భారత త్రో బాల్ జట్టు కెప్టెన్ శ్రీ చావలి సునీల్ కి ఆర్థిక సహాయం క్రింద 25 లక్షల చెక్కును అందించిన రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక వ్యవహారాల యువజన సర్వీసుల శాఖ మంత్రి శ్రీమతి ఆర్.కే. రోజా

 


అమరావతి, జూన్ 24 (ప్రజా అమరావతి)


: ఏపీ సచివాలయంలో భారత త్రో బాల్ జట్టు కెప్టెన్ శ్రీ చావలి సునీల్ కి ఆర్థిక సహాయం క్రింద 25 లక్షల చెక్కును అందించిన రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక వ్యవహారాల యువజన సర్వీసుల శాఖ మంత్రి శ్రీమతి ఆర్.కే. రోజా.*


2011 నుండి భారత త్రో బాల్ జట్టు కెప్టెన్ శ్రీ చావలి సునీల్ దేశానికి సేవలందిస్తూ జాతీయ జట్టును సంచలన విజయాలు అందిచారు. తెనాలి సమీపంలోని కొల్లిపర వ్యవసాయ కూలీ కుటుంబంలో జన్మించిన సునీల్ ఉన్నత స్థాయికి చేరి  క్రీడల్లో జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతులు తీసుకురావడం గర్వకారణం అని మంత్రి రోజా తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలోని  క్రీడాకారులకు ప్రోత్సహకాలు కల్పించి వారి అభివృద్ధికి దోహదపడే విధంగా చర్యలు తీసుకుంటున్నారనీ అన్నారు.


శ్రీ సునీల్ కి ఆర్ధిక సహాయాన్ని మంజూరు చేసినందుకు క్రీడాశాఖ మంత్రిగా చాలా సంతోషంగా వుందని, ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలిపారు.


రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక వ్యవహారాల యువజన సర్వీసుల శాఖ మంత్రి శ్రీమతి ఆర్.కే. రోజా  మరియు బాపట్ల ఎంపీ శ్రీ నందిగామ సురేష్ గారు అభ్యర్థన మేరకు భారత జట్టు త్రో బాల్ కెప్టెన్ గా వున్న శ్రీ చావలి సునీల్ గారికి రూ.25 లక్షల ఆర్థిక సహాయాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు మంజూరు చేశారు. 


మంత్రి రోజా చేతులమీదుగా సచివాలయంలోని తన ఛాంబర్ లో 25 లక్షల రూపాయల చెక్కును  నందిగామ సురేష్ ఎంపీ గారి ఆధ్వర్యంలో శ్రీ చావలి సునీల్ కి అందించారు.


ఈ సందర్భంగా తన ప్రతిభను గుర్తించి తనకు ఆర్థిక సహాయం అందించిన గౌరవ ముఖ్య మంత్రివర్యులు మరియు రాష్ట్ర క్రీడా శాఖమంత్రివర్యులు మరియు నందిగామ సురేష్ ఎంపీ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపిన శ్రీ చావలి సునీల్.

Comments