ఓటు హక్కును వినియోగించుకునేలా అన్నీ ఏర్పాట్లు పూర్తి

  

నెల్లూరు (ప్రజా అమరావతి);


ఆత్మకూరు అసెంబ్లీ నియోజక వర్గ ఉప ఎన్నికల నేపధ్యంలో ఈ నెల 23వ తేదీన ఓటర్లు ప్రశాంత వాతావరణంలో స్వేచ్చగా  తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అన్నీ ఏర్పాట్లు పూర్తి


చేసినట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి  శ్రీ కె.వి.ఎన్. చక్రధర్ బాబు తెలిపారు. 


ఆత్మకూరులోని ఆంధ్ర ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటుచేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను బుధవారం   ఉదయం కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి శ్రీ కె.వి.ఎన్. చక్రధర్ బాబు, పరిశీలించి అధికారులకు, పోలింగ్ సిబ్బందికి పలు సూచనలు, ఆదేశాలు జారీచేశారు.  ఈ సందర్భంగా  పోలింగ్ సిబ్బందికి ఏర్పాటు చేసిన మెడికల్, వ్యాక్సినేషన్ కౌంటర్ ను, సూక్ష్మ పరిశీలకులకు ఏర్పాటుచేసిన కౌంటర్ ను, పరిశీలించారు. అనంతరం జిల్లా ఎన్నికల అధికారి శ్రీ చక్రధర్ బాబు మీడియాతో మాట్లాడుతూ, ఈ నెల 23వ తేదీ పోలింగ్ రోజున  ప్రశాంత వాతావరణంలో స్వేచ్చగా  ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అన్నీ ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందన్నారు. ఈ రోజు  సాయంత్రానికి  పోలింగ్ సిబ్బంది, సూక్ష్మ పరిశీలకులు, వెబ్ కాస్టింగ్ సిబ్బంది  వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకొంటారన్నారు.  రేపు ఉదయం 6 గంటలకు  మాక్ పోల్ తో పోలింగ్ ప్రక్రియ మొదలౌతుందన్నారు. నిర్ణయించిన క్రిటికల్ పోలింగ్ కేంద్రాల్లో  ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు  వెబ్ కాస్టింగ్ లైవ్ ఉంటుందన్నారు. ప్రతి రెండు గంటలకు నమోదైన  పోలింగ్ శాతం తెలియచేసే విధంగా అన్నీ ఏర్పాట్లు చేపట్టినట్లు  తెలిపారు. పోలింగ్ ప్రక్రియలో పాల్గొనే పోలింగ్ సిబ్బందికి కోవిడ్ వ్యాక్సినేషన్ వేసేలా డిస్ట్రిబ్యూషన్ సెంటర్ లో  ఒక ప్రత్యేక కౌంటర్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో కోవిడ్ ప్రోటోకాల్ ఖచ్చితంగా అమలు జరిగేలా అన్నీ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.  పోలింగ్ శాతాన్ని పెంచేలా అన్నీ పోలింగ్ కేంద్రాల పరిధిలో ఓటు హక్కు వినియోగంపై ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా, కళాజాతాలు ద్వారా అవగాహనా కార్యక్రమాలు ఏర్పాటు చేయడంతో పాటు, ఓటర్లందరికి ఓటరు స్లిప్స్ పంపిణీ చేయడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు. అలాగే పోలింగ్ స్టేషన్లలో విద్యుత్, తాగునీరు, టాయిలెట్స్, వికలాంగులకు ర్యాంపులు మొదలైన మౌలిక సదుపాయాల ఏర్పాట్లు చేయడం  జరిగిందన్నారు. ఆత్మకూరు అసెంబ్లీ  నియోజకవర్గ  పరిధిలోని ఓటర్లందరూ స్వచ్ఛందంగా పోలింగ్ కేంద్రాలకు వచ్చి   తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని  ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి  శ్రీ చక్రధర్ బాబు, నియోజకవర్గ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.


తొలుత ఆత్మకూరు అసెంబ్లీ నియోజక వర్గ ఉప ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జాయింట్ కలెక్టర్ శ్రీ హరెంధిర ప్రసాద్, ఆర్.డి.ఓ శ్రీ బాపిరెడ్డి పర్యవేక్షణలో డిస్ట్రిబ్యూషన్ కేంద్రానికి చేరుకున్న పోలింగ్ సిబ్బందికి పోలింగ్ మెటీరీయల్ ను పంపిణీ చేయడం జరిగింది. 


Comments