భూముల రీ సర్వే ప్రక్రియను మరింత వేగవంతంగా చేపట్టాలి


నెల్లూరు, జూన్ 16 (ప్రజా అమరావతి): అన్ని జిల్లాల్లో జగనన్న శాశ్వత భూ హక్కు- భూ రక్ష పథకం కింద చేపట్టిన భూముల రీ సర్వే ప్రక్రియను మరింత వేగవంతంగా చేపట్టాల


ని భూ పరిపాలన ముఖ్య కార్యదర్శి శ్రీ సాయి ప్రసాద్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.

  గురువారం ఉదయం అమరావతి నుంచి వారు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ కు నెల్లూరు ఎస్ ఆర్ శంకరన్ హాలు నుంచి జిల్లా కలెక్టర్ శ్రీ కె వి ఎన్ చక్రధర్ బాబు, హాజరయ్యారు. 

  ఈ సందర్భంగా భూ పరిపాలన ముఖ్య కార్యదర్శి శ్రీ సాయి ప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూముల రీ సర్వే ప్రక్రియను క్షేత్రస్థాయిలో కలెక్టర్లు పర్యవేక్షించాలని సూచించారు. నిర్దేశిత గడువులోగా ఎంపిక చేసిన గ్రామాల్లో భూముల రీ సర్వే వేగంగా చేపట్టేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా డ్రోన్ సర్వే, సెక్షన్ 13 నోటిఫికేషన్, ఓ ఆర్ ఐ ఇమేజ్ లు, పట్టాదారు పాసు పుస్తకాలు మంజూరు, ప్రింటింగ్ మొదలైన అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. 

  ఈ వీడియో కాన్ఫరెన్స్లో సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఏడి శ్రీ హనుమాన్ ప్రసాద్, డిఆర్ఓ వెంకట నారాయణమ్మ పాల్గొన్నారు. 

Comments