సిఎస్ డా.సమీర్ శర్మను కలిసిన ఎస్బిఐ సిజిఎం నవీన్ చంద్ర ఝా

 సిఎస్ డా.సమీర్ శర్మను కలిసిన ఎస్బిఐ సిజిఎం నవీన్ చంద్ర ఝా 


అమరావతి,22 జూన్ (ప్రజా అమరావతి):స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా అమరావతి సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ నవీన్ చంద్ర ఝా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మను మర్యాదపూర్వకంగా కలిశారు. ఎస్బిఐ సిజిఎంగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన సందర్భంగా నవీన్ చంద్ర ఝా బుధవారం అమరావతి సచివాలయం మొదటి బ్లాకులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మను మర్యాద పూర్వకంగా కలిశారు.ఈసందర్భంగా ఇరువురు కొద్దిసేపు భేటీ కాగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వం అమలుచేస్తున్న వివిధ అభివృద్ధి సంక్షేమ పధకాలు,ముఖ్యంగా రైతులు,మహిళలు తదితర వర్గాలకు అమలు చేస్తున్న వివిధ పధకాల గురించి సిజిఎంకు వివరించారు.అలాగే పలు బ్యాంకు లింక్డ్ పధకాలు,ప్రాయోజిత కార్యక్రమాలు వాటి అమలు గురించి వివరించి ఆయా పధకాలు,కార్యక్రమాలను మరింత విజయవంతం చేసేందుకు ప్రభుత్వానికి తగిన తోడ్పాటును అందించాలని సిఎస్ డా.సమీర్ శర్మ ఎస్బిఐ చీఫ్ జనరల్ మేనేజర్ నవీన్ చంద్ర ఝాను కోరారు.

సిజిఎం నవీన్ చంద్ర ఝా మాట్లాడుతూ రాష్ట్రంలో అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి సంక్షేమ పధకాలు అమలులో స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా తరుపున అత్యంత ప్రాధాన్యతను ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు.

ఈకార్యక్రమంలో ఆర్ధికశాఖ ఇఓ కార్యదర్శి కె.సత్యనారాయణ,స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా అమరావతి సర్కిల్ కు చెందిన ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు.

    

Comments