ఘనంగా ఆచార్య ఎన్‌.జి . రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ 52వ, 53వ సంయుక్త స్నాతకోత్సవం



ఘనంగా ఆచార్య ఎన్‌.జి . రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ 52వ, 53వ సంయుక్త స్నాతకోత్సవం 



తిరుపతి (ప్రజా అమరావతి);


వ్యవసాయ విశ్వవిద్యాలయాలు ఆహార భద్రత, పంట ఉత్పాదకత, రైతు ఆదాయం పెంపు లక్ష్యంగా విజ్ఞానం అందించాలని గౌ . రాష్ట్ర గవర్నరు మరియు కులపతి బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు.

బుధవారం సాయంత్రం స్థానిక మహతి ఆడిటోరియంలో 

ఆచార్య యన్. జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 52వ మరియు 53వ  స్నాతకోత్సవo వేడుకలను శ్రీ వెంకటేశ్వర వ్యవసాయ కళాశాల, తిరుపతి ఆధ్వర్యంలో  ఘనంగా నిర్వహించారు.


    ఈకార్యక్రమానికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ మరియు విశ్వవిద్యాలయ గౌరవ కులపతి గౌరవనీయులు శ్రీ బిశ్వభూషణ్ హరిచందన్ గారు, విశిష్ట అతిధి మరియు ఉపన్యాసకులుగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మాత్యులు, శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు హాజరయ్యారు. 


         స్నాతకోత్సవ సమావేశంలో గౌ కులపతి మరియు గవర్నర్‌ బిశ్వభూషన్‌ హరిచందన్‌  మాట్లాడుతూ జాతీయ స్థూల ఉత్పత్తిలో వ్యవసాయ రంగం వాటా 2019-20లో 17.8 శాతం నమోదు కాగా.. 2021 సంవత్సరానికి గాను 19.9 శాతం సాధించడంలో మన రైతాంగం చేసిన కృషి అభినందనీయమన్నారు.  జాతీయ వరి  ఉత్పత్తిలో  మూడో వంతు ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం రూపొందించిన విత్తన రకాలు ఉండడం విశ్వవిద్యాలయం సాధించిన పరిశోధన ప్రగతికి లభించిన గౌరమన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పండించే వేరుసెనగలో 95 శాతం వ్యవసాయ విశ్వవిద్యాలయం రూపొందించిన రకాలు ఉండడం రాష్ర్ట వ్యవసాయ స్థూల ఉత్పత్తిలో దీని వాటా 1.06 శాతం ఉండడం గర్వకారణం.


 రాష్ర్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రైతు భరోసా కేంద్రాలకు సాంకేతికంగా సహకారం అందిస్తూ గ్రామీణ స్థాయిలో వ్యవసాయ సాంకేతిక పరిజ్ఙానాన్ని రైతులకు అందించడంతో వ్యవసాయ విశ్వవిద్యాలయ సేవలు మూరుమూల గ్రామ రైతులకు చేరడం విశేష పరిణామం అన్నారు. 


2018-19, 2019-20 సంవత్సరాల్లో వ్యవసాయ విశ్వవిద్యాలయం వివిధ పంటల్లో రూపొందించిన నూతన రకాలు రాష్ర్ట, జాతీయ స్థాయిలో రైతుల మన్నననలు పొందాయన్నారు.


 వీటిలో ముఖ్యంగా పోషక విలువలతో అభివృద్ధి పరిచిన(జింకు, ఇనుము) రాగి రకం ఇంద్రావతిని 2020 ఆక్టోబర్‌ 16న భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారు జాతీయ స్థాయిలో ఆవిష్కరించి జాతి అంకితం చేయడం సంతోషించదగ్గ విశేషమన్నారు. దేశం కోసం ప్రధాని దేశవాప్తంగా రైతులకు పంటల పెట్టుబడి సాయం అందిస్తున్నారు. 


జాతీయ  స్థాయిలో చిన్న, సన్నకారు రైతుల ఆదాయం తక్కువగా ఉండడం, తరచూ పంట నష్టాలు సంబవించడం, మార్కెట్‌ ఒడిదుడుకులు, అప్పుల్లో కూరుకుపోవడం వంటి అంశాలపై తక్షణం దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా ప్రధాన పంట ఉత్పత్తుల సేకరణ వేగవంతం చేయడం, స్మార్ట్‌‌ వ్యవసాయం, వ్యవసాయంలో వైవిధ్యం, సమగ్ర వ్యవసాయ విధానాలను అనుసరించాల్సిన ఆవశ్యకత ఉందని తెలిపారు. 


