ఖేలో ఇండియా యూత్ గేమ్స్ లో ఆంధ్రప్రదేశ్ పతకాల జోరు.

 

ఖేలో ఇండియా యూత్ గేమ్స్ లో ఆంధ్రప్రదేశ్ పతకాల జోరు.


ఆర్చరీ లో బంగారు పతకం తో మెరిసిన కుండేరు వెంకటాద్రి అండర్-18 (బాలురు మరియు బాలికల) విభాగములో ఈ నెల 3వ తేది నుండి 13 వ తేది వరకు హర్యానాలో జరుగుతున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2021 లో భాగముగా ఈరోజు ఆర్చరీ అండర్ 18 బాలుర ఫైనల్ రౌండ్లో కాంపౌండ్ 50 మీటర్స్ విభాగంలో కుండేరు వేంకటాద్రి మహారాష్ట్ర క్రీడాకారుడు పార్థ్ సునీల్ కోడె తో పోటీపడి 144-143 తో బంగారు పతకం కైవశం చేసుకున్నాడు. అలాగే బాలికల 50 మీటర్స్ కాంపౌండ్ విభాగంలో కాంస్య పతక పోరులో మాదాల సూర్య హంస పంజాబ్ క్రీడాకారిణి పర్నీత్ కౌర్ పై 143-141 తో విజయం సాధించి కాంస్య పతకం కైవశం చేసుకుంది. ఈ సందర్భంగా శాప్ విసి&యండి డా. నక్కల ప్రభాకర రెడ్డి గారు ఖేలో ఇండియా యూత్ గేమ్స్ కి ముఖ్య అతిథిగా విచ్చేసి గెలుపొందిన క్రీడాకారులకు పతకాలు బహూకరించారు..

Comments