*ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నగరాన్ని అభివృద్ధి చేస్తాం*.
.
* *రాష్ట్రంలోనే ఆదర్శవంతంగా... నగర రహదారులను తీర్చిదిద్దుతున్నాం*
* *రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఎస్.బి.అంజాద్ బాషా*...
* *నగరంలో రహదారుల అభివృద్ధి పనుల పురోగతిపై నగర మేయర్ సురేష్ బాబు, జేసీ సాయికాంత్ వర్మ, నగర కమిషనర్ ప్రవీణ్ చంద్ లతో కలిసి ప్రెస్ మీట్*
కడప, జూన్ 10 (ప్రజా అమరావతి): ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కడప నగరంలో రహదారులను అత్యంత సుందరంగా, రాష్ట్రంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దడం జరుగుతోందని.. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఎస్.బి.అంజాద్ బాషా పేర్కొన్నారు.
శుక్రవారం నగర పాలక సంస్థ విసి హాలులో... కడప నగరంలో రహదారుల అభివృద్ధి పనుల పురోగర్హిపై కడప పార్లమెంటరీ నియోజకవర్గ ఇంచార్జి, నగర మేయర్ కె.సురేష్ బాబు, జేసీ సాయికాంత్ వర్మ, నగర కమిషనర్ జి.ఎస్.ఎస్. ప్రవీణ్ చంద్ లతో కలిసి.. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఎస్.బి.అంజాద్ బాషా ప్రెస్ మీట్ నిర్వహించారు.
** ఈ సందర్బంగా ఉపముఖ్య మంత్రి అంజాద్ బాషా మాట్లాడుతూ.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పరిపాలన అనంతరం.. కడప జిల్లా అభివృద్ధి కుంటుపడిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో కడప జిల్లాను పూర్తిగా విస్మరించడం జరిగిందన్నారు. మళ్ళీ ఆయన తనయుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా భాద్యతలు చేపట్టిన నాటి నుండీ.. జిల్లా అభివృద్ధి పథంలో దూసుకుపోతోందన్నారు. కడప జిల్లాతో పాటు.. కడప నగరాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించారన్నారు. ముఖ్యంగా కడప నగరంలో రహదారులను సువిశాలంగా, అత్యంత సుందరంగా, ఆదర్శవంతంగా తీర్చి దుద్దుతున్నామన్నారు.
అభివృద్ధి, సంక్షేమం అనేవి రెండు కళ్ళుగా భావించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. గడిచిన మూడేళ్ళలో రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. సచివాలయ వ్యవస్థ ద్వారా.. సంతృప్తికరమైన, పారదర్శకమైన పాలనను పట్టణ స్థాయి నుండి గ్రామ స్థాయి వరకు అందిస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధిని చూసి ఓర్వలేని కొన్ని ప్రతిపక్షాలు కొన్ని మీడియాల ద్వారా అవాస్తవాలను.. ఏకపక్షంగా ఎత్తి చూపడం జరుగుతోందన్నారు.
తాజాగా.. నాణేన్ని ఒకవైపు మాత్రమే చూపిస్తూ.. కడప నగర రహదారుల అభివృద్ధిపై మీడియాలో.. దుష్ప్రచారాలు రావడం విచారకరం అన్నారు. మీడియా ఎప్పుడూ కూడా.. పారదర్శకంగా వార్తలను ప్రచురించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.2,300 కోట్ల వ్యయంతో రాష్ట్ర రహదారులను అభివృద్ధి చేయడం జరుగుతోందన్నారు. అందులో భాగంగా వైఎస్ఆర్ జిల్లాలో నాడు-నేడు ద్వారా.. 74 రోడ్ల అభివృద్ధి పనులకు సంబంధించి.. రూ.124.14 కోట్లతో అభివృద్ధి పనులను చేపట్టడం జరిగిందన్నారు. ఇప్పటికే రూ.103.44 కోట్లను వెచ్చించి 83.33% పనుల పురోగతి సాధించడం జరిగిందన్నారు. కడప నగరంలో ట్రాఫిక్ ను నియంత్రించేందుకు రహదారుల విస్తరణతో పాటు.. సుందరీకరణ పనులతో నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ది చేయడం జరుగుతోందన్నారు. గత ప్రభుత్వ హయాంలో నగర రహదారులు, సుందరీకరణపై.. రాష్ట్రానికి ఎన్ని మార్లు ప్రతిపాదనలు పంపినా... అనుమతులకు నోచుకోలేని పరిస్థితులను మీడియా గమనించే వుందని గుర్తుచేస్తున్నామన్నారు.
నగర రోడ్ల అభివృద్ధిలో భాగంగా... రాజీవ్ మా0ర్గ్ రహదారి అభివృద్ధి పనులకు రూ.3.8 కోట్లతో 27.8.2020 లో పరిపాలనా అనుమతులు రాగా.. 21.10.2021వ తేదీన శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. అప్పట్లో కోవిడ్ విఫత్తు కారణంగా కొంత కాలం, 37 చోట్ల ఎంక్రోజ్మెంట్స్ విషయంలో.. కొంతమేర పనుల పురోభివృద్ధిలో జాప్యం జరిగిందన్నారు. కాగా.. ఆక్రమణ దారులను సానుకూలంగా ఒప్పించి.. రాజీవ్ మర్గ్ రోడ్డుకు సంబంధించి.. ఇప్పటికే ఒకవైపు 790 మీటర్ల మేర సీసీ రోడ్డును పూర్తి చేయడం జరిగిందన్నారు. రాజీవ్ మార్గ్ రోడ్డు అభివృద్ధికి సంబంధించి.. రాష్ట్ర ప్రభుత్వం రూ.3.8 కోట్ల మేరా నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. అయితే.. నగరానికి తలమానికంగా ఆ మార్గాన్ని అన్ని రకాలుగా సుందరీకరణతో పాటు ఆహ్లాదకరంగా తీర్చిదిద్ధేందుకు.. నిర్ణయించిన నగరపాలక సంస్థ.. డి.ఎం.ఎఫ్. నిధుల నుండి రూ.1.10 కోట్లు, మున్సిపల్ కార్పోరేషన్ జనరల్ ఫండ్ ద్వారా రూ.1.5 కోట్లను ఉపయోగించి మొత్తంగా దాదాపు రూ.6 కోట్లతో రాజీవ్ మార్గ్ అభివృద్ధి పనులను చేపట్టడం జరిగిందన్నారు. అందరి సహకారంతో.. చిత్తశుద్దితో నగరాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేసేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నామన్నారు. ఇంకా.. నగరంలో మూడు రోడ్లకు సంబంధించి రూ.248 కోట్లు వెచ్చించడం జరుగుతోందన్నారు.