వ్యవసాయ విశ్వవిద్యాలయాలు ఆహార భద్రత, పంట ఉత్పాదకతా పెంపు, రైతు ఆదాయం పెంపుపై దృ సారించాలని సూచించారు. 



                 స్నాతకోత్సవంలో భాగంగా 2018-19, 2019-20 విద్యా సంవత్సరాల్లో వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని వ్యవసాయ కళాశాలల్లో బి.ఎస్సీ (వ్యవసాయం) పూర్తి చేసిన 1544 మందికి, పి.జి పూర్తి చేసిన 328 మందికి, 91 మంది పీహెచ్‌డీ విద్యార్థులు పట్టాలు అందుకున్నారు. ప్రతి స్నాతకోత్సవంలో ఉత్తమ అధ్యాపకులు, ఉత్తమ శాస్ర్తవేత్తలు, ఉత్తమ యువశాస్ర్తవేత్తలు, విస్తరణ శాస్ర్తవేత్తల అవార్డులను అతిథులు అందజేశారు. 


ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 52, 53వ సంయుక్త స్నాతకోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌కు గౌరవ డాక్టరేట్‌ ప్రకటించింది.


 అంతేకాకుండా తొలిసారిగా జాతీయ స్థాయి అవార్డులు ప్రకటించింది. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో అసోసియేట్ డీన్ హెూదాలో పనిచేస్తూ విద్యార్థులతో కలిసి పరిశోధించి  ఆవిష్కరించిన


 బిపిటి 5204( సోనా మసూరి ) అనే రకాన్ని విడుదల చేసి అంతర్జాతీయంగా గుర్తింపు సాధించిన ప్రొ. ఎన్.వి.రెడ్డి, 


స్వర్ణ రకం వరి రూపకర్త వి.రామచంద్రరావు స్మారకార్థం జాతీయ స్థాయి అవార్డులను అందజేశారు.


 డాక్టర్‌ వి.రామచందద్రరావు జాతీయ అవార్డును ఐఆర్ డైరెక్టర్ డాక్టర్ ఎ.కె.సింగ్, డాక్టర్ ఎన్.వి.రెడ్డి జాతీయ అవార్డును విశ్రాంత శాస్త్రవేత్త డాక్టర్ ఆలపాటి సత్యనారాయణకు  అందజేశారు.


 ముందుగా 52, 53వ సంయుక్త స్నాతకోత్సవ ప్రగతి నివేదికను విశ్వవిద్యాలయ ఉపకులపతి డాక్టర్‌ ఆదాల విష్ణువర్ధన్‌రెడ్డి కులపతి వారికి నివేదించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత వ్యవసాయ పరిశోధనా మండలి(ఐ. సి. ఎ. ఆర్)  జే ఆర్. యఫ్, యస్. ఆర్. యఫ్,  గేట్  ఫెలౌషిప్స్ 2018  -2019వ సంవత్సరానికి గాను 65  మంది విద్యార్ధులు, 2019 - 20వ సంవత్సరానికి  105  ఐ. సి. ఎ. ఆర్,  జే ఆర్. యఫ్, యస్. ఆర్. యఫ్, గేట్ కు ఎంపిక కాబడ్డరని, జాతీయ  స్థాయిలో అత్యధిక ర్యాంకులు దేశంలోని వివిధ వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో  సాధించిన విశ్వవిద్యాలయంగా ఐసీఏఆర్‌  అవార్డు సాధించిందని తెలిపారు. విశ్వవిద్యాలయం పరిధిలోని వివిధ పంటల్లో విడుదల చేసిన నూతన రకాలు, వాటి విశిష్టతను ఆయన తెలిపారు.  జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు, ప్రశంసాపత్రాలు వివరాలను వెల్లడించారు. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం గత ఏడాదిన్నర కాలంగా పరిశోధించిన అందుబాటులోకి తెచ్చిన డ్రోన్‌ వ్యవసాయం వ్యవసాయ రంగంలో విప్లవాత్మకం కానుందని, 


గ్రామీణ ప్రాంతాల్లో సైతం డ్రోన్‌ వ్యవసాయం సాగాలన్న లక్ష్యంతో రైతు భరోసా కేంద్రాల ద్వారా డ్రోన్‌లను అందబాటులోకి తెస్తామన్నారు.


