ప్రభుత్వ భవన నిర్మాణాలను నిర్దేశించిన గడువు లోపల పూర్తి చేయాలి

 

నెల్లూరు (ప్రజా అమరావతి);రాష్ట్ర ప్రభుత్వం వివిధ కార్యక్రమాల కింద  అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ప్రభుత్వ  భవన నిర్మాణాలను నిర్దేశించిన గడువు లోపల పూర్తి చేయాల


ని పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ గోపాలకృష్ణ ద్వివేది, జిల్లా కలెక్టర్లకు సూచించారు. 


గురువారం వెలగపూడి సచివాలయం నుంచి  పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి  శ్రీ గోపాలకృష్ణ ద్వివేది, సంబంధిత శాఖల కమిషనర్లతో కలిసి గ్రామ సచివాలయాలు, హెల్త్ క్లినిక్ లు, రైతు భరోసా కేంద్రాలు, డిజిటల్ లైబ్రరీలు, జగన్న స్వచ్ఛ సంకల్పం, ఎన్ఆర్ఈజిఎస్, వైఎస్సార్ జలకళ, టాక్స్ కలెక్షన్ తదితర అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ గోపాలకృష్ణ ద్వివేది మాట్లాడుతూ, ప్రభుత్వ భవన నిర్మాణాల కోసం స్థల సమస్య లేకుండా సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు. భవన నిర్మాణాలకు కోర్టు సమస్యలు ఉన్నట్లయితే అవి త్వరగా పరిష్కారం అయ్యేటట్లు చూడాలని పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖ అధికారులకు సూచించారు.  రాష్ట్ర ప్రభుత్వం గ్రామ సచివాలయాల ద్వారా ప్రజలకు వివిధ సేవలు అందిస్తుందని, ప్రైవేటు భవనాలలో ఉండే గ్రామ సచివాలయలను ప్రభుత్వ భవనాలలోకి మార్చేందుకు సచివాలయ భవన నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలన్నారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ కు కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి  జిల్లా కలెక్టర్ శ్రీ కె.వి.ఎన్. చక్రధర్ బాబు, జడ్.పి. సిఈఓ శ్రీమతి వాణి,  డి.పి.ఓ శ్రీమతి ధనలక్ష్మి, డ్వామా పి.డి. శ్రీ తిరుపతయ్య, పంచాయతీ రాజ ఎస్.ఈ శ్రీ సుబ్రహ్మణ్యం, ఆర్.డబ్ల్యూ.ఎస్. ఎస్.ఈ శ్రీ  రంగ వర ప్రసాద్, వ్యవసాయ శాఖ జె.డి శ్రీ సుధాకర్ రాజు  తదితరులు పాల్గొన్నారు. 


 

వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ శ్రీ చక్రధర్ బాబు, సంబంధిత శాఖల జిల్లా అధికారులతో మాట్లాడుతూ, జిల్లాలో రైతు భరోసా కేంద్రాల నిర్మాణాలు, గ్రామ సచివాలయం భవనాలు, విలేజ్  హెల్త్ క్లినిక్ లు, డిజిటల్ లైబ్రరీలు, డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ ల నిర్మాణాలకు సంబంధించి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని,  సంబంధిత భవన నిర్మాణాలను త్వరగా పూర్తి చేసేందుకు  ఇంజనీరింగ్ అధికారులు ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలన్నారు. 


Comments