అమరావతి (ప్రజా అమరావతి);
*–జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులతో స్పందన కార్యక్రమంపై క్యాంప్ కార్యాలయం నుంచి సీఎం శ్రీ వైయస్.జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష.*
*–ఉపాధిహామీ పనులు, గ్రామవార్డు సచివాలయాలు, ఆర్బీకేలు, వైయస్సార్ హెల్త్ క్లినిక్స్, ఏఎంసీయూ, బీఎంసీయూ, వైయస్సార్ డిజిటల్ లైబ్రరీలు, వైయస్సార్ అర్బన్ క్లినిక్స్, ఇళ్లపట్టాలు, హౌసింగ్, జగనన్న భూహక్కు భూరక్ష, స్పందన, ఖరీఫ్ సన్నద్ధత, జాతీయ రహదారులు, ఇరిగేషన్ ప్రాజెక్టులకు భూసేకరణ అంశాలపై సమీక్ష.*
*–అవినీతి నిరోధానికి ఏసీబీ యాప్‌పైనా సీఎం సమీక్ష.*
*ఈ సందర్భంగా సీఎం శ్రీ వైయస్.జగన్ ఏమన్నారంటే... :*
*ఉపాధి హామీ.*
– ఉపాధిహామీ పనులకు సంబంధించి నిర్దేశించుకున్న లక్ష్యాలను దాదాపుగా అన్ని జిల్లాలు చేరుకున్నాయి.
– రోజువారీ వేతనం కనీసంగా రూ.240లు వచ్చేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలి.
– కలెక్టర్లు, జేసీలు, పీడీసీలు, ఎంపీడీఓలు ఉపాధిహామీ పనులను క్రమం తప్పకుండా పర్యవేక్షించాలి, తనిఖీలు చేయాలి.
– దీనివల్ల పనుల్లో నాణ్యత కనిపిస్తుంది.
– రుతుపవనాలు ముందస్తుగా వచ్చే అవకాశాలున్నాయని చెప్తున్నారు.
– దీనివల్ల వ్యవసాయ పనులు కూడా ఊపందుకుంటాయి.
– ఈ మేరకు అన్ని పరిస్థితులనూ సమన్వయం చేసుకుంటూ ఉపాధి హామీ పనులకు సంబంధించి ప్రత్యామ్నాయ ప్రణాళిక కూడా సిద్ధంచేసుకోవాలి.
– గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, వైయస్సార్ విలేజ్ క్లినిక్స్, బీఎంసీలు, ఏఎంసీలు.. వీటన్నింటినీ త్వరగా పూర్తిచేయాలి.
– జిల్లాకలెక్టర్లు పూర్తిగా వీటిపై ధ్యాసపెట్టాలి.
– పూర్తికాని భనాలను వెంటనే పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలి.
– ఇందులో జాప్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేది లేదు:
– వీటి నిర్మాణాల విషయంలో వెనకబడ్డ జిల్లాల కలెక్టర్లు స్వయంగా పర్యవేక్షణ చేసి తమ పనితీరును మెరుగుపరుచుకోవాల్సి ఉంది:
*హౌసింగ్:*
– కొన్ని లే అవుట్లకు పెండింగ్‌లో ఉన్న అప్రోచ్ రోడ్లను, ల్యాండ్ లెవలింగ్ పనులను వెంటనే పూర్తిచేయాలి:
– దీనికి కావాల్సిన నిధులను మీకు ఈ వారంలోనే అందుబాటులోకి తీసుకు వస్తున్నాం.
– సుమారు రూ.700 కోట్ల నిధులను అందుబాటులోకి తీసుకు వస్తున్నాం:
– దీనివల్ల ఇక్కడ కూడా ఇళ్ల నిర్మాణ పనులను మరింత వేగవంతం చేయాలి:
– నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు కింద ఏప్రిల్ 28న విశాఖపట్నంలో లాంచ్ చేశాం.
– విశాఖపట్నంలో 1.24 లక్షల ఇళ్లు, రాష్ట్రవ్యాప్తంగా 1.79 లక్షల ఇళ్లను మంజూరుచేశాం.
– ఇక్కడ ఇళ్ల నిర్మాణం వేగంగా జరిగేలా చర్యలు తీసుకోవాలి. దీనిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి.
– కనీసంగా ప్రతినెలా 75వేల ఇళ్లు పూర్తయ్యేలా ప్లాన్ చేసుకోవాలి.
– కరెంటు, తాగునీటి సౌకర్యం, డ్రైన్లు ఈ సదుపాయాలన్నీకూడా కాలనీల్లో ఏర్పాటు చేయాలి.
–వీటికి అత్యధిక ప్రాధాన్యతనివ్వాలి.
– కోర్టుల కేసుల కారణంగా పంపిణీకాని ఇళ్లపట్టాల విషయంలో సీఎస్, సంబంధిత శాఖాధికారులు ఉన్నస్థాయిలో సమీక్షచేస్తారు:
– ఏ స్థలాలు న్యాయపరంగా సంక్లిష్టంగా ఉన్నాయో.. వాటిపై ప్రత్యామ్నాయ ప్రణాళిక సిద్ధం చేస్తారు:
– కేస్ బై కేస్ పరిశీలించి, సమీక్షించి.. వాటిపై ప్రణాళిక సిద్ధంచేస్తారు:
– 90 రోజుల్లోగా ఇళ్లపట్టాల పంపిణీకి సంబంధించి కొత్తగా లబ్ధిదారులుగా గుర్తించిన 2,11,176 మందిలో 1,12,262 మందికి పట్టాలు పంపిణీ, ఇంకా 4,718 మందికి పట్టాలు ముద్రిస్తున్నారు, వీరికి త్వరలోనే ఇస్తారు:
– మిగిలిన 98,914 మందికి అవసరమైన భూమిని వీలైనంత త్వరగా గుర్తించి పట్టాలు పంపిణీచేయాలి:
– టిడ్కో ఇళ్లకు సంబంధించి పనులు నాణ్యంగా ఉండాలి:
– మౌలిక సదుపాయాల కల్పనలో ఎలాంటి పొరపాట్లు ఉండకూడదు:
– ఈనెలాఖరు నాటికి టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించేలా చర్యలు తీసుకోవాలి:
*జగనన్న భూ హక్కు మరియూ భూ రక్షపథకం..*
– జగనన్న భూ హక్కు మరియు భూ రక్ష పథకం విప్లవాత్మకమైనది:
– గడచిన 100 ఏళ్ల తర్వాత చేపడుతున్న సమగ్ర సర్వే ఇది:
– నిర్దేశించుకున్న లక్ష్యంలోగా సర్వే పూర్తిచేయాలి:
– సమగ్ర సర్వే కింద చేపట్టాల్సిన ప్రక్రియకు సంబంధించి నిర్దేశించికున్న గడువులు కలెక్టర్లకు చదివి వినిపించిన సీఎం
– ఈ గడువును ప్రతి కలెక్టర్ నోట్ చేసుకోవాలన్న సీఎం.
– ఆ గడువులోగా ఈ పనులు జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలన్న సీఎం.
– సమగ్ర సర్వేపై ఎప్పటికప్పుడు సమీక్షచేసుకుని, లక్ష్యాలను అనుకున్న విధంగా చేరుకుంటున్నామో లేదో కలెక్టర్లు చూసుకోవాలి:
– ప్రతివారం దీనిపై సమీక్షచేసుకుని ముందుకుసాగితేనే సమగ్రసర్వేకోసం నిర్దేశించుకున్న లక్ష్యాలను పూర్తిచేయగలం:
– రోజువారీగా కూడా సర్వే పనుల ప్రగతిని నివేదిక రూపంలో తెప్పించుకోవాలి:
– అప్పుడే అనుకున్న గడువులోగా ఈ కార్యక్రమాలను పూర్తిచేయగలం:
– స్పందన అర్జీల పరిష్కారంపై సమీక్షించిన సీఎం.
– విధినిర్వహణలో పొరపాట్లను సరిదిద్దుకునే అవకాశాన్ని స్పందన కల్పిస్తోంది.