ఈ నేపథ్యంలో... రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధిని చూసి ఓర్వలేని పలువురు దుష్ప్రచాలు చేస్తున్నారన్నారు. నగరంలో వందల కోట్లతో.. రోడ్ల అభివృద్ధి పనులు పురోగతిలో ఉండడం అందరికీ తెలిసిన విషయమే. అయినా.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని మీడియాలు దుష్ప్రచారాలు చేయడం సరికాదన్నారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులకు మీడియా కూడా సహకరించాలని ఆయన కోరారు. మరో సంవత్సరంలోగా.. నగరంలో పెండింగులో ఉన్న అన్ని రోడ్లను సంపూర్తిగా అభివృద్ధి చేయడం జరుగుతుందని.. మీడియా ఎదుట యావత్ ప్రజానీకానికి తెలియజేయడం జరుగుతోందని ఉపముఖ్యమంత్రి తెలిపారు.
** నగర మేయర్ కె.సురేష్ బాబు మాట్లాడుతూ.. 2004-09 మధ్య కాలంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వ హయాంలో కడప నగరంలో ఎనలేని అభివృద్ధి జరిగిందన్నారు. అదే సమయంలో నగరంలో బుగ్గవంకపై ఐదు ఫ్లై ఓవర్ బ్రిడ్జిలు, రిమ్స్ ఆసుపత్రి, శిల్పారామం, యోగివేమన యూనివర్సిటీ మొదలైన అభివృద్ధి పనులు ఎన్నో జరిగాయన్నారు. అనంతరం ఏర్పాటైన రాష్ట్ర ప్రభుత్వ పాలనలో.. 10 ఏళ్ళ పాటు.. నగర అభివృద్ధి అధఃపాతాళంలో పడిపోయిందన్నారు. కేవలం నగర కార్పొరేషన్ జనరల్ ఫండ్, 14వ ఆర్థిక నిధుల ద్వారా మాత్రమే అప్పుడు నగర అభివృద్ధి సాగిందన్నారు. 2019లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక.. 10 ఏళ్లుగా కుంటుపడిన నగర అభివృద్ధికి.. మళ్లీ మోక్షం వచ్చిందన్నారు. నగర రోడ్ల అభివృద్ధి, సుందరీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులను మంజూరు చేయడం జరిగిందన్నారు. తదనంతరం.. ప్రపంచ విఫత్తు కోవిడ్ కారణంగా.. నగర అభివృద్ధి పనులకు కొంతవరకు ఆలస్యం జరగడం అందరికీ తెలిసిన విషయమే అన్నారు. గత ప్రభుత్వంలో నగర అభివృద్ధికి నిధులు కేటాయించక పోవడంతో.. పలు సమస్యలతో ప్రజలు సతమతం అయ్యేవారని.. మున్సిపాలిటీలో గ్రీవిన్స్ కోసం.. వందల సంఖ్యలో అర్జీలు వచ్చేవన్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో.. ప్రస్తుతం కేవలం పదుల సంఖ్యలో మాత్రమే.. అవికూడా భూమి సమస్యలకు సంబందించిన అర్జీలు అందుతున్నాయన్నారు. ఈ విషయాలను మీడియా గమనించి.. వాస్తవాలను మాత్రమే.. పత్రికల్లో ప్రచురించాలని మేయర్ సురేష్ బాబు ప్రెస్ మీట్ లో కోరారు.
** జేసీ సాయికాంత్ వర్మ మాట్లాడుతూ.. కడప నగర రహదారుల అభివృద్ధి పనులకు సంబంధించి.. రెండేళ్ల క్రితమే... పరిపాలన అనుమతులు వచ్చినా.. కోవిడ్ కారణంగా.. ఎదురైన లేబర్ కొరత, పలు సాంకేతిక సమస్యల కారణాలతో.. పనుల పురోగతిలో కొంత జాప్యం జరిగిందన్నారు. నగరంలో కేవలం రోడ్లను సాధారణంగా విస్తరించడంతో పాటు.. అత్యంత సౌకర్యవంతంగా సుందరీకరించేందుకు రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా.. ఎంక్రోచ్మెంట్ కోసం రోడ్లకు ఇరువైపులా ఉన్న వారిని ఒప్పించేందుకు కూడా.. కొంత సమయం పట్టిందన్నారు. ఈ విషయాన్ని.. గమనించిన మీడియా ప్రతినిధులు.. వాస్తవ అంశాలను మాత్రమే పారదర్శకంగా పత్రికల్లో ప్రచురించాలన్నారు.
ఈ కార్యక్రమంలో.. జిల్లా వ్యవసాయ సలహా మండలి (డాబ్) ఛైర్మెన్ సంబటూరు ప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment