వెలగపూడి,సచివాలయం (ప్రజా అమరావతి);
*సమస్యల పరిష్కారానికి మేమున్నాం.*
*మీకోసం ఆలోచించే ముఖ్యమంత్రి మనకున్నారు.*
*సమ్మె ఆలోచన విరమించండి* .
మున్సిపల్ పారిశుధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించటానికి మేమున్నామంటూ రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ భరోసా ఇచ్చారు. పారిశుధ్య కార్మికుల యూనియన్ ప్రతినిధులతో మంత్రి సచివాలయం లోని 2వ బ్లాక్ లో సమావేశమై వారి సమస్యలపై చర్చించారు. ఈ సందర్బంగా మంత్రి సురేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి ఒక్కరి గురించి ఆలోచించినట్టే పారిశుధ్య కార్మికుల భవిష్యత్తు పై కూడా ముఖ్యమంత్రి సానుకూలంగా ఉన్నారన్నారు. గత పాలకులు ఎన్నికలకు ముందు కేవలం 1000 రూపాయలు మాత్రమే పెంచి 11వేల వేతనాన్ని 12 వేలు చేసారని, కానీ ఇప్పుడు మన ప్రభుత్వం 6వేలు పెంచటం ద్వారా 18 వేలు అయిందన్నారు. ఇందులో కూడా ఇబ్బందులు ఉన్నాయని నాయకులు సూచించటంతో అన్ని మున్సిపాలిటీ ల్లో అందరికీ 18 వేలు వేతనం అందే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పెండింగ్ బకాయిలు కూడా చెల్లించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. మొత్తం 14 అంశాలను మంత్రి ఎదుట నాయకులు ప్రస్తావించారు. మిగిలిన అన్ని అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని, మరోసారి సమావేశమై చర్చిద్దామని అన్నారు. సమ్మె ఆలోచన విరమించాలని ప్రభుత్వం పై నమ్మకంతో పని సూచించారు. ఈ సమావేశం లో స్పెషల్ సిఎస్ శ్రీలక్ష్మి, అడిషనల్ డైరెక్టర్ శివ పార్వతి పాల్గొన్నారు.
addComments
Post a Comment