– స్పందన కింద వచ్చే అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టిపెట్టాలి:
– స్పందనను మనమే స్వచ్ఛందంగా చేపడుతున్నాం:
– సమస్యలను పరిష్కారించాలన్న తపన ఉండాలి :
– ప్రతి రోజు సచివాలయాల పరిధిలో మధ్యాహ్నం 3 గంటలనుంచి 5 గంటలవరకూ స్పందన చేపట్టాలి:
– జిల్లా, డివిజన్, మండలాలు, గ్రామ సచివాలయాల స్థాయిలో స్పందన ప్రతిసోమవారం నిర్వహించాలి:
– ఈ సమయంలో సంబంధిత అధికారులు కచ్చితంగా ఉండాలి:
– సంబంధిత అధికారులు స్పందన సమయంలో ఉంటున్నారా? లేదా? అన్నదానిపై సమీక్ష చేస్తాం:
– స్పందన సమయంలో అధికారులు లేకపోతే... అర్జీల పరిష్కారంలో నాణ్యత ఉండదు:
– స్పందన పోర్టల్‌లో కూడా దీనికి సంబంధించి కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నాం:
– అర్జీలపై క్షేత్రస్థాయిలో జరిపే విచారణలు, తనిఖీలకు సంబంధించిన ఫొటోలను పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలి:
– ఈ సమయంలో ఫిర్యాదు దారుడు కచ్చితంగా ఉండాలి:
– అర్జీపై అధికారులు ఫిర్యాదుదారుడితో కలిసి ఫీల్డ్ ఎంక్వైయిరీ చేస్తే.. దానికి మంచి ఫలితాలు ఉంటాయి:
– తన సమస్యను పట్టించుకున్నారన్న తృప్తి అర్జీదారుడికి ఉంటుంది:
– పౌర సమస్యలకు సంబంధించి ఫీల్డ్ ఎంక్వైరీలకు సంబంధించిన ఫొటోలే కాకుండా, తర్వాత ఆ సమస్యను పరిష్కరించిన తర్వాత, సరిదిద్దిన తర్వాతకూడా ఫొటోలు తీసి అప్‌లోడ్ చేయాలి:
– గడప గడపకూ.. కార్యక్రమం కింద ప్రతి ఎమ్మెల్యే నెలలో 10 సచివాలయాలను సందర్శిస్తున్నారు:
– ప్రతి ఎమ్మెల్యేకూడా ప్రతి ఇంటికీ వెళ్తున్నారు:
– ప్రభుత్వం చేసిన కార్యక్రమాలే కాకుండా, వారి సమస్యలను కూడా తెలుసుకుంటారు:
– సచివాలయ సిబ్బంది, వాలంటీర్లతో కలిసి వెళ్లి సమస్యలు తెలుసుకుంటారు :
– ఇది పూర్తిగా ప్రభుత్వ కార్యక్రమం:
–ప్రతి ఇంటికి జరిగిన లబ్ధిని తెలియజేస్తారు :
– ఈ క్రమంలో ఎమ్మెల్యేల వద్దకు వచ్చే సమస్యలను పరిష్కరించడంపై కలెక్టర్లు దృష్టిపెట్టాలి:
– స్పందన చాలా ప్రాధాన్య కార్యక్రమం:
దీన్ని మరింత సమర్ధవంతంగా, మెరుగ్గా తీర్చిదిద్దడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాం:
దీనికి సంబంధించి సీఎస్ ఇప్పటికే జీవో ద్వారా మార్గదర్శకాలు స్పష్టంగా తెలియజేశారు :
ఈ కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది:
సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ (ఎస్‌డీజీ) కూడా చాలా ముఖ్యమైన అంశం:
స్పందన, ఎస్‌డీజీల ఆధారంగా మీ పనితీరు మదింపు ఉంటుంది:
మహిళా, శిశు సంక్షేమాన్ని తీసుకుంటే... మనం గోరుముద్ద, సంపూర్ణ పోషణ కార్యక్రమంపై పెద్ద మొత్తంలో ఖర్చుపెడుతున్నాం:
గతంలో రూ.500 నుంచి రూ.600 కోట్లు ఖర్చు పెడితే మనం రూ.1800 నుంచి రూ.1900 కోట్లు గోరుముద్ద, సంపూర్ణ పోషణమీద ఖర్చు పెడుతున్నాం:
దీన్ని సమర్ధవంతంగా చెప్పాల్సిన అవసరం ఉంది:
విద్య, వైద్య ఆరోగ్యరంగాల్లో అభివృద్ధిని తీసుకుంటే... మనం చేపడుతున్న పనులు మరింత విస్తృతంగా పోవాల్సిన అవసరం ఉంది.
