నెల్లూరు, జూన్ 17 (ప్రజా అమరావతి): ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు రీ పోలింగ్ కు అవకాశం లేకుండా ఎన్నికల సిబ్బంది తమకు కేటాయించిన విధులను సమర్థవంతంగా నిర్వహించేందుకు సన్నద్ధం కావాల
ని జిల్లా కలెక్టర్ శ్రీ కె వి ఎన్ చక్రధర్ బాబు పేర్కొన్నారు.
శుక్రవారం ఉదయం ఆత్మకూరు ఆంధ్ర ఇంజనీరింగ్ కళాశాలలో ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు నిర్వహించిన రెండో విడత శిక్షణా తరగతులను రిటర్నింగ్ అధికారి శ్రీ హరేంధిరప్రసాద్ తో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ లోనే సిబ్బందికి కేటాయించిన ఈవీఎం లకు సీళ్లు వేసి ఉన్నాయా, బ్యాటరీలు ఉన్నాయా,లేదా సరి చూసుకోవాలన్నారు. పోలింగ్ సెంటర్లో ఈవీఎంలు, వి వి ప్యాట్లు, బ్యాలెట్ యూనిట్ లు సరిచూసుకొని కనెక్షన్ ఇవ్వాలని, అనంతరం మాక్ పోలింగ్ నిర్వహించిన తరువాత ఓటింగ్ ప్రక్రియ ప్రారంభించాలన్నారు. చివరి ఓటరు ఓటు వేసిన తరువాత క్లోజ్ బటన్ నొక్కి సీల్ వేయాలని సూచించారు. పోలింగ్, కౌంటింగ్ పట్ల సిబ్బంది తమకు ఉన్న సందేహాలను పూర్తిస్థాయిలో నివృత్తి చేసుకుని పోలింగ్ కు సిద్ధం కావాలన్నారు. కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఎన్నికల విధులకు హాజరవుతున్న ఉద్యోగులు సురక్షితంగా విధులు నిర్వహించేందుకు డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కేంద్రాల్లో కోవిడ్ వాక్సినేషన్ చేయించుకోవాలన్నారు.
ముందుగా కలెక్టర్ ఈవీఎంలను క్షుణ్ణంగా పరిశీలించి శిక్షణలో సిబ్బంది నేర్చుకున్న విషయాలను అడిగి తెలుసుకుని, వారిచేత డెమో చేయించి వారి సందేహాలను నివృత్తి చేశారు.
కలెక్టర్ వెంట ఆత్మకూరు ఇంచార్జ్ ఆర్డిఓ, నోడల్ అధికారి శ్రీ బాపిరెడ్డి, ఏఆర్ఓ శ్రీ సోమ్లా నాయక్, ఎంసిసి సహాయ అధికారి శ్రీ సాంబశివారెడ్డి ఉన్నారు.
addComments
Post a Comment