 అందుకు అవసరమైన పైలట్‌లను వ్యవసాయ పాలిటెక్నిక్‌ చేసిన విద్యార్థులకు  శిక్షణ ఇచ్చి సిద్ధం చేశామని, త్వరలో కేంద్ర ప్రభుత్వ అనుమతితో డ్రోన్‌ పైలట్‌ శిక్షణా కేంద్రం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.



 ఈ సమావేశంలో కీలకోపన్యాసం చేసిన రాష్ర్ట వ్యవసాయశాఖ మంత్రి కాకాని గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ 

రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమంకోసం అనేక కార్యక్రమాలుబుచేపట్టిందని అన్నారు. వైఎస్ ఆర్ బీమా, ఫ్రీ క్రాప్ ఇనుఁరెన్స్, సున్నా వడ్డీ పొలం బడి , అగ్రిలాబ్స్ ఏర్పాటు , 10778 ఆర్బికే ల ఏర్పాటుతో రైతులకు కావాల్సిన అన్ని రకాల విత్తనాలు , ఎరువులు అందుబాటులో ఉన్నాయని అన్నారు . ముఖ్యమంత్రి మానస పుత్రిక ఆర్ బి కె లు ఇతర రాస్గ్త్రలకు ఆదర్శంగా నిలిచి కేంద్రప్రభుత్వ చాంపియన్ అవార్డుకు నామినేషన్ పొందిందని అన్నారు. ఆచార్య ఎన్ జి రంగా యూనివర్సిటీ సహకారంతో రైతులకు  డ్రోన్ టెక్నాలజీ తో తక్కువ వ్యయంతో నానో టెక్నాలజీతో మందులు చల్లడం వంటివి అందిబాటులోకి తెచ్చ్చిందని ప్రభుత్వం కస్టమర్ హైరింగ్ సెంటర్ల ఏర్పాటు తో యాంత్రీకరణ అందుబాటులోకి తెచ్చ్చామని తెలిపారు. నేడు వ్యవసాయ విద్యార్థులు చదువు పూర్తిచేసి వెళుతున్నారు , రైతులకు అందుబాటులో ఉండి తమవంతు సహకారం అందించాలని శుభాకాంక్షలు తెలిపారు.



ఈ కార్యక్రమంలో తిరుపతి ఎం పి గురుమూర్తి ,స్పెషల్  సి ఎస్ టు గవర్నర్ సిసోడియా , విశ్వవిద్యాలయ రిజిస్ర్టార్‌ డాక్టర్‌ టి.గిరిధర్‌కృష్ణ,  డీన్‌ డాక్టర్‌ ప్రతాప్‌కుమార్‌రెడ్డి, డైరెక్టర్‌ ఆఫ్‌ రీసెర్చ్‌ డాక్టర్‌ ఎల్‌.ప్రశాంతి, డీన్‌లు డాక్టర్‌ యల్లారెడ్డి, డాక్టర్‌ గుత్తా రామారావు,  డాక్టర్‌ చిరంజీవి, సీవోఈ డాక్టర్‌ పి.సుధాకర్‌, విద్యార్థి వ్యవహారాల అధికారి డాక్టర్‌ ఎం.మార్టిన్‌ లూథర్‌, పాలక మండలి సభ్యులు, అకడమిక్‌ కౌన్సెల్‌ సభ్యులు, బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.


గౌ గవర్నర్ ను , రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిని స్పెషల్ సి ఎస్ ను ఘనంగా సన్మానించారు .