డీబీటీ మరే రాష్ట్రంలోనూ లేదు :
రూ.1.41 లక్షల కోట్లు మూడేళ్లలో డీబీటీ ద్వారా అందించాం:
ఈ సంఖ్య మరే రాష్ట్రంలోనూ లేదు :
కేవలం ఒక్క బటన్ నొక్కడం ద్వారానే ఎలాంటి అవినీతి, వివక్షకు తావులేకుండా అందించాం:
జాతీయ స్దాయిలో ప్రత్యేక ముద్ర వేయగలిగాం:
దేశవ్యాప్తంగా ఐఏఎస్‌లు, ఇతర ఉన్నతాధికారులందరూ మన ఎస్‌డీజీ సూచికల వైపే చూస్తున్నారు:
వీటన్నింటితో మన కలెక్టర్లు దేశంలోనే ఉత్తమ కలెక్టర్లుగా గుర్తింపు పొందాలి:
దీన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన అవసరం ఉంది:
మీరే నా కళ్లు, చెవులే :
మీ పనితీరే నా పనితీరు, మనందరి పనితీరు:
*సాగునీటి విడుదల.*
– జూన్ 1 నాటికి గోదావరి డెల్టాకు ఖరీఫ్‌కు సాగునీటిని విడుదల చేశాం:
– గతంలో ఎప్పుడూ కూడా ఇది జరగలేదు:
– తుపాన్ల నుంచి పంటను రక్షించుకోవడానికి వీలైనంత త్వరగా నారు వేసి పంటను చేతికి తెచ్చుకోవాలనే ప్రయత్నంలో భాగమే ఇది:
– జూన్ 10న కృష్ణాడెల్టాకు, గుంటూరు ఛానల్‌కు, గండికోట కింద, బ్రహ్మసాగర్, చిత్రావతి, వెలిగల్లు కింద పంట భూములకు సాగునీరు ఇస్తున్నాం:
– ఎస్సార్‌బీసీ కింద గోరకల్లు, అవుకులకు జూన్ 30న సాగునీరు ఇస్తున్నాం:
– ఎన్‌ఎస్‌పీ కింద జులై 15న నీటిని విడుదలచేస్తున్నాం:
– ఈ షెడ్యూల్ ప్రకారం నీటిని విడుదల చేయాలి:
– దీనిపై కలెక్టర్లు దృష్టిపెట్టాలి:
*వ్యవసాయ సలహా మండళ్లు...*
– వ్యవసాయ సలహామండళ్ల సమావేశాలు క్రమం తప్పకుండా జరిగేలా చూడాలి:
– ఆర్బీకే స్ధాయిలో తొలి శుక్రవారం, మండలస్ధాయిలో రెండో శుక్రవారం, జిల్లా స్ధాయిలో మూడో శుక్రవారం సమావేశాలు తప్పనిసరిగా జరగాలి:
అక్కడ వచ్చిన అంశాల పరిష్కారానికి కలెక్టర్ కృషి చేయాలి:
– పంటల ప్రణాళికను రూపొందించుకుని అమలు చేయాలి:
– ఆర్బీకేల్లో ఎరువులు, విత్తనాల పంపిణీ పారదర్శకంగా జరగాలి:
– ఆర్బీకేలో ఇచ్చే ఎరువులు, విత్తనాలు, పురుగు మందులకు నాణ్యతతో ఉండాలి:
– వాటిని పరీక్షించి.. రైతులకు అందించాలి:
– నాణ్యతకు మనం భరోసాగా ఉండాలి:
– రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలను ఆర్బీకేల్లో సిద్ధంగా ఉంచాలి:
– జూన్, జులైలో ఎక్కువ ఎరువులు అవసరం అవుతాయి :
– ఆమేరకు ప్లాన్ చేసుకుని వాటిని రైతులకు అందుబాటులో ఉంచాలి:
–డిమాండ్‌కు సరిపడా సరఫరా చేస్తూ.. ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలి:
– ప్రతినెలా జిల్లాల స్థాయిలో బ్యాంకర్ల సమావేశాలు నిర్వహించాలి:
– రైతులకు రుణాలు అందేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలి:
– ఖరీఫ్‌లో దాదాపు రూ.92వేల కోట్లరుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు:
– ఈ మేరకు రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలి:
– ఆర్బీకేల్లో బ్యాంకింగ్ కరస్పాండెంట్ ఉండేలా చర్యలు తీసుకోవాలి:
– క్రాప్ కల్టివేటర్స్ రైట్స్ కార్డ్స్ (సీసీఆర్స్) పై మరింత అవగాహన కలిగించాలి :
