రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనకు అన్ని ఏర్పాట్లు త్వరితగతిన పూర్తి కావాలి

 రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్  మోహన్ రెడ్డి పర్యటనను విజయవంతం చేయాలి*


*: రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనకు అన్ని ఏర్పాట్లు త్వరితగతిన పూర్తి కావాలి*


*: జిల్లా అధికారులంతా సమన్వయంతో పనిచేయాలి*


జిల్లా ఇంచార్జి మంత్రి వర్యులు మరియు రాష్ట్ర కార్మిక, ఉపాధి, ఫ్యాక్టరీస్ శాఖ మంత్రి వర్యులు:

గుమ్మనూరు జయరామ్, 


  సి .కె.  పల్లె (శ్రీ సత్యసాయి జిల్లా), జూన్ 11 (ప్రజా అమరావతి):


*రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈనెల 14వ తేదీన జిల్లాలోని చెన్నేకొత్తపల్లి మండలానికి వస్తున్న సందర్భంగా, రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలని

జిల్లా ఇంచార్జి మంత్రి వర్యులు మరియు రాష్ట్ర కార్మిక, ఉపాధి, ఫ్యాక్టరీస్ శాఖ మంత్రి వర్యులు:

గుమ్మనూరు జయరామ్  పేర్కొన్నారు.


శనివారం  సీకే పల్లి  మండలంలోని  ఎంపిడిఓ కార్యాలయంలోని  సమావేశ మందిరంలో  ఈనెల 14వ తేదీన చెన్నేకొత్తపల్లిలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో  రాష్ట్ర  ఐ సి డి ఎస్  శాఖ మాత్యులు  శ్రీమతి ఉష చరణ్  తో కలిసి ముఖ్యమంత్రి ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ తలశిల రఘురాం వివిధ శాఖల జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, 

ఎంపీ గోరంట్ల మాధవ , ఎమ్మెల్యేలు, మడకశిర  తిప్పేస్వామి, పెనుగొండ మాల గుండ్ల శంకర్నారాయణ,  కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి, పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి,  రాష్ట్ర పాఠశాల విద్య ఫీజు నియంత్రణ కమిటీ చైర్మన్ ఆలూరు సాంబశివారెడ్డి

జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్,  ఎస్పి రాహుల్  దేవ్ సింగ్,  జాయింట్ కలెక్టర్ నవీన్ , సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు

*ఈ సందర్భంగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వర్యులు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా జిల్లా అధికారులంతా సమన్వయంతో పనిచేయాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నూతన జిల్లా ఏర్పడిన అనంతరం జిల్లాకు వస్తున్నారని, ఎలాంటి లోటుపాట్లు రానీయకుండా ఏర్పాట్లన్నీ  పకడ్బందీగా పూర్తిచేయాలన్నారు. ప్రధాన వేదికను సిద్ధం చేయడం, స్టాల్స్ ఏర్పాటు, బ్యారికేడ్ల ఏర్పాటు తదితర అన్ని రకాల పనులు వెంటనే పూర్తి చేయాలన్నారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేపట్టడం చేయాలన్నారు. ముఖ్యమంత్రి పర్యటనలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం రాష్ట్ర  ఐ సి డి సి శాఖ మంత్రివర్యులు  మాట్లాడుతూ ఈనెల 14వ తేదీన చెన్నేకొత్తపల్లిలో 2021 ఖరీఫ్ కు సంబంధించి రైతులకు పంట బీమా పంపిణీ కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటించనున్నట్లు, ముఖ్యమంత్రి పర్యటన కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేయాలన్నారు. జిల్లా అధికారులంతా సమన్వయంతో పనిచేసి సీఎం పర్యటనను విజయవంతం చేయాలన్నారు.  అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 14వ తేదీన ముఖ్యమంత్రి పర్యటన  సీకే పల్లి నందు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం1.30 పలు కార్యక్రమాలలో పాల్గొంటారు  ముఖ్యమంత్రి పర్యటన కు సంబంధించిన కార్యక్రమాలలో విధుల్లో పాల్గొన్న అధికారులు నిష్పక్షపాతంగా మీ విధులు నిర్వర్తించాలని పేర్కొన్నారు. ఎలాంటి పొరపాట్లు తావు లేకుండా అధికారులు జాగ్రత్తగా పని చేయాలని తెలిపారుసీఎం పర్యటనపై రైతులకు అవగాహన కల్పించాలని,  బీమా పంపిణీకి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని,

  లబ్ధిదారులతో ఇంటరాక్షన్ ఏర్పాట్లు చేయాలని  సంబంధిత అధికారులను సూచించారు

 అలాగే వేదికపై సాంస్కృతిక కార్యక్రమాల ఏర్పాటు, తదితర అన్ని రకాల ఏర్పాట్లు సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటన కోసం పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు  చేయుచున్న మని తెలిపారు. 

 ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు

  

Comments