ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు శ్రీమతి గజ్జల వెంకట లక్ష్మి గారు నెల్లూరు సఖి వన్ స్టాప్ సెంటర్ ను షేక్ మలన్ సుల్తానా VS షేక్ కాలేష్మ గృహ హింస కేసులో స్వయంగా కౌన్సిలింగ్ నిమిత్తం సందర్శించినారు. భాదితురాలితో మాట్లాడి ,ఆమె ఆవేదనను అర్ధం చేసుకుని న్యాయం చేస్తానని భరోసా ఇచ్చారు. అమె భర్త కౌన్సిల్లింగ్ కు రాలేదని, అతని ప్రవర్తన పై మండి పడిన శ్రీమతి గజ్జల వెంకట లక్ష్మి గారు అతనికి సమన్లు ఇవ్వమని, మహిళా కమీషన్ కార్యాలయానికి ఫార్వార్డ్ చేసినారు. అతని పై తదుపరి చర్యలను చాలా కఠినంగా తీసుకోవాలని పోలీసు వారిని ఆదేశించినారు. తరువాత మరో రెండు గృహ హింస కేసులకు కౌన్సిల్లింగ్ లు
చేసినారు, అలాగే పలువురు మహిళలు వారి భర్త మరియు అత్త మామల వేదనల నుండి రక్షణ కల్పించాలని కోరగా, మహిళా కమిషన్ సభ్యురాలు గజ్జల లక్ష్మిగారు అక్కడి పోలీస్ అధికారులతో మాట్లాడి చర్యలకు ఆదేశించారు.
తదుపరి సఖి రికార్డులను తనిఖీ చేశారు. సఖి సిబ్బందితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఆశ్రయం పొందుతున్న వారికి మెరుగైన వసతి, భోజన సదుపాయాలు కల్పించాలని కోరినారు. ఎన్నో ఇబ్బందులతో ఆశ్రయం పొందేందుకు వచ్చేవారికి జీవితంపై భరోసా కల్పిస్తూ వారికి ఒక మంచి ఆరోగ్యకర వాతావరణం ఏర్పరచాలని మరియు ఆశ్రయం పొందేవారికి భద్రత కల్పించాలని సఖీ సిబ్బందిని ఆదేశించినారు. తదుపరి డి.వి సెల్ మరియు దిశ పోలీసు స్టేషన్ ని సందర్శించి ఆక్కడి భాదితులతో మాట్లాడి, వారికి మెరుగైన సేవలు సత్వరమే మహిళలకు అందించాలని కోరినారు. సదరు పర్యటనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు శ్రీమతి గజ్జల వెంకట లక్ష్మి గారితో జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమా మరియు సాధికారత అధికారిణి పి.ఉమా మహేశ్వరి గారు, SPSR నెల్లూరు జిల్లా, సఖి వన్ స్టాప్ సెంటర్ అడ్మినిస్ట్రేటర్ శ్రీమతి షేక్ షహానాజ్, దిశ మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ రమణ, మహిళా సబ్ ఇన్స్పెక్టర్స్ మరియు అల్లూరు పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్, డి. వి.సెల్ ప్రియ దర్శిని, సఖి కౌన్సిలర్ కమల మరియు సఖి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
సెంటర్ అడ్మినిస్ట్రేటర్ వన్ స్టాప్ సెంటర్ (సఖి) శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా.
addComments
Post a Comment