శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి,
విజయవాడ (ప్రజా అమరావతి):
గూడవల్లికి చెందిన శ్రీ A. కనకదుర్గా రావు, చల్లాయమ్మ గార్లు సుమారు 535 గ్రాములు బరువు కలిగిన వెండి కిరీటములు- 3 ను శ్రీయుత ఆలయ కార్యనిర్వహణాధికారి దర్భముళ్ల భ్రమరాంబ గారిని కలిసి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం నకు దత్తత దేవాలయమైన గూడవల్లి గ్రామం లోని శ్రీ కోదండ రామ స్వామి దేవస్థానమునకు కానుకగా అందజేసినారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి వారితో పాటుగా సహాయ కార్యనిర్వహణాధికారి శ్రీ ఎన్. రమేష్ గారు, శ్రీ కోదండ రామస్వామి వారి దేవస్థానం అర్చకులు శ్రీ బాల లక్ష్మీ నరసింహాచార్యులు పాల్గొన్నారు. ఆలయ అధికారులు దాత కుటుంబమునకు శ్రీ అమ్మవారి దర్శనము కల్పించి, అనంతరము శ్రీ అమ్మవారి ప్రసాదములు అందజేసినారు.
addComments
Post a Comment