పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి చదువేనని, మన తలరాతను మార్చే శక్తి చదువుకే ఉందని

 పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి చదువేనని, మన తలరాతను మార్చే శక్తి చదువుకే ఉందని


జిల్లా కలెక్టర్  బసంత కుమార్



పుట్టపర్తి, మే 5 (ప్రజా అమరావతి):


పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి చదువేనని, మన తలరాతను మార్చే శక్తి చదువుకే ఉందని జిల్లా  కలెక్టర్ బసంత కుమార్ పేర్కొన్నారు.    గురువారం  2021- 22  సంవత్సరానికి సంబంధించి జనవరి - మార్చి త్రైమాసికానికి గాను  ఫీజు రీయింబర్శ్మెంట్ మొత్తాలను  ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి  రాష్ట్ర వ్యాప్తంగా  సుమారు 10.85 లక్షల మంది విద్యార్థినీ విద్యార్థులకు రూ. 709 కోట్లు బటన్ నొక్కి నేరుగా విద్యార్థినీ విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాలకు తిరుపతి నుండి  ఆన్లైన్లో వర్చువల్ విధానంలో  జమ చేశారు.

ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారాన్ని కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి  జిల్లా కలెక్టర్   బసంత కుమార్ , శాసనమండలి  Whip  మరియు ఎమ్మెల్సీ  వెన్నుపూస  గోపాల్ రెడ్డి,  పూడా  వైస్ చైర్మన్  లక్ష్మీ నరసమ్మ, ఎంపీపీ రమణారెడ్డి, సాంఘిక సంక్షేమ అధికారి  శ్రీరంగ వరప్రసాద రావు తదితరులు  పాల్గొన్నారు

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పేద విద్యార్థులు కూడా పెద్ద ఉన్నతమైన చదువులు చదవాలన్న సమున్నత లక్ష్యంతో పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ చేస్తూ రూపొందించబడిందే జగనన్న విద్యా దీవెన పథకమన్నారు. ఆర్థిక ఇబ్బందులు మూలంగా ఏ ఒక్కరూ చదువులకు దూరం కారాదనే మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టి నిధులు వెచ్చించడం జరుగుతోందన్నారు. అర్హత ఉన్న నిరుపేదలు డిగ్రీ ఆపై చదువులకు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నత చదువులు అభ్యసించాలని ఆయన ఆకాంక్షించారు. పేద విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు ఈ పథకం అన్ని విధాలుగా దోహదపడుతుందన్నారు. బోధనా రుసుము కింద ఏడాదిలో నాలుగు విడతలుగా ఆయా కళాశాలల యాజమాన్యాలకు  పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ చేయడం జరుగుతోందన్నారు. 


పుట్టపర్తి జిల్లాలో జగనన్న విద్యా దీవెన పథకం 2021 - 2022 విద్యా సంవత్సరానికి సంబంధించి జనవరి-మార్చి 2022 త్రైమాసమునకు మొత్తం 42,522 మంది విద్యార్థులకు సంబంధించిన 38,464 మంది విద్యార్థుల తల్లుల ఖాతాలకు 25.09 కోట్ల రూపాయలు నేరుగా జమ...*


*జగనన్న విద్యా దీవెన పథకం కింద 2021 - 2022 విద్యా సంవత్సరానికి సంబంధించి జనవరి-మార్చి, 2022 త్రైమాసమునకు  కళాశాల ఫీజును అర్హులైన విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాలకు నేరుగా మంజూరు కార్యక్రమం..*


*అందులో ఎస్ సి సంక్షేమం కింద 5,975మంది విద్యార్థులు ఉండగా, 5392మంది తల్లుల ఖాతాల్లో 3.72 కోట్ల రూపాయల లబ్ధి కలగనుంది.*


*ఎస్ టి సంక్షేమం కింద 2,522 మంది విద్యార్థులు ఉండగా 2,243 మంది తల్లి ఖాతాలల్లో 1.49 కోట్ల రూపాయల లబ్ధి కలగనుంది.*


*బిసి సంక్షేమం కింద 22,423 మంది విద్యార్థులు ఉండగా, 20,195 మంది తల్లి ఖాతాలల్లో 12.52 కోట్ల రూపాయల లబ్ధి కలగనుంది.*


*కాపు సంక్షేమం కింద 2,929 మంది విద్యార్థులు ఉండగా, 2,738 మంది తల్లి ఖాతాలల్లో 1.73 కోట్ల రూపాయల లబ్ధి కలగనుంది.*


*ఈబిసి కింద 4,666 మంది విద్యార్థులు ఉండగా 4,281 మంది తల్లి ఖాతాలల్లో 3.66 కోట్ల రూపాయల లబ్ధి కలగనుంది.*


*ముస్లిం మైనారిటీ కింద 3,973 మంది విద్యార్థులు ఉండగా 3,582 మంది తల్లి ఖాతాలల్లో 1.96 కోట్ల రూపాయల లబ్ధి కలగనుంది.*


*క్రిస్టియన్ మైనారిటీ కింద 34 మంది విద్యార్థులు ఉండగా, 33 మంది తల్లి ఖాతాలల్లో 0.02 కోట్ల రూపాయల లబ్ధి కలగనుంది.*

 దిక్సూచిగా విద్యావ్యవస్థలో పలు మార్పులు చేయడం జరిగిందని వాటిని పేద విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరంవిద్యార్థినీ,విద్యార్థులకు జగనన్న విద్యా దీవెన పథకం కింద రూ.25.09,71,803 కోట్ల   రూపాయల మెగాచెక్ ను జిల్లా కలెక్టర్  అందజేశారు.



  

Comments