ఉద్యోగ సంఘాలతో సిపిఎస్ పై సంప్రదింపుల(కన్సల్టేటివ్) సమావేశం

 ఉద్యోగ సంఘాలతో సిపిఎస్ పై సంప్రదింపుల(కన్సల్టేటివ్) సమావేశం


అమరావతి,25 మే (ప్రజా అమరావతి):కంట్రీబ్యూటరీ ఫెన్సన్ పధకంపై మంగళవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయం రెండవ బ్లాకులో ఉద్యోగ సంఘాలతో రాష్ట్ర విద్యాశాఖామాత్యులు బొత్స సత్యనారాయణ,రాష్ట్ర మున్సిపల్ శాఖామాత్యులు ఆదిమూలపు సురేశ్,ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డిల సమక్షంలో వివిధ ఉద్యోగ సంఘాలతో సంప్రదింపులు(కన్సల్టేటివ్) సమావేశం నిర్వహించారు.ఈసమావేశంలో ప్రతిపాదిత గ్యారంటీడ్ ఫెన్సన్ స్కీమ్(జిపిఎస్) గురించి ఉద్యోగ సంఘాలతో చర్చించారు.అలాగే పాత ఫెన్సన్ స్కీమ్ (ఓపిఎస్) గురించి ఉద్యోగ సంఘాల అభిప్రాయాలను తీసుకున్నారు.వీటిపై మరింత లోతుగా చర్చించి అటు ప్రభుత్వానికి,ఇటు ఉద్యోగులకు నష్టం లేకుండా ఏవిధంగా ఉండాలనే దానిపై పరిశీలిద్దామని మంత్రులు,ప్రభుత్వ సలహాదారు ఉద్యోగ సంఘాలకు స్పష్టం చేశారు.ఈఅంశంపై మరొక సారి సమావేశమై అన్ని అంశాలను సవివరంగా చర్చిద్దామని మంత్రి బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేశ్,ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డిలు ఉద్యోగ సంఘాలకు చెప్పారు.పిఆర్సికి సంబంధించి ఇంకా విడుదల కావాల్సిన ప్రభుత్వ ఉత్తర్వులను త్వరగా విడుదల చేసేందుకు చర్యలు తీసుకోనున్నట్టు మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు.

ఈసమావేశంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్,ఆర్థిక శాఖ కార్యదర్శి ఎన్.గుల్జార్,కార్యదర్శి(సర్వీసెస్) హెచ్.అరుణ్ కుమార్,ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగుల సంక్షేమం)పి.చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.అదే విధంగా ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఎపి ఎన్జీవోల సంఘం అధ్యక్షులు బండి శ్రీనివాసరావు,ఎపి రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు,ఎపి ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు సూర్యనారాయణ,రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం జనరల్ సెక్రటరీ ఎన్.ప్రసాద్,రాజేశ్,ఎస్టియు అధ్యక్షులు సాయి ప్రసాద్,ఎపి యుటిఎఫ్ అధ్యక్షులు ఎన్.వెంకటేశ్వర్లు,ఇంకా పిఆర్టియు,ఆర్టీసీ,డ్రైవర్ల సంఘం, నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం,ఇతర ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

    

Comments