అర్హులందరికీ ఉపాధి హామీ పథకం పనులు కల్పించాలి


 అర్హులందరికీ  ఉపాధి హామీ పథకం పనులు కల్పించాలి


ఉపాధి హామీ కూలీల ను పరిచయం  చేసుకున్నారు


నేల పై కూర్చుని వారి సమస్యలను  విన్న వైనం


జిల్లా కలెక్టర్  బసంత కుమార్


రామాపురం, మే 4 (ప్రజా అమరావతి):


అర్హులైన ప్రతి ఒక్కరికి ఉపాధి హామీ పథకం ద్వారా పనులు కల్పించాలని జిల్లా కలెక్టర్   బసంత కుమార్ అధికారులను ఆదేశించారు.

బుధవారం  పెనుగొండ మండలం లోని  రామాపురం చెరువు నందు జరుగుతున్న ఉపాధి హామీ పథకం పనులను ఆకస్మికంగా జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఉపాధి కూలీలతో పరిచయం చేసుకున్నారు. ఆయన కూలీలతో కలసి  నేలపైకూర్చున్నారు. రోజువారి కి ఎంత కూలి పడుతుంది. బిల్లులు సకాలంలో వస్తున్నాయా ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా..? అంటూ కూలీలు   ఆరాతీశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ  రోజు కూలీ 257 రూపాయలు పడేటట్లు ఉపాధి కూలీలు పనులు చేయాలని, జాబ్ కార్డ్ ఉన్న ప్రతి కుటుంబం 100  రోజులు పూర్తి పనులు చేయాలని, తెలిపారు గ్రామపంచాయతీలో సచివాలయ బిల్డింగు, ఆర్ బి కే లు ,హెల్త్ క్లినిక్ సెంటర్లు, పూర్తి చేయాలంటే ఉపాధి పనులకు అందరూ రావాలని తెలపడం జరిగినది . ఉపాధి కూలీలు కలెక్టర్ గారికి తెలుపుతూ గత సంవత్సరంలో సమ్మర్ అలవెన్స్, గడ్డపారలు మరియు మంచినీటికి కూడా డబ్బులు ఇచ్చేవారని, ప్రస్తుతం ఇవ్వలేదని  వీటికి కూడా డబ్బులు ఇచ్చే టట్లు చూడాలని తెలిపినారు. కలెక్టర్ గారు తెలుపుతూ ప్రస్తుతము TCS    సాఫ్ట్వేర్ నుండి NIC సాఫ్ట్వేర్ నకు మారడం వలన మీరు తెలిపిన వెసలుబాటు లేదని, ఈ విషయమును ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తామని తెలపడం జరిగింది.  ఈ కార్యక్రమంలో పెనుగొండ సబ్ కలెక్టర్  నవీన్ 

పుట్టపర్తి క్లస్టర్ ఏపిడి రఘునాథ్ రెడ్డి, ఎంపీడీవో శివ శంకరప్ప ,  ఏపిడి అసిస్టెంట్ మనోహర్ ,ఏ పీ ఓ జయమ్మ జేఈ వెంకటేష్, సాంకేతిక సహాయకులు ఫీల్డ్ అసిస్టెంట్  తదితరులు పాల్గొన్నారు.  అంతకుమునుపు  ఉపాధి పనులు పరిశీలించడానికి జిల్లా కలెక్టర్ ద్విచక్రవాహనంపై బయలుదేరారు, అనంతరం రామాపురం నందు నిర్మాణం  దశలో ఉన్న  గ్రామ సచివాలయ భవనాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

 

Comments