– ప్రతి కౌలురైతు సీసీఆర్స్ పొందాలి:
*వైయస్సార్ పొలంబడి*
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఉత్తమ సాగువిధానాలపై యునైటెడ్ నేషన్స్‌కు చెందిన పుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్(ఎఫ్‌ఏఓ)తో ఒప్పందం చేసుకుంది:
– సహజ, సేంద్రీయ వ్యవసాయ పద్ధతులపై రైతుల్లో అవగాహన కల్పించండి:
– ఈ ఉత్పత్తులకు మార్కెట్లో మంచి ధర ఉంది:
– రైతులకు పొలంబడి ద్వారా విజ్ఞానాన్ని అందించండి:
– దేశంలోనే తొలిసారి సహజ పద్ధతుల్లో పండించిన వ్యవసాయ ఉత్పత్తులకు సర్టిఫికెషన్‌కూడా ఇస్తున్నాం:
ఆర్బీకేల్లో ప్రతి పంటకు ఎంఎస్‌పి డిస్‌ప్లే చేస్తున్నారా లేదా అన్నది పర్యవేక్షించాలి:
ఇ– క్రాప్ రిజిస్ట్రేషన్‌ను కూడా పరిశీలించాలి:
*జాతీయరహదారులకు భూసేకరణ...*
– రోడ్లకు సంబంధించి రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులు నడుస్తున్నాయి:
– మండల కేంద్రాలను – జిల్లా కేంద్రాలను కలుపుతూ 2400 కి.మీ. రోడ్లకు రూ.6400 కోట్లు ఖర్చు చేస్తున్నాం:
– 3079 కి.మీకు సంబంధించి రూ. 29,249 కోట్ల విలువైన మరో 99 ప్రాజెక్టులకు సంబంధించి పనులు పురోగతిలో ఉన్నాయి:
– 2367 కి.మీ కు సంబంధించి రూ.29,573 కోట్లతో మరో 45 ప్రాజెక్టులు డీపీఆర్ దశలో ఉన్నాయి:
– బెంగుళూరు – విజయవాడ ఎక్స్‌ప్రెస్ హైవేకు సంబంధించి 332 కి.మీ రోడ్లు నిర్మాణ పనులను రూ.17500 కోట్లతో చేపడుతున్నాం:
– ఈ రోడ్లకు సంబంధించి భూ సేకరణ పనులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి:
–దాదాపుగా రూ.80 వేల కోట్లకు పైబడి పనులు చేపడుతున్నాం:
– ఈ రోడ్ల నిర్మాణంతో రాష్ట్ర జీఎస్‌డీపీ గణనీయంగా పెరగుతుంది:
– వీలైనంత త్వరగా అవసరమైన భూములను కలెక్టర్లు సేకరించాలి:
– అత్యంత వేగంగా ఈ ప్రక్రియను పూర్తిచేయాలి:
*రహదారుల మరమ్మతులు...*
– అలాగే రూ.2500 కోట్లతో రోడ్ల మరమ్మతులు కూడా జరగుతున్నాయి:
– పీఆర్ రోడ్లకోసం సుమారు రూ.1072.92 కోట్లు ఖర్చుచేస్తున్నాం:
– ఎక్కడా కూడా గుంతలు లేకుండా రోడ్లకు మరమ్మతులు చేస్తున్నారు:
– గడచిన ప్రభుత్వం పాలనలో ఐదేళ్లలో కూడా కనీసం రూ.1400 కోట్లు కూడా ఇవ్వలేదు:
– నాడు – నేడు కింద అభివృద్ధిచేసిన రోడ్లను ప్రజలముందు ఉంచండి:
– ఫొటో గ్యాలరీలు ఏర్పాటు చేయండి:
*ఇరిగేషన్ ప్రాజెక్టులకు భూసేకరణ:*
– రాష్ట్రంలో ప్రాధాన్యతగా నిర్దేశించుకున్న వివిధ ఇరిగేషన్ ప్రాజెక్టుల కింద ఇంకా పెండింగ్‌లో ఉన్న భూ సేకరణ, ఆర్ అండ్ ఆర్‌పై కార్యాచరణ సిద్ధంచేయండి:
– వీటికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వండి:
– ప్రాధాన్యతగా నిర్దేశించుకున్న ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టిపెట్టండి:
*జూన్‌నెలలో చేపడుతున్న కార్యక్రమాలు:*
– జూన్ 7న రైతన్నలకు 3800 ట్రాక్టర్లు సహా 5వేలకు పైగా వ్యవసాయ యంత్రాల పంపిణీ:
– జూన్ 14న పంటల బీమా పరిహారం చెల్లింపు:
– జూన్ 23న అమ్మ ఒడి.
addComments
Post a Comment