ప్రజలనుంచి వచ్చే వినతుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి:*‘గడపగడపకూ మన ప్రభుత్వం’పై వర్క్‌షాప్‌.*


అమరావతి (ప్రజా అమరావతి);

*ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో గడపగడపకూ మన ప్రభుత్వంపై వర్క్‌షాప్‌*


*–హాజరైన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.*

*–‘గడపగడపకూ మన ప్రభుత్వం’పై దిశానిర్దేశం చేసిన ముఖ్యమంత్రి.*

 

*వర్క్‌షాప్‌ను ప్రారంభిస్తూ మాట్లాడిన ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌*


ప్రతినెలా వర్క్‌షాపు: సీఎం

గడపగడపకూ అనేది నిరంతరాయంగా జరిగే కార్యక్రమం: 

దాదాపు 8 నెలలపాటు ఈ కార్యక్రమం జరుగుతుంది: 

ఒక్కో సచివాలయానికి 2 నుంచి 3 రోజులపాటు కేటాయింపు:

నెలకు 20 రోజులచొప్పున 10 సచివాలయాల్లో గడపగడపకూ కార్యక్రమం :

ఈ కార్యక్రమం పూర్తవడానికి కనీసం 8 నెలలు పడుతుంది : 

గడపగడపకూ కార్యక్రమాన్ని ఏ రకంగా చేశాం? ఎలా చేస్తున్నాం? ఇంకా ఎలా మెరుగుపరుచుకోవాలి? ఎలా సమర్థత పెంచుకోవాలి? అన్నదాన్నికూడా మనం నిరంతరంగా చర్చించుకోవాలి:

దీనికోసం నెలకోసారి వర్క్‌షాపు నిర్వహిస్తాం:

ఆ నెలరోజుల్లో చేపట్టిన గడపగడపకూ కార్యక్రమం, ఈ కార్యక్రమం ద్వారా మనకు వచ్చిన ఫీడ్‌ బ్యాక్‌పై ఈ వర్క్‌షాపులో చర్చిస్తాం:

ఇంకా మెరుగ్గా, సమర్థవంతంగా కార్యక్రమాన్ని ఎలా నిర్వహించాలన్నదానిపై ఈ వర్క్‌షాపుల్లో దృష్టిసారిస్తాం:

ప్రజాప్రతినిధుల నుంచి ఈ వర్క్‌షాపుల్లో సూచనలు, సలహాలు కూడా నిరంతరంగా తీసుకుంటాం, వాటిపై చర్చిస్తాం:

వర్క్‌షాపునకు హాజరైనవారు ఈ అంశాలను తెలుసుకునే అవకాశం ఏర్పడుతుంది:

దీనివల్ల మన ప్రయాణం మరింత మెరుగ్గా సాగుతుంది:


ప్రజలనుంచి వచ్చే వినతుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి:

గడపగడపకూ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులకు ప్రజలనుంచి వచ్చిన విజ్ఞాపనలు, ఆ విజ్ఞాపనల పరిష్కారంకూడా అత్యంత ముఖ్యమైనది:

ఈ ప్రక్రియ సజావుగా, సమర్థవంతంగా సాగడంపైన కూడా దృష్టిపెడుతున్నాం:

ప్రజలకు మంచి చేశాం... చరిత్రలో ముద్రవేశాం:

అన్నిచోట్లా గెలుపు అన్నది అసాధ్యం కాదు:


గత ఎన్నికల్లో 151 సీట్లు వచ్చాయి. వచ్చే ఎన్నికల్లో 175 కి 175 సాధించాలి:

ఇది మన లక్ష్యం, ఇది కష్టంకాదు:

ఎందుకంటే.. ప్రతి ఇంటికీ మీరు వెళ్తున్నారు, ప్రతి ఇంటికీ జరిగిన మేలును వివరిస్తున్నారు:

ఏయే పథకాలు ఆ కుటుంబానికి అందాయో చెప్తున్నారు:

ప్రతి అక్క,చెల్లి పేరుమీద లేఖ కూడా ఇస్తున్నారు:

మనకు ఓటు వేయని వ్యక్తికి కూడా కులం చూడకుండా, మతం చూడకుండా, రాజకీయాలు చూడకుండా, పార్టీలు చూడకుండా పారదర్శకంగా మేలు చేశాం:

చేసిన మంచికి సంబందించి లేఖలు తీసుకుని ప్రతి ఇంటికి వెళ్తున్నారు :

ప్రతి ఇంటికీ మేలు జరిగినప్పుడు.... ప్రజా ప్రతినిధులుగా మనకు ఏంకావాలి:

చరిత్రలో మనం ఒక ముద్ర వేశాం:

సంతృప్తి స్ధాయిలో గ్రామాల్లో తిరగగలుగుతున్నాం :

సంతృప్తిస్థాయిలో మంచి చేశామని చెప్పుకోగలుగుతున్నాం :

కాలర్‌ ఎగరేసుకుని తిరగగలుగుతున్నాం:

దేవుడి దయతో ఇవన్నీ చేయగలిగాం:

ప్రతి గ్రామాన్ని యూనిట్‌గా తీసుకుని మనం చేసిన అభివృద్ధి గ్రామాల్లోనే కనిపిస్తోంది:

నాడు –నేడు, గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్‌ క్లినిక్స్‌.. ఇలా ప్రతీదీ కనిపిస్తోంది:

ఇవేవీ కూడా గతంలో లేనే లేవు :

గ్రామంలో 10 మంది సిబ్బంది పనిచేసే పరిస్థితి గతంలో లేనే లేదు :

ఇక మనం చేయాల్సిందల్లా.. ప్రజల మద్దతును తీసుకోవడమే:

ఎవరైనా అనుకున్నామా? కుప్పంలో మున్సిపాల్టీ గెలుస్తామని?

