ఎన్నికల రాజకీయ ప్రకటనలు జారీ చేసేందుకు ఆయా అభ్యర్ధులు తప్పనిసరిగా ముందస్తు అనుమతి తీసుకోవాలి


నెల్లూరు జూన్ 14 (ప్రజా అమరావతి);


        

ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలలో ప్రవర్తనా నియమావళిని అమలు చేయడంలో,  అభ్యర్ధుల ఎన్నికల ప్రచార ఖర్చు లెక్కింపులో మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ ముఖ్య పాత్ర పోషిస్తుందని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి శ్రీ కె వి యన్ చక్రధర్ బాబు తెలిపారు.


మంగళవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా ఎన్నికల అధికారి మీడియా సర్టిఫికేషన్  మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి ఎన్నికల రాజకీయ ప్రకటనలు, చెల్లింపు వార్తలు పై సభ్యులతో చర్చించారు. అనంతరం జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ, ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయినప్పటి నుండి ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియాల్లో ప్రసారమవుతున్న ఎన్నికల రాజకీయ ప్రకటనలు మరియు చెల్లింపు వార్తలను గుర్తించి ఎప్పటికప్పుడు ఆయా అభ్యర్ధుల ఖాతాల్లో నమోదు చేయడం జరుగుతుందన్నారు. అదేవిధంగా ఎన్నికల రాజకీయ ప్రకటనలు జారీ చేసేందుకు ఆయా అభ్యర్ధులు తప్పనిసరిగా ముందస్తు అనుమతి తీసుకోవాల్సి


ఉంటుందన్నారు. ఇప్పటివరకు నమోదైన చెల్లింపు వార్తలను గుర్తించి ఆయా అభ్యర్ధుల ఖాతాల్లో నమోదు చేయుటకు కమిటీ ఏకగ్రీవంగా ఆమోదించింది.

        

ఈ సమావేశంలో మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ సభ్యులు దక్కన్ క్రానికల్  కరస్పాండెంట్ పి.రాజశేఖర్, దూరదర్శన్ కరస్పాండెంట్ యం శ్రీధర్ రెడ్డి, వార్త దినపత్రిక రిపోర్టర్

వి .శ్రీధర్, జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి వేంకటేశ్వర ప్రసాద్ లు పాల్గొన్నారు.

 

Comments