నవజాత శిశు ఆరోగ్య పరిరక్షణలో భారత వైద్యుల కృషి
నవజాత శిశు ఆరోగ్య పరిరక్షణలో భారత వైద్యుల కృషి ప్రశంసనీయం ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రశంసలు అందుకుంటున్న భారత పీడియాట్రీషియన్ నూతన వైద్య ఆవిష్కరణలతో తగ్గిన శిశుమరణాలు అగ్రరాజ్యాలకు దీటుగా దేశంలో నియోనటా లజీ, పిడియాట్రిక్స్ సేవలు కోవిడ్, డెంగీ ల నుంచి వస్తున్న ముప్పు నుంచి బాలలను కాపాడగలగుతున్నాం నియోనటాలజీ, పిడియాట్రిక్స్ సదస్సులో వక్తలు విజయవాడ జూన్ 5 (ప్రజా అమరావతి);-నవజాత శిశు బాలల ఆరోగ్య పరిరక్షణలో భారత వైద్యుల కృషి ప్రశంసనీయంగా ఉందని, ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రశంశలను సైతం భారత పీడియాట్రీషియన్ అందుకుంటున్నారని పలువురు ప్రముఖ వైద్యులు పేర్కొన్నారు. రీసెంట్ అడ్వాన్స్ ఇన్ నియోనటాలజీ అండ్ పిడియాట్రిక్స్ అనే అంశంపై రెయిన్ బో చిల్డ్రన్స్ హాస్పిటల్, ఇండియన్ అకాడమీ ఆఫ్ పిడియాట్రిక్స్ ఆధ్వర్యాన నేడిక్కడి నోవాటెల్ హోటల్ లో జాతీయ స్థాయి సదస్సు జరిగింది. వివిధ రాష్ట్రాల నుంచి హాజరైన వైద్య ప్రముఖులు ఈ సదస్సులో మాట్లాడుతూ, అగ్రరాజ్యాలకు దీటుగా నియోనటాలజీ, పిడియాట్రిక్స్ సేవలను భారతీయ వైద్యులు అందజేస్తున్నారని, ప్రమాదకరమైన కొవిడ్, డెంగీ వ్యాధుల ముప్పు నుంచి మన బాలలను కాపాడుకోగలుగుతున్నామనీ చెప్పారు. ఈ సదస్సులో ప్రముఖ వైద్యులు, రెయిన్ బో చిల్డ్రన్స్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ రమేష్ కంచర్ల స్వాగతోపన్యాసం ఇస్తూ నియో నటాలజీ, పిడియాట్రిక్స్ విభాగం లో నూతన ఆవిష్కరణలు సమర్థవంతంగా మన దేశ వైద్యులు అంది పుచ్చుకుంటున్నారన్నారు. నవజాత శిశువుల్లో న్యూరో ప్రొటెక్షన్, న్యూరో ఇంటెన్సివ్ కేర్ కు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడం వల్ల శిశుమరణాలు తగ్గుతున్నాయని ఆయన చెప్పారు. కాలేయం, శ్వాస కోశం, హృదయ సంబంధ వ్యాధుల నుంచి భారతీయ వైద్యులు లక్షలాది మంది శిశువులను కాపాడగలగు తున్నారని డాక్టర్ రమేష్ కంచర్ల తెలియజేశారు. శిశు జననానికి ముందు జన్మించిన తర్వాత వారి ఆరోగ్య పరిరక్షణకు భారతీయ వైద్యులు చేస్తున్న సేవలను ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ప్రశంసిస్తోందని ఆయన చెప్పారు. రెయిన్ బో చిల్డ్రన్స్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ దినేష్ చిర్ల మాట్లాడుతూ కోవిడ్ తో పాటు ప్రపంచ వ్యాప్తంగా డెంగీ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వాటిని ఎదుర్కోవడానికి మన దేశ పీడియాట్రీషియన్ సిద్ధంగా ఉన్నారన్నారు. కేవలం 450 గ్రాముల బరువుతో జన్మించిన నవజాత శిశువు ను కాపాడిన ఘనత విజయవాడ రెయిన్ బో చిల్డ్రన్స్ హాస్పిటల్ కు దక్కిందని ఆయన చెప్పారు. బోన్ మేరో, కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ ల్లు మన వైద్యులు విజయవంతంగా చేయగలుగుతున్నారని ఆయన చెప్పారు. రెయిన్ బో చిల్డ్రన్స్ హాస్పిటల్ క్లినిక్ డైరెక్టర్ డాక్టర్ ఎస్. రాంప్రసాద్ మాట్లాడుతూ నవజాత శిశువుల్లో శ్వాస కోశాల పరిరక్షణకు అత్యంత ఆధునిక వెంటిలేటర్లు అందుబాటులోకి వచ్చాయన్నారు. నవజాత శిశువులకు జన్మించిన మొదటిరోజు నుంచే తల్లిపాలను ఇస్తే అనేక ఆరోగ్య సమస్యలు నివారించవచ్చునని డాక్టర్ రాంప్రసాద్ తెలియజేశారు. డాక్టర్ వంశీ శివరామరాజు ఉప్పలపాటి మాట్లాడుతూ, నవజాత శిశువులు బాలల ఆరోగ్య పరిరక్షణలో గత పదేళ్లుగా మన రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని, వారికి మన రాష్ట్రంలోనే హార్ట్ ఆపరేషన్లు , కీమో డయాలసిస్ చేస్తున్నామని ఆయన తెలియజేశారు. డాక్టర్ ప్రీతమ్ కుమార్ మాట్లాడుతూ, భవిష్యత్తులో వచ్చే కోవిడ్ వ్యాధి నివారణకు 12 ఏళ్లు దాటిన బాలలకు తప్పని సరిగా కోవిడ్ వ్యాక్సిన్ వేయించాలనీ సలహా ఇచ్చారు. డాక్టర్ శిరీష రాణి మాట్లాడుతూ, బాలల్లో కూడా క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయనీ, నిర్దిష్టమైన కారణాలు లేకపోయినా క్యాన్సర్ వస్తుండటం ఆందోళన కలిగిస్తోందని అన్నారు. ఈ సదస్సులో డాక్టర్ ప్రశాంత్ babina, డాక్టర్, వై. శాంతి కిషోర్, డాక్టర్, వి. నాగమల్లేశ్వరరావు, డాక్టర్, బి. ఎస్.సీ. పి. రాజు, డాక్టర్, ఎన్.హేమ కుమార్, డాక్టర్. శ్రీకాంత్ దోమల, డాక్టర్, ప్రసూన్ కొప్పర్తి, డాక్టర్, పి. రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సదస్సులో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సుమారు 400 మంది వైద్యులు పాల్గొన్నారు.
addComments
Post a Comment