బదిలీలు పారదర్శకంగా చేయండి

 


బదిలీలు పారదర్శకంగా చేయండి


అధికారులకు మంత్రి మేరుగు నాగార్జున ఆదేశాలు


అమరావతి, జూన్ 29 (ప్రజా అమరావతి): ఉద్యోగులు, ఉపాధ్యాయుల బదిలీలలో ఎక్కడ కూడా నిబంధనలు ఉల్లంఘించకుండా పారదర్శకంగా నిర్వహించాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున అధికారులను ఆదేశించారు. ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన గడువు 30వ తేదీ నాటితో ముగిసిపోతున్న నేపథ్యంలో సాంఘిక సంక్షేమశాఖకు చెందిన వివిధ విభాగాల్లో బదిలీలు జరుగుతున్న తీరును బుధవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సమీక్షించారు. సాంఘిక సంక్షేమశాఖ, ఎస్సీ గురుకులాలు, ఎస్సీ కార్పొరేషన్, లిడ్ క్యాప్ తదితర విభాగాలలో జరుగుతున్న బదిలీలను గురించి ఈ సందర్భంగా అడిగి తెలుసుకున్నారు. బదిలీల వ్యవహారంలో ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా అర్హత కలిగిన వారెవరికీ అన్యాయం జరగకుండా చూడాలని కోరారు. పరిపాలనా సౌలభ్యం తో పాటుగా మానవతా ధృక్పధంతోనూ నిర్ణయాలు తీసుకోవాలని అధికారులకు నాగార్జున సూచించారు. ఈ సమావేశంలో సాంఘిక సంక్షేమశాఖ కార్యదర్శి ఎం.ఎం.నాయక్, డైరెక్టర్ కే.హర్షవర్ధన్, గురుకులాల కార్యదర్శి పావనమూర్తి, లిడ్ క్యాప్ విసీఎండీ డోలా శంకర్, ఎస్సీ కార్పొరేషన్ జీఎం కరుణ కుమారి తదితరులు పాల్గొన్నారు.


Comments