Comments
Popular posts
భారత త్రో బాల్ జట్టు కెప్టెన్ శ్రీ చావలి సునీల్ కి ఆర్థిక సహాయం క్రింద 25 లక్షల చెక్కును అందించిన రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక వ్యవహారాల యువజన సర్వీసుల శాఖ మంత్రి శ్రీమతి ఆర్.కే. రోజా
Image
అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ ధ్యేయం.
Image
దిశ పెట్రోలింగ్‌ వెహికల్స్‌ను ప్రారంభించనున్న సీఎం శ్రీ వైఎస్‌ జగన్*
Image
వీఆర్వో లు రెవెన్యూ చట్టాల గురించి క్షుణ్ణంగా తెలుసుకుని క్షేత్ర స్థాయిలో సక్రమంగా అమలు చేయాలి : జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు అనంతపురం,(ప్రజాఅమరావతి ): ఆగస్టు 27: నూతనంగా పదోన్నతులు పొందిన గ్రామ రెవెన్యూ అధికారులు చట్టాలను క్షుణ్ణంగా అవగాహన చేసుకొని ప్రజలకు సక్రమంగా సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు సూచించారు. గురువారం నూతనంగా పదోన్నతి పొందిన వీఆర్వోలకు 2వ రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ను ఏర్పాటు చేసి గాంధీజీ కలలుగన్న గ్రామస్వరాజ్యం స్థాపన కోసం ఎంతో కృషి చేస్తున్నారన్నారు. ఈ క్రమంలో విఆర్వోలు అంతా మెరుగ్గా పనిచేసి ప్రభుత్వ లక్ష్యసాధనకు బాధ్యతగా విధులు నిర్వర్తించాలన్నారు. విధి నిర్వహణలో ఎలాంటి సందేహాలు ఉన్నా వాటిని అనుభవజ్ఞులైన సీనియర్లతో నివృత్తి చేసుకోవాలన్నారు. రెవెన్యూ శాఖ నిర్దేశించిన ఉత్తర్వుల మేరకు వీఆర్వో లు నాలుగు విభాగాలలో పనిచేయాల్సి ఉంటుందన్నారు. ఇందులో రెవెన్యూ భూ రికార్డులు, సామాజిక సంక్షేమం, అభివృద్ధి, పోలీసు తదితర విభాగాల వారీగా విధులు నిర్వర్తించాలన్నారు. రెవెన్యూ కు సంబంధించి అన్ని గ్రామ అకౌంట్లు, భూ రికార్డులు పక్కాగా నిర్వహించాలన్నారు. నీటి పన్ను సెస్ తో పాటు రెవెన్యూ శాఖకు సంబంధించిన వసూళ్లు చేయాలన్నారు. క్షేత్రస్థాయిలో రెవెన్యూ భూములను తనిఖీ చేయాలన్నారు. సర్వే రాళ్లను ప్రతి ఏటా రెండు సార్లు పరిశీలించాలని, రాళ్లు లేనిచోట ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాల్సి ఉంటుందన్నారు. ప్రభుత్వ భూములు, చెట్లు, చెరువులు, ఇతర ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ బాధ్యత విఆర్ఓ లపై ఉంటుందన్నారు. ఎవరైనా అక్రమాలకు పాల్పడితే ఆక్రమణల తొలగింపు చర్యలు చేపట్టాలన్నారు. రెవెన్యూ రికవరీ చట్టం కింద రికవరీ చేయాల్సి వస్తే ఆ ఆస్తుల వివరాలు అందించి అధికారులకు సహకరించాలన్నారు. అలాగే పోలీసు విధులకు సంబంధించి రెవెన్యూ అధికారులు మెజిస్ట్రేట్ అధికారాలు వినియోగించే సమయంలో వీఆర్వోలు సహాయకులుగా పనిచేయాలని, ఎలాంటి అనుమానిత సమాచారాలు తెలిసినా వాటిని పోలీసులకు అందించాల్సి ఉంటుందన్నారు. నేరాలు జరిగిన సమయంలో ఆధారాలతో వాస్తవ నివేదికలు సమర్పించాలన్నారు. సామాజిక సంక్షేమం, అభివృద్ధి, విధులకు సంబంధించి వివిధ ప్రభుత్వ పథకాలను అర్హులైన వారిని లబ్ధిదారులుగా ఎంపిక చేయాల్సి ఉంటుందన్నారు. అంటరానితనం నిర్మూలనలో బాధ్యతగా పని చేయాలని, పౌరసరఫరాల విషయంలో అధికారులకు సహకారం అందించాలన్నారు. పంట నష్టం జరిగినప్పుడు ఆ నష్టం అంచనా కు సంబంధించి వ్యవసాయ అధికారులకు సహకారం అందించాలన్నారు. తహశీల్దార్, సబ్ కలెక్టర్, ఆర్డిఓ, జిల్లా కలెక్టర్, రాష్ట్ర భూపరిపాలన