శ్రీవారి ఆలయ మహాసంప్రోక్షణ కు హాజరు కండి
గవర్నర్ కు టీటీడీ చైర్మన్ ఆహ్వానం
తిరుమల 1 జూన్ (ప్రజా అమరావతి): అమరావతిలో టీటీడీ నిర్మించిన శ్రీవారి ఆలయ మహాసంప్రోక్షణకు హాజరు కావాలని టీటీడీ ఛైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి, జెఈవో శ్రీ వీరబ్రహ్మం గవర్నర్ శ్రీ బిశ్వ భూషణ్ హరిచందన్ ను ఆహ్వానించారు.
బుధవారం సాయంత్రం వీరు రాజ్ భవన్ లో గవర్నర్ ను కలసి ఆహ్వాన పత్రిక అందజేశారు. జూన్ 5వ తేదీ నుంచి ఆలయ మహా సంప్రోక్షణ కార్యక్రమాలు ప్రారంభం అవుతాయని చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి వివరించారు. జూన్ 9వ తేదీ ఉదయం 7.30 నుండి 8.30 గంటల మధ్య మహాసంప్రోక్షణ నిర్వహిస్తారని తెలిపారు. గవర్నర్ ను శాలువతో సన్మానించి స్వామివారి ప్రసాదాలు అందజేశారు.
addComments
Post a Comment