రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటనను విజయవంతం చేయాలి

 రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్  మోహన్ రెడ్డి పర్యటనను విజయవంతం చేయాలి*


*:  ఎమ్మెల్సీ మరియు ముఖ్యమంత్రి ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ తలశిల రఘురాం*


*: రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనకు అన్ని ఏర్పాట్లు త్వరితగతిన పూర్తి కావాలి*


*: జిల్లా అధికారులంతా సమన్వయంతో పనిచేయాలి*


*: జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్*


పుట్టపర్తి (శ్రీ సత్యసాయి జిల్లా), జూన్ 09 (ప్రజా అమరావతి):


రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈనెల 14వ తేదీన జిల్లాలోని చెన్నేకొత్తపల్లి మండలానికి వస్తున్న సందర్భంగా, రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ తలశిల రఘురాం పేర్కొన్నారు.


గురువారం పుట్టపర్తి కలెక్టరేట్ కార్యాలయంలోని స్పందన సమావేశ మందిరంలో జిల్లాలోని చెన్నేకొత్తపల్లిలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్ తో కలిసి ముఖ్యమంత్రి ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ తలశిల రఘురాం వివిధ శాఖల జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ , రామకృష్ణ ప్రసాద్ రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, ఇన్చార్జి జాయింట్ కలెక్టర్ నవీన్, డిఆర్ఓ గంగాధర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.


ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా జిల్లా అధికారులంతా సమన్వయంతో పనిచేయాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నూతన జిల్లా ఏర్పడిన అనంతరం జిల్లాకు వస్తున్నారని, ఎలాంటి లోటుపాట్లు రానీయకుండా ఏర్పాట్లన్నీ  పకడ్బందీగా పూర్తిచేయాలన్నారు. ప్రధాన వేదికను సిద్ధం చేయడం, స్టాల్స్ ఏర్పాటు, బ్యారికేడ్ల ఏర్పాటు తదితర అన్ని రకాల పనులు వెంటనే పూర్తి చేయాలన్నారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేపట్టడం చేయాలన్నారు. ముఖ్యమంత్రి పర్యటనలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు.


రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనకు అన్ని ఏర్పాట్లు త్వరితగతిన పూర్తి కావాలి : జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్*


రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనకు అన్ని ఏర్పాట్లు త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఈనెల 14వ తేదీన చెన్నేకొత్తపల్లిలో 2021 ఖరీఫ్ కు సంబంధించి రైతులకు పంట బీమా పంపిణీ కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటించనున్నట్లు, ముఖ్యమంత్రి పర్యటన కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేయాలన్నారు. జిల్లా అధికారులంతా సమన్వయంతో పనిచేసి సీఎం పర్యటనను విజయవంతం చేయాలన్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో హెలిప్యాడ్, సభా వేదిక, బారికేడ్ల ఏర్పాటు, తదితర అన్ని రకాల ఏర్పాట్లు వెంటనే పూర్తి చేయాలన్నారు. చెన్నేకొత్తపల్లి లో హెలిప్యాడ్ స్థలం త్వరితగతిన సిద్ధం చేయాలని, అక్కడ అన్ని రకాల ప్యాచ్ వర్క్ పూర్తిచేయాలని రహదారులు, భవనాల శాఖ జిల్లా ఇంజనీరింగ్ ఆఫీసర్ సంజీవయ్యను ఆదేశించారు. సభకు హాజరైన విఐపిలకు, ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించాలన్నారు. సీఎం పర్యటించే ప్రాంతంలో రహదారి సౌకర్యం కల్పించాలని పిఆర్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. సభాస్థలి వద్ద, రహదారుల్లో కార్యక్రమాలు చేపట్టాలని డిపివో విజయ్ కుమార్ ను ఆదేశించారు. సీఎం కాన్వాయ్ లో అంబులెన్స్ సౌకర్యం ఏర్పాటు చేయాలని, సభా వేదిక వద్ద మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని జిల్లా మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ పద్మావతికి సూచించారు. సీఎం పర్యటనపై రైతులకు అవగాహన కల్పించాలని, వారిని సమావేశానికి హాజరైన చూడాలని జిల్లా వ్యవసాయ అధికారి  శ్రీమతి విద్యావతిడ్వామా పిడి విజయ్ ప్రసాద్ తదితరులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. పంట బీమా పంపిణీకి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని, సభా వేదిక వద్ద వ్యవసాయ, ఉద్యాన, తదితర శాఖల ఆధ్వర్యంలో స్టాల్స్ ఏర్పాటు చేయాలని, లబ్ధిదారులతో ఇంటరాక్షన్ ఏర్పాట్లు చేయాలని జడ్పీ సీఈవో, జిల్లా వ్యవసాయ అధికారిని ఆదేశించారు. సభకు హాజరయ్యే ప్రజలకు పార్కింగ్ సౌకర్యం, భోజన ఏర్పాట్లు చేయాలని కదిరి ఆర్డీఓ రాఘవేంద్ర, పెనుకొండ, రామగిరి తహసీల్దార్ లను ఆదేశించారు. అలాగే వేదికపై సాంస్కృతిక కార్యక్రమాల ఏర్పాటు, తదితర అన్ని రకాల ఏర్పాట్లు సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి పర్యటన కోసం పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని జిల్లా ఎస్పీని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ముఖ్యమంత్రి పర్యటనలో ఎలాంటి లోటుపాట్లు ఎదురుకాకుండా అన్ని రకాల జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు.


ఈ సందర్భంగా రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ ఈనెల 14వ తేదీన చెన్నేకొత్తపల్లి వస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటనను విజయవంతం చేయాలన్నారు. రైతులకు పెద్ద ఎత్తున పంటల బీమా కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేయాల్సిన అవసరముందన్నారు. రైతుల కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నారని, వైఎస్సార్ జలకళ కార్యక్రమం కింద వేలాది మంది రైతులు బోరుబావుల తవ్వకాల కోసం రిజిస్ట్రేషన్లు చేసుకున్నారని, 5 మంది చొప్పున రైతులున్న సి హెచ్ సి గ్రూప్ లకు ట్రాక్టర్లను అందించడం జరిగిందని, మైక్రో ఇరిగేషన్ కు సంబంధించి రైతులు రిజిస్ట్రేషన్లు చేయడం జరుగుతోందన్నారు.


ఈ సమావేశంలో ఆర్డీఓ వరప్రసాద్, డిఎస్పీలు, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


Comments