వెదురు పెంపకాన్ని ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలని అటవీశాఖకు సీఎం ఆదేశం.




అమరావతి (ప్రజా అమరావతి);

*– రెవెన్యూ అందించే శాఖలపై సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష.*

*–క్యాంపు కార్యాలయంలో సమావేశానికి హాజరైన వివిధ శాఖల అధికారులు.*

*–వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్స్, రవాణా, భూగర్భగనులు, అటవీ తదితర శాఖల అధికారులు హాజరు.*

*–శాఖల వారీగా సమీక్షించిన ముఖ్యమంత్రి.* 

*–సమీక్ష సమయంలో పలు ఆదేశాలిచ్చిన సీఎం.*

*–ఈ శాఖల్లో  ప్రొఫెషనలిజం పెంచుకుని ఆదాయాలు పెంచుకోవాలన్న సీఎం.* 



*ఈ సందర్భంగా సీఎం ఏమన్నారంటే...:*

– ఓటీఎస్‌ పథకం కింద లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్లను వేగంగా పూర్తిచేయాలి: సీఎం

– అలాగే టిడ్కోకు సంబంధించి కూడా రిజిస్ట్రేషన్లను పూర్తిచేయాలి:

– గ్రామ, వార్డు సచివాలయాల్లోకి రిజిస్ట్రేషన్‌ సేవలు అందుబాటులోకి తీసుకు వచ్చాక సిబ్బందికి, ప్రజలకు అవగాహన కల్పించాలి:

– ఎలాంటి సేవలు పొందవచ్చు అన్న అంశాలపై అవగాహన కల్పించాలి:

– కేవలం ఆస్తుల రిజిస్ట్రేషనే కాకుండా..  రిజిస్ట్రేషన్‌ పరంగా అందించే ఇతర సేవలపైన కూడా పూర్తిస్థాయి సమాచారం, అవగాహన కల్పించాలి:

– రిజిస్ట్రేషన్‌ ప్రక్రియతో న్యాయపరంగా ఎలాంటి హక్కులు వస్తాయి, ఎలాంటి భద్రత వస్తుందన్న దానిపై కూడా అవగాహన కల్పించాలి:

– అక్టోబరు 2న తొలివిడతగా గ్రామాల్లో శాశ్వత భూ హక్కు, భూ రక్ష పత్రాలతో పాటు సంబంధిత సచివాలయాల్లో రిజిస్ట్రేషన్‌ సేవలు అందించడానికి చర్యలు తీసుకోవాలి: సీఎం

– ఇప్పటికే 650 గ్రామాల్లో జగనన్న శాశ్వత భూ హక్కు – భూ రక్ష పత్రాలతో పాటు రిజిస్ట్రేషన్‌ సేవలు అందించడానికి చర్యలు తీసుకుంటున్నామని, ఈ గ్రామాల సంఖ్యను పెంచడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపిన అధికారులు

– 14వేలమంది గ్రామ, వార్డు సెక్రటరీలకు రిజిస్ట్రేషన్‌పై శిక్షణ కూడా అందిస్తున్నామని తెలిపిన అధికారులు.

– అక్టోబరు 2న తొలివిడత కింద రిజిస్ట్రేషన్‌ సేవలు, భూ హక్కు–భూ రక్ష కింద పత్రాలు అందించే గ్రామాల సంఖ్యను పెంచడానికి ప్రయత్నించాలన్న సీఎం.


– వెదురు పెంపకాన్ని ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలని అటవీశాఖకు సీఎం ఆదేశం.



– మైనర్‌ మినరల్‌కు సంబంధించి కార్యకలాపాలు నిర్వహించని క్వారీలు 2,700కుపైగా ఉన్నాయని తెలిపిన అధికారులు.

– వీటిలో కార్యకలాపాలు తిరిగి ప్రారంభించాల్సిన అవసరం ఉందన్న అధికారులు.

– వీటిలో కార్యకలాపాలు ప్రారంభం కావడంపై దృష్టిపెట్టండి: సీఎం

– దీనివల్ల ప్రభుత్వానికి ఆదాయాలు పెరుగుతాయి: సీఎం

– ఏపీఎండీసీ నిర్వహిస్తున్న సులియారీ బొగ్గు గనుల నుంచి ఉత్పత్తి ప్రారంభమైందన్న అధికారులు.

– జెన్‌కో సహా.. రాష్ట్రంలోని పలు పరిశ్రమలకు దీని నుంచి బొగ్గు సరఫరా అయ్యేలా చూసుకోవాలన్న సీఎం.

– దీనివల్ల జెన్‌కో ఆధ్వర్యంలోని విద్యుత్‌ ప్రాజెక్టులకు మేలు జరుగుతుందన్న సీఎం. 

– ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా బొగ్గు ధరలు మండిపోతున్న దృష్ట్యా ఈబొగ్గును మన అవసరాలకు వినియోగించుకునేలా చూడాలన్న సీఎం. 

– దీనిపై కార్యాచరణ రూపొందించి తనకు నివేదించాలన్న సీఎం.

– తదుపరి కూడా బొగ్గుగనుల వేలం ప్రక్రియలో పాల్గొనడంపై దృష్టిపెట్టాలన్న సీఎం.


– వాణిజ్య పన్నుల శాఖ పునర్‌నిర్మాణానికి నిర్ణయం.

– శాఖలో ప్రతి ఒక్కరి పాత్ర, బాధ్యతలపై స్పష్టత

– డాటా అనలిటిక్స్‌ విభాగం ఏర్పాటు

– లీగల్‌సెల్‌కూడా ఏర్పాటు.

–  బకాయిల వసూలుకు ఓటీఎస్‌ సదుపాయం

– జూన్‌కల్లా వాణిజ్య పన్నుల శాఖలో ఈ విభాగాల ఏర్పాటు. 


– అక్రమ మద్యం తయారీ, అక్రమ మద్యం రవాణాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశం. 



సమావేశానికి హాజరైన ఉపముఖ్యమంత్రి (ఎక్సైజ్‌ శాఖ) కె నారాయణ స్వామి, రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఇంధన,అటవీ పర్యావరణ, భూగర్భగనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎస్‌ సమీర్‌ శర్మ, అటవీ పర్యావరణం, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ స్పెషల్‌ సీఎస్‌ నీరబ్‌ కుమార్‌ ప్రసాద్, రెవెన్యూ శాఖ స్పెషల్‌ సీఎస్‌ రజత్‌ భార్గవ, ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ చీఫ్‌ కమిషనర్‌ జి సాయి ప్రసాద్, ఆర్ధికశాఖ స్పెషల్‌ సీఎస్‌ ఎస్‌ ఎస్‌ రావత్, రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి ఎం టీ కృష్ణబాబు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గనులశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్సు ఎన్‌ ప్రతీప్‌ కుమార్, ఇతర ఉన్నతాధికారులు.

Comments