సరికొత్త పారిశ్రామికవృద్ధి దిశగా అడుగులు.. తదనుగుణంగా కీలక నిర్ణయాలు
*ఏపీఐఐసీ  ఛైర్మన్ మెట్టుగోవింద రెడ్డి అధ్యక్షతన 234వ బోర్డు మీటింగ్*


*సరికొత్త పారిశ్రామికవృద్ధి దిశగా అడుగులు.. తదనుగుణంగా కీలక నిర్ణయాలు*


అమరావతి, జూన్, 16 (ప్రజా అమరావతి); ఏపీఐఐసీ సరికొత్త నిర్ణయాలకు శ్రీకారం చుట్టినట్లు ఛైర్మన్ మెట్టు గోవింద రెడ్డి వెల్లడించారు.  మంగళగిరి ఏపీఐఐసీ కార్యాలయంలో ఛైర్మన్ అధ్యక్షతన 234వ బోర్డు సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ బోర్డు సమావేశంలో ఏపీఐఐసీ సరికొత్త లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకు సాగుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. విప్లవాత్మక మార్పుల దిశగా  ఏపీఐఐసీ అడుగులు వేయనున్నట్లు ఛైర్మన్ స్పష్టం చేశారు. పారిశ్రామిక పార్కుల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నట్లు తెలిపారు. గురువారం జరిగిన బోర్డు మీటింగ్ కి 12 మంది  డైరెక్టర్లు చిన్నారెడ్డివారి ప్రదీప్ రెడ్డి, మట్ట శైలజ, గంగాధర్ రెడ్డి, కె.చంద్రఓబుల రెడ్డి, టి.రజనీకాంత్ రెడ్డి,  రాయవరం శ్రీనివాసులు రెడ్డి, ఝూన్సీ లక్ష్మీ,  ఎం.గోవిందరాజులు, ఆవుల సుకన్య, మువ్వా స్వాతి, మూలి అప్పారావు, ముత్తు పైడితల్లి హాజరయ్యారు. ఏపీఐఐసీకి సంబంధించిన కీలక అంశాలపై ఛైర్మన్ మెట్టుగోవింద రెడ్డి నేతృత్వంలో చర్చ జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీఐఐసీ వైస్ ఛైర్మన్&ఎండీ సుబ్రమణ్యం జవ్వాది, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు సుదర్శన్ బాబు, రాజేంద్రప్రసాద్, కంపెనీ సెక్రటరీ శివారెడ్డి పాల్గొన్నారు.


*గురువారం జరిగిన ఏపీఐఐసీ 234వ బోర్డు సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలు*


1. ఏపీఐఐసీ పారిశ్రామిక పార్కులలో రోడ్ల మరమ్మతులు, వీధి దీపాల ఏర్పాటు, సైన్ బోర్డుల ఏర్పాటు, మొక్కల పెంపకం, వాటి నిర్వహణపై ప్రత్యేక దృష్టికి నిర్ణయం.


2.  ఎక్స్ టెన్షన్ ఆఫ్ టైమ్(ఈవోటి)కి సంబంధించి జరిమానాలను సరళతరం చేసే విధివిధానాల దిశగా ఏపీఐఐసీ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. 01.04.2020కి ముందు చేసిన కేటాయింపుల కోసం 10 సంవత్సరాల వరకు ప్రాజెక్ట్‌ల అమలు కోసం గడువు పొడిగింపు (EoT)ని పరిగణనలోకి తీసుకునే మార్గదర్శకాల ఆమోదం.


3. అనుమతులిచ్చిన నాటికి ఉన్న భూమి ధరకు బదులుగా ఆలస్య జరిమానా రుసుము విధించడానికి వాణిజ్య ఉత్పత్తి (DCP) మొదలైన తేదీ నాటి భూమి ధరను పరిగణనలోకి తీసుకోవడానికి ఆమోదం.  


4. ఏపీఐఐసీకి చెందిన ఇండస్ట్రియల్ పార్కుల్లోని ఎమ్ఎస్ఎమ్ఈ యూనిట్లకు లోన్ తీసుకునే విధంగా బ్యాంకులు/ఆర్థిక సంస్థలతో ఎంవోయూలు కుదుర్చుకునే వెసులుబాటుకు బోర్డు  ఆమోదం.


5. వైఎస్ఆర్ జిల్లాలోని జగనన్న మెగా ఇండస్ట్రియల్ హబ్, వైఎస్ఆర్ ఈఎంసీ(కొప్పర్తి) తో పాటు  కర్నూలు జిల్లాలో ఓర్వకల్ నోడ్ లకు నీటి సరఫరా పథకం కోసం  అప్పులు/నిధులు లేదా గ్యారంటీ ఇవ్వడానికి లేదా ఎస్పీవీ(SPV)కంపెనీకి భరోసా అందించే నిర్ణయానికి ఆమోదం.


6. ఆక్యుపేషన్ చార్జీలను లెక్కించడానికి సంబంధించిన సరికొత్త మార్గదర్శకాలకు ఆమోదం.
Comments