ఎంపీటీసీలు, జడ్పీటీసీలు క్లీన్‌ స్వీప్‌చేస్తామని? ఇంతక ముందు ఎప్పుడూ జరగలేదు : 

ఈ సారి జరిగింది, ఎందుకు జరిగింది?:

ఎందుకంటే ప్రతి ఇంట్లో మంచి చేశామనే నమ్మకం మనకు ఉంది :

అలాగే 175కి 175 సాధించగలుగుతాం:

ఇది జరగాలి అంటే.. మనం కష్టపడాలి:


9 గంటలకు పగటిపూట కరెంటు ఇచ్చే ప్రక్రియ మన హయాంలో జరుగుతోంది:

మనం వచ్చినప్పుడు రూ.1700 కోట్లు ఖర్చుపెడితే తప్ప సాధ్యపడదు అంటే అదీ చేశాం :

ఆ ఖర్చు పెట్టిన తర్వాత ఇప్పుడు పగటిపూట ఉచిత కరెంటు ఇచ్చే పరిస్థితి ఇప్పుడు మెరుగైంది: 

ఈ రోజున్న ప్రత్యేకమైన పరిస్థితులు గతంలో ఎప్పుడూ లేవు:

అటువంటి పరిస్థితుల్లో కూడా కరెంటు లోటు రాకుండా అడుగులు మందుకు వేస్తున్నాం :

ఈ రోజు ఉక్రెయిన్‌ యుద్దంతో పాటు రకరకాల కారణాలు వల్ల బొగ్గు రేటు ఎన్నడూ లేని విధంగా ఉంది:

అయినప్పటికీ కూడా రూ.40 కోట్లు రోజుకి అదనంగా బొగ్గు కొనుగోలుకి ఖర్చవుతున్నా మంజూరు చేస్తున్నాం:


*వివక్ష, పక్షపాతం లేకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పథకాలు:*

రాష్ట్రంలోని 87శాతం కుటుంబాలకు పథకాలు చేరాయి:

ప్రతి సచివాలయంలోనూ కచ్చితంగా 2–3 రోజులు గడపగడపకూ నిర్వహించాలి:

ప్రతి సచివాలయంలోనూ పొద్దుట నుంచి సాయంత్రం 6–7 గంటల వరకూ గడపగడకూ నిర్వహించాలి:

ప్రతి నెలలో 10 సచివాలయాలు నిర్వహించేలా ప్రణాళిక వేసుకోవాలి:

ప్రతి నెలలో 20 రోజులు గడపగడపకూ నిర్వహించాలి:

ప్రతి ఇంటికి మంచి చేశామని తలెత్తుకొని చెప్పే పరిస్థితి మనకు ఉంది:

పెద్ద మార్పు జరిగింది: 

ప్రతి గ్రామంలోనూ మనం చేసిన అభివృద్ది స్పష్టంగా కనిపిస్తోంది:

ఆర్బీకేలు, విలేజీ క్లినిక్‌లు, నాడు–నేడు స్కూళ్లు, గ్రామ సచివాలయం కంటికి కనిపిస్తున్నాయి:

గతంలో ఇవేవీ లేవు, ఇప్పుడు ఉన్నాయి :

పది మంది సిబ్బంది పనిచేసే పరిస్థితి ఇంతకుముందు లేదు ?

ఇది అభివృద్ది కాదా ? 

గ్రామంలో ప్రతి కుటుంబాన్ని కలిసిన తర్వాత వారితో మిస్డ్‌కాల్‌ చేయించడం అన్నది చాలా ముఖ్యం:

కార్యక్రమాన్ని నాణ్యతతో చేయడం అన్నది చాలా ముఖ్యం:

అర్హత ఉన్నవారు ఎవ్వరికీ కూడా పథకాలు అందలేని పరిస్థితి ఉండకూడదు:

ఎవరైనా పొరపాటన మిస్‌ అయివారికి, కొత్తగా అర్హత సాధించిన వారికి ప్రతి ఏటా 2 సార్లు పథకాలు వర్తింపు:

ఏటా జులై, డిసెంబర్‌లో వారికి వర్తింపు:

పథకాలకు అర్హత సాధించిన వారి అర్జీలు తీసుకుని, నిర్ధారించుకుని, పరిష్కరించి.. మంజూరు పత్రాలు ఇచ్చి జులై, డిసెంబర్‌లలో వర్తింపు చేస్తున్నాం:అందరికీ  ప్రత్యర్థులం మనమే:

ఎక్కడెక్కడ ఉన్నవారంతా కలుస్తారు:

అందుకే రానున్న రోజుల్లో ఎల్లోమీడియా సాయంతో మరింత దుష్ప్రచారం చేస్తారు:

చేయని పన్నాగమంటూ ఉండదు :

ఎందుకంటే ప్రజల దగ్గర చెప్పడానికి వారు చేసింది ఏమీ లేదు:

దేవుడి దయవల్ల ప్రతి కుటుంబానికీ మనం మేలు చేశాం:

ఈ ప్రతిష్టను దెబ్బతీయడానికి చాలా కుయుక్తులు పన్నుతారు:

వారి దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి:

దీనంతటికీ పరిష్కారం మనం ప్రజల్లో ఉండడమే, వారితో మమేకం కావడమే, వారికి నిరంతరం చేదోడుగా నిలవడమే :

Comments