష రూపాయలు లబ్ధి చేకూరుతుందని ఆయన తెలిపారు. అంతేకాకుండా ప్రధానమంత్రి శ్రమ యోగి మాన్ ధన్ యువజన కార్యక్రమంపై కూడా దృష్టిసారించి రిజిస్ట్రేషన్లు చేపట్టేలా గా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. సచివాలయ సిబ్బంది విధిగా డ్రెస్ కోడ్ పాటించాలని ఆయన తెలిపారు. నాడు నేడు కార్యక్రమం కింద అభివృద్ధి చెందిన పాఠశాలలకు నైట్ వాచ్ మెన్ ఏర్పాటు చేసే విధంగా చూడాలన్నారు. జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమాన్ని దిగ్విజయం అయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి ఇంటి వద్ద తడి చెత్త పొడి చెత్త వేరు చేసే విధంగా రెండు డస్ట్ బిన్ లను ఉపయోగించే విధంగా ప్రజలలో అవగాహన కల్పించాలన్నారు. శిక్షణకు హాజరైన వారి నుండి శిక్షణ తరగతులు ద్వారా వారు గ్రహించిన అంశాలను అడిగి తెలుసుకున్నారు. కొంతమంది అడిగిన ప్రశ్నలకు జిల్లా కలెక్టర్ స్పందిస్తూ హరి సూచనలను అనుగుణంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు. అనంతరం శిక్షణ కార్యాలయాన్ని పరిశీలించి శిక్షణ పొందుతున్న విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. విద్యార్థులకు తీసుకుంటున్న శిక్షణ వివరాలను అడిగి తెలుసుకున్నారు. మంచి శిక్షణలను ఏర్పాటు చేసిన అధికారులను ఆయన ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో డి ఆర్ డి ఎ ఇన్చార్జి పిడి ప్రేమ్ రాజ్, కార్మిక శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఆదినారాయణ, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు కుమారి, ఏరియా కోఆర్డినేటర్ లు నాయక్, లక్ష్మి, అధికారులు పాల్గొన్నారు.
addComments
Post a Comment