ప్రధాన కమిషనర్ ఆదేశాల మేరకు విధులను వీఆర్వోలు నిర్వర్తించాల్సి ఉంటుందన్నారు. అలాగే గ్రామాలలో అవసరమైన సమాచారాన్ని ప్రజలందరికీ చేరువుగా తీసుకువెళ్ళే క్రమంలో దండోరా వేయించడం, లీగల్ నోటీసులు జారీ ప్రక్రియ లాంటి విధులు కూడా వీఆర్వోల పరిధిలో ఉంటాయన్నారు. అందువల్ల ఆయా గ్రామ సచివాలయంలో పనిచేసే విఆర్వోలు ముందస్తుగా చట్టాలపై అవగాహన చేసుకొని జాగ్రత్తగా తమ విధులను నిర్వర్తించాలన్నారు. వీఆర్వోల విధి విధానాల గురించి జిల్లా కలెక్టర్ వివరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ (రెవిన్యూ మరియు రైతు భరోసా) నిశాంత్ కుమార్, డిఆర్ఓ గాయత్రీ దేవి, హ్యాండ్ సెట్ సీఈవో హరి ప్రసాద్, కలెక్టరేట్ ఏవో విజయలక్ష్మి, తహసిల్దార్ లు విశ్వనాథ్, నాగరాజు, హరి కుమార్, డి టి శ్రీధర్, పెనుగొండ, కదిరి, కళ్యాణదుర్గం డివిజన్ నుండి 111 మంది పదోన్నతులు పొందిన విఆర్వోలు శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు..
Amravati (prajaamaravati), *సోమశిల ప్రాజెక్టు హైలెవెల్‌ లిఫ్ట్‌ కెనాల్‌ రెండో దశ పనులను క్యాంప్‌ కార్యాలయం నుంచి వర్చువల్‌ విధానంలో ప్రారంభించిన సీఎం శ్రీ వైయస్‌ జగన్‌:* *నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం కృష్ణాపురంలో పైలాన్‌ ఆవిష్కరణ:* ఈ కాలువ ద్వారా దుత్తలూరు, వింజమూరు, ఉదయగిరి, మర్రిపాడు, అనంతసాగరం, ఆత్మకూరు మండలాల్లోని 46,453 ఎకరాలకు సాగు నీరందనుంది. రివర్స్‌ టెండరింగ్‌ విధానంలో పనులు అప్పగించడం వల్ల రూ.459 కోట్లకే టెండర్‌ ఖరారైంది. దీని వల్ల ఖజానాపై రూ.68 కోట్ల భారం తగ్గింది. *ఈ సందర్భంగా సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ ఏమన్నారంటే..* – పెన్నా నీటిని సద్వినియోగం చేసుకుంటూ, ఇవాళ నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాల మెట్ట ప్రాంతాలకు సాగు, తాగు నీరు అందించే సోమశిల రెండో దశ పనులకు ఇక్కడి నుంచి పునాది వేస్తున్నాను. – నీటి విలువ, వ్యవసాయం విలువ తెలిసిన ప్రభుత్వంగా నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాలలోనిమెట్ట ప్రాంతాలకు నీరు అందించే సోమశిల రెండో దశ పనులకు ఈరోజు వర్చువల్‌గా శంకుస్థాపన చేస్తున్నాను. – ఈ పనుల ద్వారా ఆత్మకూరు నియోజకవర్గంలో 10,103 ఎకరాలు, ఉదయగిరి నియోజకవర్గంలో 36,350 ఎకరాలకు.. మొత్తంగా 46,453 ఎకరాలకు కొత్తగా నీటి సదుపాయం కల్పించడం జరుగుతుంది. – ఇందుకోసం బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్లుగా కంప సముద్రం, గుండె మడకల రిజర్వాయర్ల నిర్మాణం, క్రాస్‌ మిషనరీ (సీఎం), క్రాస్‌ డ్రైనేజీ (సీడీ) పనుల ద్వారా 18.5 కి.మీ గ్రావిటీ కాల్వల నిర్మాణం. పంపింగ్‌ స్టేషన్, రెండు ఎలక్ట్రో ప్రెషర్‌ మెయిన్లు.. వీటన్నింటిని నిర్మించబోతున్నాం. – గతంలో ఇదే ప్రాజెక్టును రూ.527.53 కోట్లతో గత ప్రభుత్వం ఎన్నికల ముందు హడావిడిగా పనులు మొదలు పెట్టినా ఏదీ జరగలేదు. కానీ ఈ ప్రభుత్వం వచ్చాక రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్లడం ద్వారా వ్యయాన్ని రూ.459 కోట్లకు తగ్గించడం జరిగింది. తద్వారా ప్రభుత్వానికి దాదాపు రూ.68 కోట్లు ఆదా అయింది. – ఒకే పనికి గతంలో రూ.527 కోట్లు, ఇప్పుడు అదే పనికి రూ.459 కోట్లు అంటే రివర్స్‌ టెండరింగ్‌ ద్వారాఅవినీతికి చెక్‌ పెట్టడం జరిగింది. ఇలా ఎక్కడా అవినీతికి తావు లేకుండా ప్రతి చోటా చర్యలు చేపడుతున్నాం. – ఈ ప్రాజెక్టులో రూ.68 కోట్లు మిగిలించి ఇవాళ పనులు మొదలు పెడుతున్నాం. యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేస్తాం. *మరో విషయం:* – ఇదే నెల్లూరు జిల్లాలో సంగం బ్యారేజీ, నెల్లూరు బ్యారేజీ పనులు కూడా పూర్తయ్యే దశలో ఉన్నాయి. వచ్చే జనవరిలో వాటిని ప్రజలకు అంకితం చేయబోతున్నాం. – వాటి పనులు నత్తనడకన జరుగుతా ఉంటే, పరిస్థితి మార్చాం. యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నాం. దేవుడి దయతో పనులు పూర్తవుతున్నాయి. – దీంతోపాటు సోమశిల కండలేరు డబ్లింగ్‌ వర్క్స్‌,12 వేల క్యూసెక్కుల నుంచి 24 వేల క్యూసెక్కుల సామర్థ్యానికి రూ.918 కోట్ల వ్యయంతో పెంచబోతున్నాం. – అదే విధంగా సోమశిల–రాళ్లపాడు డబ్లింగ్‌ వర్క్స్‌, 720 క్యూసెక్కుల నుంచి 1440 క్యూసెక్కుల సామర్థ్యానికి రూ.632 కోట్ల వ్యయంతో పెంచబోతున్నాం. – సాగునీటి రంగంలో జలయజ్ఞం ద్వారా ప్రాధాన్యత క్రమంలో పనులు కొనసాగిస్తున్నాం. 2022 ఖరీఫ్‌ నాటికి నీరు ఇచ్చే విధంగా, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తున్నాం. *ఈ ఏడాదిలో ఆరు ప్రాధాన్యత ప్రాజెక్టులు*.. వంశధార ఫేజ్‌–2. వంశధార–నాగావళి అనుసంధానం, వెలిగొండ ఫేజ్‌–1, అవుకు టన్నెల్, సంగం బ్యారేజీ, నెల్లూరు బ్యారేజీలను పూర్తి చేసేందుకు వేగంగా అడుగులు వేస్తున్నాం. *మూడు రాజధానులతో పాటు, మూడు ప్రాంతాలకు సమ న్యాయం చేస్తాం.* రాష్ట్రానికి సంబంధించిన సాగు నీటి పనుల్లో ఎక్కడా రాజీ పడబోము. – మూడు ప్రాంతాలకు సమ న్యాయం చేయాలన్న ఉద్దేశంతో రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల సాగు నీరు, తాగు నీటి అవసరాలు తీర్చే విధంగా రూ.40 వేల కోట్లతో రాయలసీమ కరువు నివారణ ప్రాజెక్టు చేపడుతున్నాం. – ఉత్తరాంధ్రకు నీటి పరంగా న్యాయం చేసేలా ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని సాకారం చేసేలా రూ.15 వేల కోట్ల ప్రాజెక్టులో భాగంగా మొదటి దశలో రూ.3500 కోట్ల విలువైన పనులకు త్వరలో టెండర్లు పిలవబోతున్నాం. – పల్నాడులో కరువు నివారణ కోసం వైయస్సార్‌ పల్నాడుకరువు నివారణ ప్రాజెక్టుకు రూపకల్పన చేశాం. – కృష్ణా నది దిగువన రెండు బ్యారేజీలు, పైన ఒక బ్యారేజీ నిర్మాణంతో పాటు, చింతలపూడి లిఫ్ట్‌ పనుల వేగాన్ని పెంచుతున్నాం. – నీటి విలువ, రైతు విలువ, నీటి ద్వారా ప్రాంతాలకు జరిగే ఆర్థిక న్యాయం, అవసరం తెలిసిన ప్రభుత్వంగా చిత్తశుద్ధితో ఈ ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేస్తాము. – దేవుడి దయ, మీ అందరి ఆశీస్పులతో ఇంకా పనులు, కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను. అంటూ సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ ప్రసంగం ముగించారు. ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, పిల్లి సుభాష్‌చంద్రబోస్, నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్, ఆ శాఖ ఈఎన్‌సీ నారాయణరెడ్డి కార్యక్రమంలో పాల్గొనగా, పైలాన్‌ ఆవిష్కరణ వద్ద మంత్రులు అనిల్‌కుమార్‌ యాదవ్, మేకపాటి గౌతమ్‌రెడ్డి, పలువులు ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు.
Image